నాకు అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి, యెషయా 65:14వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనో దుఃఖముచేత ప్రలాపించెదరు'' ప్రకారం నేడు దేవుడు మిమ్మును తన సేవకులనుగా చేసుకోవాలని మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీ హృదయాన్ని కలవరపడనీయ్యకండి. అంతమాత్రమే కాదు. దేవుడు మిమ్ములను, 'తన సేవకులనుగా' పిలుచుచున్నాడు. యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో భాగస్థులుగా ఉన్న మీరు దేవుని సేవకులుగా ఉన్నారు. మీ భాగస్వామ్య ము ద్వారా కోట్లాది మంది ప్రజల యొక్క కన్నీటిని తుడిచి వేయబడుచున్నది. మీరు ఇచ్చుచున్న ప్రతి కానుక మరియు ప్రార్థనా గోపురములో మీరు స్వచ్ఛంద సేవకులుగా చేయుచున్న ప్రతి ప్రార్థన దేవునిచేత సంతోషకరమైన బలిగా పరిగణింపబడుచున్నది. నా స్నేహితులారా, ప్రభువు దానిని అంగీకరించి, మనం ప్రార్థించే ప్రజలకు అద్భుతాలను తీసుకొని వచ్చుచున్నాడు. ఆయన మిమ్మును ఎన్నటికిని మరువకుండా, నిశ్చయముగా జ్ఞాపకము చేసుకుంటాడు. అంతమాత్రమే కాదు, మీ సేవను ఘనపరుస్తాడు.

నా ప్రియులారా, ఇక్కడ, "నా సేవకులారా,'' అనగా మీరే, ' హృదయానందము కొరకు గానము చేయుదురు' అని వచనము చెప్పుచున్నది. జెఫన్యా 3:17లో బైబిల్ ఇలా చెబు తుంది, " నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషముచేత ఆయన హర్షించును.'' అవును, ప్రజలకు అద్భుతాలను తీసుకురావడానికి ఇందుకు మీరు కారణం. కాబట్టి, ఆయన మీ గురించి ఆనందిస్తాడు. మీరు టెలివిజన్ తరంగాలు, సోషల్ మీడియా, పబ్లిక్ మీటింగ్‌లు, మ్యాగజైన్‌లు మరియు పుస్తకాలు మరియు పరిచర్య ద్వారా ఉత్తరములు మరియు ఈమెయిల్‌లను తెరుచుచుండవచ్చును. ఇంకను ప్రజల కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి మీరు లక్షలాది కొలది ఫోన్ కాల్‌ను ఉపయోగించేలా ప్రారంభించుచుండవచ్చును. మీ సమర్పణ మరియు మాతో కలిసి మీరు చేసిన ప్రార్థనల కొరకు ప్రభువు మీ పట్ల ఆనందించుచున్నాడు. ఆయన మీ గురించి ఆనందముతో సంతోషించుచున్నప్పుడు, మీరు మీ హృదయంలో ఉప్పొంగుట చేత ఆనందమును కలిగి ఉంటారు మరియు మీ కుటుంబం లో ఆనందాన్ని అనుభవిస్తారు. అంతమాత్రమే కాదు, మీరు సంతోషకరమైన హృదయంతో గానము చేయునట్లుగా చేస్తాడు.

మా పరిచర్య భాగస్థులలో ఒక సహోదరి జయ సెల్వి మరియు ఆమె భర్త అన్బళగన్ నుండి నేను ఈ చక్కటి సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. వారి కుమార్తె తమిళ మాధ్యమ పాఠశాలలో చదువుతుంది. కాలేజీకి వెళ్లేటప్పటికి అంతా ఇంగ్లీషులోనే ఉండడంతో అర్థం చేసుకుని పరీక్షలు రాయడానికి ఇబ్బంది పడుచుండేది. తల్లిదండ్రులకు ఏమి చేయాలో తెలియదు, కాబట్టి వారు ఆమెను యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో యౌవన భాగస్థుల పధకములో భాగస్థురాలినిగా చేయాలని నిర్ణయించుకున్నారు. యౌవన భాగస్థులకు జ్ఞానాన్ని ఇస్తానని ప్రభువు వాగ్దానం చేసాడు మరియు యౌవన భాగస్థురాలుగా అయిన తర్వాత, ఆమె ఆత్మవిశ్వాసాన్ని పొందింది మరియు ఆమె పరీక్షలను ఎంతో చక్కగా వ్రాసింది. వారి యొక్క కుమారుడు బాగా చదివాడు. కానీ, ఉద్యోగం రాలేదు. కాబట్టి, తల్లిదండ్రులు వానిని యౌవన భాగస్థునిగా కూడా నమోదు చేసుకున్నారు మరియు యౌవన భాగస్థునిగా యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు సహాయమును అందించుచున్నందున దేవుడు అతనికి అద్భుతమైన ఉద్యోగమును అనుగ్రహించాడు.

