నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 16:13 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో, ‘‘సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును...’’ అవును, సత్యస్వరూపియై ఉన్న ఆత్మయై యున్నది! పిలాతు యెదుట యేసు నిలువబడినప్పుడు, పిలాతు ఆయనను ఇలా ప్రశ్నించెను, ‘సత్యము అనగా ఏమిటి?’ యేసు అవును, సత్యస్వరూపి! యేసు పిలాతు ముందు నిలువబడినప్పుడు, పిలాతు ఆయనను, సత్యం అంటే ఏమిటి? అని అడిగాడు. యేసు అప్పటికే ఇలాగున జవాబిచ్చాడు, ‘‘సత్యాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి నేను వచ్చాను.’’ కానీ, పిలాతు ఇంకా ‘ సత్యం అంటే ఏమిటి?’ అని ప్రశ్నించాడు. నా స్నేహితుడా, ‘సత్యం అంటే ‘ఏమిటో’ కాదు; సత్యం అంటే ‘ఆయనే.’ అవును, ఆ యొక్క సత్యం యేసు మాత్రమే!

నా ప్రియులారా, ఈ రోజు సత్యము కొరకు ప్రజలు దేశవ్యాప్తముగా వెదకుచున్నారు. సత్యమును వెదుక్కుంటూ పర్వతములలోనికి మరియు జలములలోనికి, లోయలలోనికి వారు  సత్యము కొరకు వెదుక్కుంటూ వెళ్లుచున్నారు. కానీ, యేసు సెలవిచ్చుచున్నాడు, ‘‘నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు.’’ అవును, ‘‘నేనే సత్యమును, సత్యము కాక మరి ఏదియు కాదు.’’ అవును, ఆయన మాత్రమే పవిత్రుడు, ఆయన మార్పులేనివాడు మరియు నిత్యుడైన పరమ సత్యం ఆయన ఒక్కడు మాత్రమే. కనుకనే, నేడు మీరు సత్యమును కలిగియున్నప్పుడు మీరు స్వతంత్రులుగా ఉంటారు. పాపము మరియు శాపము నుండి మీరు స్వతంత్రులుగా జీవిస్తారు. నేడు మీరు మీ నుండి కూడా స్వతంత్రులుగా ఉంటారు. ఇంకను యేసు స్వరూప్యములోనికి రూపాంతరపరచబడతారు. ఈ రోజున ఆ యేసునకు మొఱ్ఱపెట్టండి, చెప్పండి, ‘ప్రభువా, నీవే సత్యముగా ఉన్నావు, అబ్దములతో నిండియున్న ఈ లోకములో మేము జీవించుచున్నాము సత్యమును కనుగొనడము కొరకు, మానవుడు సంసిద్ధము చేసిన మార్గములలో వెదకుచున్నారు. కానీ, ప్రభువైన యేసయ్యా, నీవే ఆ సత్యమై యున్నావు, నీవు మాకు కావాలి, సత్యస్వరూపియైన ఆ ఆత్మ, సత్యమైయున్న యేసు యొక్క ఆత్మ,’ అని మీరు అట్టి ప్రార్థన మీ హృదయపూర్వకముగా చేసినప్పుడు, యేసు మీలోనికి వస్తాడు. సత్యస్వరూపియైన ఆత్మ మరియు యేసు యొక్క ఆత్మ బలముగా మీలోనికి ప్రవేశించును. అప్పుడు మీ యొక్క ఆత్మ మరియు ఆయన ఆత్మ ఐక్యమై, మీరు దైవీకమైన సత్యముతో నింపబడినవారు అవుతారు. సత్యము అనగా, యేసు. 

