నా ప్రియమైన స్నేహితులారా, నేటి దేవుని వాగ్దానము కొరకు మీరు సంసిద్ధముగా ఉన్నారని నాకు తెలుసు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 63:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును'' ప్రకారం, నా ప్రియ స్నేహితులారా, దేవుడు తన దృఢమైన ప్రేమతో మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు.
నా ప్రియులారా, నూతనంగా వివాహము జరిగించబడిన వధువరులు లేక నూతన జంట ఈలాగున చెప్పుకుంటారు, వారు ఎంతగానో ప్రేమలో మునిగిపోయి ఉంటారు. " తేనెకంటె ఈ మధురమై ఉన్నావు, నిన్ను ప్రేమించుటకంటె ఈ లోకములో శ్రేష్టమైనది నాకు ఏదియు లేదు'' అని చెప్పుకుంటూ, ఈలాగున ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఇలాంటి ప్రేమకలిగియున్న జీవితాన్ని జీవించడమే నాకు ఎంతో అత్యంత ప్రాముఖ్యము. ఇంక ఏదియు కూడా ప్రాముఖ్యము కాదు అని అనుకుంటారు.'' అటువంటి ప్రేమలో వారు ఆ రీతిగా లీనమై ఉంటారు. మరి అది ఎంతకాలము నిలిచి ఉంటుందో తెలియదు కానీ, అది నిరాంతరాయంగా ఉండాలని నేను ఎదురు చూస్తున్నాను. అయితే, ఆ రీతిగా మనము కూడా మన జీవితములో ప్రతిరోజు ఆలాగుననే దేవుని ప్రేమతో చుట్టుబడి ఉండాలి. యేసు కొరకు, ఆయన యొద్ద నుండి వచ్చు ప్రేమతో మనము నింపబడి ఉండాలి. "ప్రభువా, ఈ రోజు కేవలము మమ్మును ప్రేమించుము, మమ్మల్ని నీ ప్రేమతో కప్పుము దేవా. మా హృదయము నీ ప్రేమ చేత నింపబడి ఉండాలని'' మీరు ప్రభువును స్తుతించినప్పుడు, మీ జీవితములో దేవుని ప్రేమతో నింపబడి ఈలాగున జరుగుతుంది. కేవలము, జీవముకంటె ఉత్తమమైన ఆయన కృపకు మీరు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి, ఆయనను స్తుతించినప్పుడు, ఆయన ప్రేమ మీ హృదయములోనికి ప్రవేశిస్తుంది. ఆయన ప్రేమ మిమ్మును పరిపూర్ణంగా నింపుతుంది.
నా ప్రియులారా, యేసు ప్రభువు ఈ లోకములో జీవించినప్పుడు, ప్రతి దినము ఆ రీతిగా తండ్రి ప్రేమతో జీవించియున్నాడు. యేసు క్రీస్తు ప్రతి దినము వేకువనే, ఉదయకాలమున మొదటిగా ఆయన తన తండ్రి ప్రేమను వెదకియున్నాడు. దేవుని ప్రేమ చేత కప్పబడి ఉండునట్లుగా, ఆ విధంగా నిశ్చయపరచుకున్నాడు. అట్టి ప్రేమతో ఆ దినములలో జీవించేవాడు. అందుకే ఈ వచనము చెబుతుందిలా, 'అట్టి స్థిరమైన ప్రేమ, ఎల్లప్పుడు నిలిచి ఉంటుంది. అది జీవముకంటె శ్రేష్టమైనది.' ప్రజలు ఆయనను ప్రశ్నించడానికి మరియు ఆయన హృదయాన్ని బ్రద్ధలు చేయడానికి వచ్చారు, ప్రజలు వచ్చి ఆయనను బెదిరించారు. ఈ లోక తుఫానులను ఎదుర్కొనుటకు ఆయనకే వచ్చాయి. ఆయితే, ఎటువంటి తుఫానులు కూడా ఆయన కదిలించబడలేదు. ఎందుకనగా, దేవుని ప్రేమలో ఆయన చుట్టుబడియున్నాడు. ఆ తండ్రి యొక్క ప్రేమను ఒక మానవునిగా ఆయన దానిని మనకు బయలుపరచాడు మరియు దానిని చూపించాడు. ఈ రోజున అటువంటి ప్రేమను పొందుకొని మనము ఆలాగున జీవించబోవుచున్నాము. మీరు కూడా దేవుని ప్రేమ చేత కప్పబడి ఉండాలంటే, మీరు మీ జీవితాలను ఆయన హస్తములకు అప్పగించుకున్నట్లయితే, నిశ్చయముగా, జీవముకంటె ఉత్తమమైన ఆయన కృపను మీకు అనుగ్రహించి, ఆయన ప్రేమతో మిమ్మును కప్పుతాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నాము. అనేకమైన పరిస్థితులు మా హృదయాన్ని బ్రద్ధలు చేయడానికి ఎదురౌవుతున్నాయి. ప్రభువా, మేము నీ స్థిరమైన ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నాము. యేసయ్యా, నీ యొక్క స్థిరమైన ప్రేమకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. అది జీవముకంటె ఉత్తమమైనది. యేసయ్యా, నీవు ప్రతిరోజు తండ్రి ప్రేమతో చుట్టుబడినట్లుగానే, ఈరోజు కూడా మేము కూడా నీ ప్రేమలో చుట్టబడి ఉండునట్లు చేయుము. దేవా, నీ సన్నిధితో మా హృదయాన్ని నింపుము, తద్వారా మేము ఈ లోకంలో కదలకుండా జీవించడానికి నీకృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితములో తుఫానులు తలెత్తినప్పుడు, నీ ప్రేమలో లంగరు వేయడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీలాగే, మేము కూడా ప్రతిరోజు నీ ప్రేమను వెదకడానికి ప్రారంభించాలనుకుంటున్నాము. దయతో, కృతజ్ఞతాస్తుతులు నిండిన హృదయంతో మా ఆత్మను నీ ప్రేమచేత నింపుము. దేవా, ఈ రోజు మా ప్రతి అడుగు మరియు నిర్ణయానికి నీ ప్రేమ నడిపింపును మాకు దయచేయుము. ప్రభువా, మాకు శోధనలు వచ్చినప్పుడు కూడా నీ ప్రేమను ఇతరులకు చూపించడానికి దయచేసి మాకు సహాయం చేయుము. దేవా, శాశ్వతమైన ప్రేమతో ఎల్లప్పుడు నీవు మమ్మును ప్రేమించునట్లుగా కృపను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.