నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాము. మీరందరు ప్రభువు సన్నిధితో నింపబడడము నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. ప్రభు వు తన యొక్క ప్రశస్తమైన వాక్యము ద్వారా మీలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజు ప్రభువు ఒక అద్భుతమైన వాగ్దానము ఇచ్చియున్నాడు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 18:29వ వచనమును మనము నేడు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును’’ అని చెప్పబడినట్లుగానే, దేవుని సహాయము వలన మనము విజయమును పొందుకొనవచ్చును.
నా ప్రియులారా, యెషయా 40:31వ వచనములో మనము ఈలాగున చదవగలము, ‘‘ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు’’ మరియు కీర్తనలు 34:10 వ వచనమును చూచినట్లయితే, ‘‘ సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు’’ అన్న వచనము ప్రకారము యెహోవాను ఆశ్రయించువారికి మరియు ఆయనను వెదకువారికి ఎటువంటి మేలు వారికి కొదువై ఉండదు. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు సహాయముతో అన్నియు సాధ్యమగుతుంది.
నా జీవితములో కూడా ఇటువంటి అద్భుతమైన అనుభవము ఒకటి ఉన్నది. నా భర్త జీవిస్తున్నటువంటి రోజులలో, పరిచర్య కొరకు వెళ్లి, అనేక దినములు బోధిస్తు, గడిపేవారము. నేను ఆయనతో కూడా వెళ్లి, కేవలం ఆయనకు సహాయము చేస్తాను అంతే. ఆయన చనిపోయిన తర్వాత, సిడ్ని, ఆస్ట్రేలియా వంటి అనేక ప్రాంతములకు నన్ను పిలిచారు. ఆ ప్రాంతములలో 23వ రోజులలోనే, 17 సార్లు వాక్యమును బోధించవలసి వచ్చినది. అది నాకు ఎత్తైన ప్రాకారము వలె అనిపించినది. నేను ఎంతగానో చింతించాను. నేను ఎప్పుడు ఆలాగున బోధించలేదు. అప్పుడు నేను చేసిన విషయమేమనగా, ఒక కుటుంబము వారు తమ యింటికి నన్ను పిలిచి, వారి కొరకు బోధించమని మరియు వారి గృహములో ప్రార్థించమని నన్ను పిలిచారు. నేను ప్రభువు సన్నిధిలో 3 రోజులు ఉపవాసము ఉండి కన్నీటితో ప్రార్థించాను. ప్రభువు తన వాక్కు ద్వారా నన్ను బలపరచాడు. ఆయన నాకు వర్తమానములను ఇచ్చాడు, నేను ఆదివారము సంఘమునకు వెళ్లినప్పుడు, అక్కడ పాస్టర్‌గారు అదే వచనమును మరియు లేఖనములతో కూడా బోధించారు. మనము దేవుని సహాయముతో అన్నియు చేయగలము. చింతించకండి. నేను దేవుని వాక్యము ద్వారా ఎంతగానో బలపరచబడ్డాను. పరిశుద్ధాత్మ బలముతో నేను ఆ గృహమునకు వెళ్లాను. దేవుడు అక్కడ అద్భుతములను జరిగించాడు. అనేకమంది విడుదల పొందుకున్నారు. అనేకులు దేవుని ద్వారా దీవించబడ్డారు. నా జీవితములో నేను ఆలాగున జరుగుతుందని ఎప్పుడు కూడా ఎదురు చూడలేదు. కానీ, యేసయ్యా, నాతో ఉన్నాడు కాబట్టి, ప్రభువు నామ మహిమార్థమై అన్నియు నేను అద్భుతముగా చేయగలిగాను.
అవును నా ప్రియ స్నేహితులారా, అదే దేవుడు నేడు మీతో కూడా రానైయున్నాడు. ఆయనను గట్టిగా హత్తుకుని పట్టుకొనండి, మీరు అన్నియు చేయుటకు ఆయనే మీకు సహాయము చేస్తాడు. ప్రభువుకు సమస్తము సాధ్యమే. ఇప్పుడే, ప్రభువు సన్నిధిలో మొఱ్ఱపెడదాము. ఇప్పటికి వరకు మీరు చేయలేని వాటన్నిటిని కూడా మీరు అద్భుతమైన రీతిలో వాటన్నిటిని చేస్తారు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ అద్భుతమైన సన్నిధి కొరకు నీకు వందనాలు. దేవా, నీవు ఇక్కడ ఉన్నావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, మా ప్రార్థనలకు జవాబును దయచేసి, మా ప్రాకారములను దాటుటకు మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మేము అనేక కార్యముల నిమిత్తము బట్టి మేము చింతించకుండా, సమస్తమును నీ హస్తాలకు అప్పగించుకొనునట్లుగా చేయుము. తండ్రీ, మా యొక్క ప్రతి సమస్య నుండి బయటపడడానికి మాకు సహాయము చేయుము. దేవా, మేము అనేక విషయములను గురించిన చింతను మా నుండి తొలగించి, మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, మా ఉద్యోగమును ఎలా ముగించబోవుచున్నాము. దేవా, ఈ యొక్క భయంకరమైన వేదనల నుండి మేము ఎలా బయటకు రావాలో మాకు నేర్పుము. ప్రభువా, ఎన్నో సమస్యలతో మేము బాధపడుచున్నాము. కానీ, ప్రభువా, నీవు మాతో ఉండి, మా హృదయమును మరియు మా మనస్సులను బలపరచుము, నీవు మాతో ఉండి, ప్రభువా, నీ సహాయము ద్వారా మా ప్రాకారములను దాటుటకును మరియు మాకు విడుదలను అనుగ్రహించుము. దేవా, మా ప్రార్థనలను ఆలకించే దేవుడవు, మా సమస్యల నుండి బయటపడడానికి మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.