నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుని వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 49:16 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, ‘‘చూడుము నా యరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా యెదుట నున్నవి’’ ప్రకారము దేవుడు తన అరచేతుల మీద మిమ్మును చెక్కుకొని ఉండడం ఒక గొప్ప అద్భుతం కాదా? దీనికి అర్థం మనం ఎల్లప్పుడు ఆయన కళ్ల యెదుటనే ఉన్నామని అర్థం. కాబట్టి, మీరు దేవుని గొప్ప ధననిధిగాను మరియు ఆయన మిమ్మును నిత్యము జ్ఞాపకముంచుకుంటాడు. కనుకనే, మీరు భయపడకండి.
బైబిల్‌లో పరమగీతములు 8:6 వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, ‘‘ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము’’ అన్న వచనము ప్రకారము దేవుని హృదయము మీద మనము నామాక్షరముగా ఉంచబడియున్నాము. అదేవిధంగా, మీరు దేవుని చేతిలో చెక్కబడి ఉండలేదని అనుకుంటున్నారా? యేసు ప్రేమతో నింపబడియున్నాడు. ఆయన ప్రేమామయుడు. కాబట్టి, ఆయన అరచేతులలో మేకుల ద్వారా పొందిన తన యొక్క నిత్యమైన గాయాలే మీ పట్ల తనకున్న గాఢమైన ఆయన ప్రేమకు నిదర్శనం. ఆయన పొందిన గాయలను చూచిన ప్రతిసారీ, ఆయన మిమ్మును గుర్తుంచుకుంటాడు. ఆయన చేతులలో చెక్కబడిన మీ పేరును ఎవరూ తొలగించలేరు. మీ పట్ల ఆయనకున్న గాఢమైన ప్రేమకు ఈ నిదర్శనం కొరకు మీరు ఎల్లప్పుడు ఆయనకు కృతజ్ఞతతో ఉండాలి. దేవుడు మిమ్మును ఎప్పుడు తన మనస్సులో భద్రపరచుకొని ఉంటాడు. మరియు ఆయన మిమ్మును మరువకుండా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మిమ్మును నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు.
నా ప్రియులారా, కనుకనే, నేడు మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకోలేదని చింతించుచున్నారా? వారు మీ భవిష్యత్తు కొరకు కొన్ని ప్రణాళికలన కలిగి ఉంటారు. తన పిల్లలకు వివాహము అయినప్పుడు, తల్లిదండ్రులు వారి కొరకు తమ హృదయాలలోను మరియు మనస్సులలోను పరిపూర్ణమైన ప్రణాళికను కలిగియున్నారు. ఆలాగుననే, దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగియున్నాడు. ఇది దేవుని యొక్క హృదయమైయున్నది. అందుకే బైబిల్‌లో యెహెజ్కేలు 36:9 వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, ‘‘నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింపజేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరల కట్టబడును’’ అన్న వచనము ప్రకారము మీ పాడైన జీవితాలు సాగు చేయబడతాయి మరియు విత్తబడతా యి. అంతమాత్రమే కాదు, మీరు మరల కట్టబడతారు. అవును, నా ప్రియులారా, ఆయన మిమ్మును ఆశీర్వదించడానికి మరియు అభివృద్ధి చేయడానికి దేవుడు మిమ్మును గుర్తుంచుకొనియున్నాడు. మీరు ఎల్లప్పుడు ఆయన మనస్సులో ఉన్నారు. కాబట్టి మీరు మీ విన్నపములతో ఎప్పుడైనా ఆయన యొద్దకు వెళ్లవచ్చును. తప్పకుండా ఆయన మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ఆయన తన యరచేతులలో మిమ్మును చెక్కుకొని యున్నాడు కాబట్టి, ఆయన మిమ్మును విడువడు, ఎడబాయకుండా మిమ్మును కాపాడి సంరక్షించి, మిమ్మును ఆశీర్వదిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ యొక్క అరచేతులపై మమ్మును చెక్కియున్నందుకును మరియు మమ్మును నిత్యము నీ యెదుటనే ఉంచినందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, నీ యొక్క శాశ్వతమైన ప్రేమకు మరియు కృపకు రుజువు చేయబడిన గాయాలకు వందనాలు. దేవా, నీ సన్నిధిని మరియు నీ యొక్క ఆశీర్వాదాలను నిరంతరం మా మీద కుమ్మరించుము. యేసయ్యా, నీవు మా కొరకు పొందిన గాయాలను జ్ఞాపకము చేసుకొని, మమ్మును నీ అరచేతుల మీద చెక్కుకొన్నందున నీవు మా పక్షమున ఉన్నావనియు మరియు మమ్మును అభివృద్ధిపరచడానికి ప్రణాళికలు కలిగి ఉన్నావని గుర్తెరిగి, మేము నీ యందు నమ్మకంగాను మరియు నీతిగా జీవించడానికి మరియు ఎల్లప్పుడు నిన్ను వెదకడానికి మాకు నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు శాశ్వతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.