నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 50:7వ వచనము తీసుకొనబడినది. ఇది మన నిమిత్తమైన దేవుని వాగ్దానముగా ఉన్నది. ఆ వచనము, "ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు...'' ప్రకారం ఈ లోకములో అత్యంత భయానకమైన పరిస్థితి ఏమనగా, మనము సిగ్గునొందవలసినట్టుగా ఉంటుందేమో? అన్న తలంపు మనలో కలుగుతుంది. నా ప్రియులారా, మనము నడవలేక, ముందుకు సాగివెళ్లలేక ఉన్నప్పుడు, ప్రజలు మన వైపు చూచినప్పుడు, మనకు ఎంతో సిగ్గునొందినట్లుగా ఉంటుంది. మన యొక్క పనిలో చాలినంతగా ప్రదర్శన మనము చేయలేకపోయినప్పుడు, పరీక్షలలో ఉత్తీర్ణత పొందలేని పరిస్థితులలో మనము ఎంతగానో సిగ్గు నొందిన వారిగా ఉంటాము. మనము తప్పు మాటలను మాట్లాడినప్పుడు, ప్రజలు మన నుండి దూరంగా వెళ్లిపోతారు. అప్పుడు మనకు ఎంతగానో సిగ్గు నొందిన అనుభూతి కలుగుతుంది. మనము పాపమును జరిగించియున్నప్పుడు, మన స్వంత ప్రాణము మనకు సిగ్గు కలుగునట్లుగా చేస్తుంది. మనలను పాపి అనునట్లుగా సిగ్గునొందునట్లుగా చేయుచున్నది. అవును, ఈ లోకములో అనేకమైన కార్యములు ఎన్నో ఉన్నాయి. అవి మనకు సిగ్గునొందులాగున చేయుచున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఎవరైన దంపతులకు సంతానము లేనట్లయితే, వారు ఎంతగానో సిగ్గునొందినట్లుగా ఉంటారు, లేక ఎవరికైన ఉద్యోగము లేనట్లయితే, వారికి స్వంత నివాసము లేనట్లయితే, వివాహము కాకపోయినట్లయితే, వారు ఎంతగానో సిగ్గు నొందినవారుగా ఉంటారు. అయ్యో! సిగ్గు నొందిన విధానము ప్రజలను చంపుతుంది.
నా ప్రియులారా, అందుచేతనే మన అవమానమును తొలగించడానికి యేసు ఈ లోకమునకు వచ్చి, అటువంటి అవమానము మరియు సిగ్గు నొందు విధానము ద్వారా వెళ్లాడు. ఆయన దేవుడై ఉండి ఉన్నప్పటికిని, ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని, ఒక దాసునిగా మరియు పనివానిగాను, తన్నుతాను ఎంతగానో ఆయన తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చాడు. అందరి యెదుటను ఆయన సిలువను మోసుకొని తీసుకొని వెళ్లాడు. అక్రమముగా, శిక్షావిధి, తన మీద పలుకబడడానికి ఆయన అనుమతించుకున్నాడు. సిలువ మీద మేకుల చేత కొట్టబడుటకు ఆయన అనుమతించుకున్నాడు. మరణించుటకు ఆయన తన్ను తాను అనుమతించుకున్నాడు. దుష్టులైన ప్రజల ద్వారా ఆయన అపహాస్యము పాలు కావడాని కొరకు ఆయన తనను తాను అనుమతించుకున్నాడు. ఎందుకని, మీరు సిగ్గు పడిన విధానము గుండా వెళ్లడానికి, మీరు సిగ్గు నొందుచున్న విధానమును అర్థము చేసుకోవడాని కొరకు మాత్రమే. ఈ రోజున, ఆయన ఆలాగున అపవాది కార్యములను లయము చేసియున్నాడు. దుష్ట ప్రజల యొక్క చెడు మాటల శక్తిని లయము చేసియున్నాడు, మరణమును నాశనము చేశారు, ఆయన సజీవంగా తిరిగి లేచాడు. ఆయన యుగయుగములు సజీవుడుగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథము ఈలాగున చెబుతుంది: "యేసు నామమున ప్రతి మోకాలు వంగుతుంది. భూమి మీద ఉన్న ప్రతి మోకాళ్లును కూడా మరియు భూమి క్రింద ఉన్నవారి మోకాళ్లు, ఆలాగున భూమి యొక్క పై భాగములోను యేసు యొక్క నామమున వంగుతుంది.'' ప్రతి పాపము, ప్రతి రోగము, ప్రతి అపవాదియు కూడా వంగిపోతుంది, ప్రతి ఋణము కూడ మరియు దుష్టత్వము యొక్క ప్రతి ఒత్తిడి వంగిపోతుంది.