నా ప్రియులారా, యేసు దేహమందు పొందుపరచబడిన పరిశుద్ధతయై ఉన్నాడు. యేసు దేహమునందు పొందుపరచబడిన ప్రేమయై యున్నాడు. ఈ లోకములో జీవితము కొరకు నిరీక్షణ కలిగించే దేవుని ప్రేమ మీలో కలిగి ఉంటారు. ఎటువంటి కష్టములు వచ్చినను సరే, ‘‘నా ప్రియ బిడ్డా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ శక్తి చేత నిన్ను జీవింపజేసెదను’’ అని స్వరమును మీలో నుండి వినబడుతుంది. ఎటువంటి పాపము లేక భోగేచ్ఛలు వచ్చినప్పటికిని, సత్యస్వరూపియైన ఆత్మ, ప్రశస్తమైన పవిత్రపరచబడిన స్థితిలో ఉండునట్లుగా మిమ్మును లేవనెత్తుతాడు. ఈ యొక్క సత్యము మీ యొక్క పాపము, విచారము, ఆవేదన నుండి మిమ్మును స్వతంత్రులనుగా చేయును. యేసు మాత్రమే ఆ యొక్క సత్యము. కనుకనే, మీ జీవితాన్ని ఆయనకు స్వాధీనము చేయండి, నేను ఇప్పుడే మీ నిమిత్తము ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అవును, యేసు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, ‘‘నేను నీ హృదయమను ద్వారము నొద్ద నిలువబడి తట్టుచున్నాను, నీవు గనుక నీ హృదయమును తెరచినట్లయితే, నేను నీలోనికి వచ్చెదను, ఇంకను నా సత్యమును మీకిచ్చుచూ నేను మీతో కలిసి ఉంటాను, ఇంకను మీతో కలిసి రాత్రి భోజనము చేతును, మీరు విడుదల పొందినవారు అవుతారు. మీరు పాపము నుండి విచారము నుండి విడుదలను పొందినవారు అవుతారు. కుమారుడు ఎవరిని స్వతంత్రులనుగా చేయునో వారు నిజముగా స్వతంత్రులుగా ఉంటారు. ఈ లోకపరమైన శక్తులు మిమ్మును బంధించుటకు ప్రయత్నించవచ్చును గానీ, ఈ లోకపరమైన వైఫల్యములు మరియు భయములు మిమ్మును బంధించవచ్చును గానీ, ఈ లోకపరమైన చింత అవిశ్వాసము మిమ్మును బంధించవచ్చును గానీ, యేసు ప్రేమ మీకు విడుదలను అనుగ్రహించును. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన ఎల్లవేళల మీతో కూడా ఉంటాడు, మీకు విడుదలను అనుగ్రహిస్తాడు. కనుకనే నేడు ప్రతి ఆశీర్వాదమును మీరు ఆయనలో ఆనందించండి. మీ విచారమును, అంగలార్పు పూర్తిగా ఎరిగిపోతాయి. తద్వారా, మీరు అత్యధికమైన విజయమును పొందినవారు అవుతారు. దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము ద్వారా సత్యమును పొందుకొనండి, సత్యములో జీవించండి, విచారము మరియు అంగలార్పు నుండి విడుదలను పొందండి. యేసు ప్రేమను అనుభూతి చెంది ఆనందించండి, యేసుతో జీవించండి, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. 

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును నడిపించడానికి మరియు విడిపించడానికి సత్యమైన యేసును పంపినందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మాలోనికి ఇప్పుడే నీవు ప్రవేశించుము. సత్యస్వరూపియైన ఆత్మతో మమ్మును నింపుము. దేవా, మాలో ఉన్న ప్రతి విధములైన బంధకముల నుండి నీ యొక్క సత్యము ద్వారా మేము విడుదల పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితాన్ని నీకు అప్పగించుచున్నాము. దేవా, దయచేసి నీ సత్యస్వరూపియైన ఆత్మతో మమ్మును నింపుము. యేసయ్యా, అబద్ధాలు మరియు గందరగోళంతో నిండిన ఈ లోకములో, నీ దైవీకమైన సత్యంలో నడవడానికి మాకు  సహాయం చేయుము. దేవా, మా ప్రతి పాపం, దుఃఖం మరియు భయం నుండి మమ్మును విడిపించి, మమ్మును నీ స్వరూపంలోనికి మార్చుము. దేవా, నీ పవిత్రత మరియు ప్రేమ మాలో నివసించునట్లుగాను మరియు నిన్ను ప్రేమించుచున్నాము, కనుకనే, ‘నా బిడ్డా, ’ అని చెప్పు నీ స్వరాన్ని మేము వినునట్లు చేయుము. ప్రభువా, మమ్మును పవిత్రపరచుము మరియు నీవు ఎన్నుకున్నవారినిగా మేము నీలో జీవించడానికి మాకు కృపను దయచేయుము. దేవా, మా హృదయం నిన్ను మాత్రమే వెదకునట్లుగా కృపను చూపుము. ప్రభువా, నీ సత్యం మా జీవితంలో ప్రకాశింపజేయుమని సత్యస్వరూపియైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.