అప్పుడు, తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేయాలని ప్రార్థించమని కోరారు; ఆశ్చర్యకరంగా, పిల్లలిద్దరూ అతి త్వరలోనే వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు మనవరాళ్ల గురించి ఆందోళన చెందారు, కాబట్టి వారు తమ పుట్టబోయే మనవ సంతానమును కూడా యౌవన భాగస్థులుగా ముందుగానే నమోదు చేర్చుకున్నారు. ప్రభువు వారి కుమారుడు మరియు కుమార్తె యొక్క కుటుంబ జీవితాలను కట్టి, అత్యధికంగా ఆశీర్వదించాడు మరియు వారు వారి పిల్లలతో ఆశీర్వదించారు. ఈరోజు మనవ సంతానము చక్కగా చదువుచున్నారు. దేవుని కృప ద్వారా మరియు దీవెనలు తరతరాలకు సంక్రమించాయి. నేడు, వారి పిల్లలు కూడా యౌవన భాగస్థుల పధకములో సహాయాన్ని అందించుచున్నారు మరియు వారందరూ యేసును నీతిగా అనుసరిస్తున్నందున కుటుంబంలో పొంగిపొర్లుతున్న ఆనందాన్ని కలిగియున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియులారా, నేడు దేవుడు మీ కుటుంబానికి కూడా అలాగే చేస్తాడు. మీరు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో భాగస్థులుగా జీవించే దేవుని సేవకులు. కనుకనే, దేవుడు మీ హృదయానికి ఆనందముతో నింపబడిన సంతోషాన్ని తీసుకొనివస్తాడు. కాబట్టి, మీరు ఎందుకు పనికిరాని వారని తలంచుచున్నారా? నేడు దేవుడు మిమ్మును తన సేవకులనుగా పిలుచుచున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మమ్మును నీ సేవకులుగా పిలిచినందుకు నీకు వందనాలు. దేవా, మా జీవితంలో ఈ ఉన్నతమైన పిలుపునకు నేను కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, ఈ పిలుపునకు తగినట్లుగా నడవడానికి నీవు మాకు సహాయం చేయుము. ప్రభువా, మా నోటి మాటలు మరియు మా హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉండునట్లు చేయుము. తద్వారా నీవు మా గురించి ఆనందంతో గానము చేయునట్లుగా మమ్మును నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. ప్రపంచవ్యాప్తంగా సువార్త అభివృద్ధి కొరకు మేము నీ పరిచర్యకు మరియు నీ ప్రజలకు మరింత ఎక్కువ ఇవ్వగలిగేలా మా చేతులను ఆశీర్వదించుము. మరియు మేము చేయు ప్రతిదానిని, మా ఆర్థిక, మా కుటుంబ జీవితం మరియు మా స్వాస్థ్యభాగమును విస్తరించునట్లు చేయుము. ప్రభువా, మేము మా జీవితాన్ని సమర్పించుకొనుచున్నాము మరియు నీ పరిచర్యకు సహాయము చేయడానికి మరియు నీకు విధేయత చూపడానికి మరియు మా హృదయంలో గొప్ప ఆనందాన్ని మరియు మా కుటుంబంలో సంతోషమును అనుభవించడానికి నీవు మాకు సహాయం చేస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, నీ వెలుగు ద్వారా చీకటిగా ఉన్న ప్రతిచోట ప్రకాశింపజేయుము మరియు హృదయానందముతో గానము చేయుటకు మా హృదయాలను అనుమతించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.