నా ప్రియులారా, యేసు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "నా బిడ్డా, నా నామమున మీరు ఏదైన అడిగినను, నేను దానిని మీకు అనుగ్రహిస్తాను'' అని చెబుతున్నాడు. మీరు ఏది అడిగినను, అది, నా నామమున మీరు ఏది అడిగినను, దానిని నేను జరిగిస్తానని సెలవిచ్చుచున్నాడు.'' మనము ఆయనకు బిడ్డలుగా ఉన్నప్పుడు, అట్టి కృపను మనకు ఆలాగున అనుగ్రహిస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు మాకు సహాయము చేస్తాడు, మేము సిగ్గు నొందము అని చెప్పి, ఈ రోజున మీరు యేసు వైపునకు మరలుకొనండి. ఆయన మిమ్మును ఘనపరచును. మీరు పొందియున్న అవమనామంతటికిని ప్రతిగా, ప్రత్యేకంగా యేసు నిమిత్తము, అదే స్థలములో మీకు ఖ్యాతిని, మంచి పేరును కలుగుతుంది. మీరు అనుభూతి చెందియున్న షవమానమంతటికి ప్రతిగా, మీరు పొందియున్న సిగ్గు అంతటికిని, ప్రతిగా మీరు యేసు వైపు మరలుకొనుచుండగా, యేసును మీరు అంటిపెట్టుకొని, మీరు ఆయనను తండ్రీగా ఉంచుకొనినట్లయితే, ఆయన మీరు సిగ్గునొందిన విధానమును రెండంతలు ఘనతగా మార్చగలుగుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుకనే, ఈ రోజు మనలను అవమానము నుండి బయటకు తీసుకుని రావడానికి యేసు నొందిన సిగ్గు అంతటికిని, ప్రతిగా కొన్ని కోట్ల, రెట్లు ఘనతను ఆయన కలిగియున్నాడు. అందుకే మీరు మీ జీవితమును అంతము చేసుకొనవలసిన పని లేదు. వంగిపోయి, ఒంటరిగా, బంధింపబడి ఉండవలసిన అవసరము లేదు. నా ప్రియ స్నేహితులారా, మీరు ఉన్న పక్షముననే యేసు చెంతకు రండి, ఆయన యందు నిరీక్షణ ఉంచండి, ఆయన మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చబోవుచున్నాడు. అవును, ఆయన ప్రజల యందరి యెదుట మిమ్మును ఘనపరుస్తాడు. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయకండి.
ఇక్కడ ఒక చక్కటి సాక్ష్యము కలదు. అతని పేరు ఆరోగ్యసామి, క్రిస్టీ పుష్పరాణి, ఇతడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేయుచుండెను. ఒకసారి ఇతడు మేము నిర్వహించిన కూటములో పాల్గొన్నాడు. ఆ కూటములో, నేను ఈలాగున చెప్పాను, " మీరు పరిపూర్ణ ఆశీర్వాదముల కొరకు యేసును అడగండి. అడిగిన ప్రతివారికి, వారు అడిగినది యేసు నొద్ద నుండి పొందుకుంటారు'' అని చెప్పాను. ఆయన ఒక చిన్న స్కూటర్ మీద ప్రయాణము చేయుచుండెను. ప్రతి ఒక్కరు ఆయనను చూచి, ఎగతాళి చేయుచుండిరి. ఎందుకంటే, అది చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండెను. తన కుటుంబాన్ని, తన సంఘమునకు కూడా దానిని అతడు తీసుకొని వెళ్లలేడు. ఈ యొక్క మాట దేవుని యొద్ద నుండి ఆలకించియున్నప్పుడు, యేసును అడిగియున్న ప్రతి ఒక్కరు కూడా స్వీకరించెదరు అనే మాటను విశ్వసించాడు. విశ్వాసముతో కారును ఏలాగున ్రడైవ్ చేయాలో నేర్చుకొనుటకు అతడు ప్రారంభించాడు. ఆ తర్వాత, "ప్రభువా, నాకు ఒక కారు దయచేయుము '' అని అడిగాడు. అతనికి వనరులు లేకపోయినను సరే, దేవుడు అతని విశ్వాసమును ఘనపరచాడు, ఆయన తన బిడ్డలను యౌవన భాగస్థుల పధకములోను మరియు తన కుటుంబాన్ని, కుటుంబ ఆశీర్వాద పధకములో భాగస్థులుగా నమోదు చేసుకున్నాడు. మహా అద్భుతముగా దేవుడు అతనికి ఒక కారును అనుగ్రహించాడు. యేసు పిలుచుచున్నాడు సేవా పరిచర్య ద్వారా ఇతరుల ప్రజల జీవితములో ఆశీర్వాదము కొరకై వారు సహకారము అందించినప్పుడు, దేవుడు వారికి ఖాళీ స్థలమును కొనుగోలు చేయుటకు వారికి సామర్థ్యమును నిచ్చు కృపను అనుగ్రహించాడు. మహా అద్భుతముగా దేవుడే పని జరిగించాడు. ఈ రోజు వారు ఎంతో భద్రముగా ఉన్నారు. నా ప్రియులారా, నేడు దేవుడు మీకును ఈలాగున అనుగ్రహిస్తాడు. మీరు ఆయన నామమున అడిగినప్పుడు, నిశ్చయముగా మీరు అడుగు ప్రతిది ఆయన మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఐశ్వర్యవంతముగా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందానలు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈ రోజు, నీవు సర్వసమృద్ధిగా గలవాడవు గనుకనే, మేము సమృద్ధిగా జీవించాలని మేము కోరుచున్నాము. దేవా, మేము వర్థిల్లునట్లుగా చేయుము. దేవా, మేము కోల్పోయిన సమస్తమును మాకు రెండింతలుగా అనుగ్రహించుము. ప్రభువా, మా కుటుంబమును ఘనపరచుము. ప్రభువా, మేము ప్రభువైన యేసు, సిగ్గుతో విరిగిపోయినా, నీ దయను నమ్ముకుని నీ దగ్గరకు వచ్చుచున్నాము. దేవా, మేము అనుభవించుచున్న అవమానాన్ని నీ మీద వేసుకుని సిలువలో భరించినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా బాధను, మా వైఫల్యాలను, మేము దాచిన కన్నీళ్లను నీవు అర్థం చేసుకుంటావు, కనుకనే, ఈ రోజు, మా దుఃఖాన్ని, మా భయాలను, మా గతాన్ని నీ చేతులలోనికి అప్పగించుచున్నాము. దేవా, మేము అవమానం నుండి పైకి లేవనెత్తబడి, ఘనతను మాకు ధరింపజేయుము. యేసయ్యా, మా దుఃఖమును ఆనందంగాను, మా బలహీనతను బలంగాను మార్చుము. ప్రభువా, మాకు తండ్రిగా, మాకు ఆశ్రయంగా, మా నిరీక్షణను ఎన్నటికిని కోల్పోకుండా చేయుము. దేవా, మేము అవమానించబడనని నమ్ముచున్నాను, ఎందుకంటే ఓ ప్రభువా, నీవు మాతో ఉన్నావు. కనుకనే, నీ యొక్క ఘనమైన నామమున మేము నీ చెంతకు వచ్చునట్లుగాను, మా అవమానమును ప్రతిగా ఆనందమును దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.