నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 28:9 వ వచనమును ధ్యానించుకుందాము. ఆ వచనము ఇలాగున తెలియజేయుచున్నది, "నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లుగా ఆయన తనకు ప్రతిష్టిత జనముగా నిన్ను స్థాపించును'' అన్న వచనం ప్రకారం అవును, దేవుడు మిమ్మును తన ప్రజలనుగాను, కుమార్తె/ కుమారులనుగా స్థిరపరచవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అది ఎంత అద్భుతమైనదో కదా! ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగానే, ఆయన కొరకై మిమ్మును పరిశుద్ధులనుగా ఏర్పరచుకోవాలని మీ పట్ల కోరుచున్నాడు. మనము దేవుని ఆజ్ఞలను చేపట్టుకొని, వాటి ప్రకారం చేయునప్పుడు, ఆయన ఆలాగుననే జరిగించుచున్నాడు.

ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. దీపిక మరియు మనోజ్ ప్రభాకర్ దంపతులు చెన్నైలో నివాసము చేయుచున్నారు. ఆమె భర్త చాలా రోగియై యున్నందున, అతడు పనిచేయడానికి వెళ్లలేకపోయేవాడు. అతని యొక్క వైద్యము ఖర్చులు చాలా ఎక్కువై పోయినందున, వారు అప్పులలో కూరుకుపోయారు. ఇంకను వారి బిడ్డల యొక్క చదువులకు కావలసిన ఖర్చులకు తగినంత డబ్బు వారి యొద్ద లేకపోయెను. కనునకే, వారు అప్పు తీసుకోవలసి వచ్చినది. తద్వారా, వారికి అప్పులు ఇంకను పెరిగిపోవు చుండెను. ప్రతిరోజు కూడ శ్రమతో కూడినదిగా వారి జీవితమును గడుపుచుండెను.

ఇటువంటి సమయములోనే, దీపిక ప్రార్థనా గోపురములో నిర్వహించుచున్న, 'ప్రార్థనా ప్రవచనాత్మకమైన సదస్సుకు' ఆమె పాల్గొనెను. తద్వారా, ప్రార్థనా గోపురమునకు వచ్చినది. మేము ఇస్తున్న శిక్షణలో ఆమె పాల్గొనెను. అప్పటి నుండి ఆమె యేసు ప్రభువునకు ప్రార్థన చేయుటకు ప్రారంభించెను. యేసుతో సంబంధ బాందవ్యము కలిగియుండెను. ప్రతినెల రెండవ శనివారము మేము ఏర్పాటు చేసియున్న 'అద్భుతమైన ఉపవాస ప్రార్థనా కూటమును' నిర్వహించుచున్నాము. ప్రతి రెండవ శనివారము ఉదయం 10 గంటలకు జరుగుతుంది. మేము కుటుంబ సమేతముగా అందరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థిస్తాము. ఆలాగుననే, ఏఫ్రిల్ మాసములో జరిగిన ఆ కూటములో ఆమె పాల్గొన్నారు. ఆమె ప్రభుత్వ ఉద్యోగము కొరకు ప్రార్థన చేయుచుండెను. ఆ కూటము ముగింపులో నేను ప్రతి ఒక్కరి మీద చేతులుంచి వ్యక్తిగతంగా ప్రార్థన చేయుచున్నాను. ఆమె వరుసలో వచ్చినప్పుడు, " దేవుడు మిమ్మును ఆశీర్వదించి పైకి లేవనెత్తుతాడు'' అని చెప్పాను. ఒక్కవారము దినాల సమయములోనే, ఆమెకు చైన్నై కార్పోరేషన్‌లోనే ఉద్యోగము వచ్చినది. అప్పటి వరకు 6 వేల రూపాయలు జీతము లభిస్తుండేది. కానీ, ఇప్పుడు నూతనమైన ఉద్యోగములో నెలకు రూ. 14.000/- జీతము లభిస్తుంది. ఆమె యొక్క వేతనము రెండింతలు అధికముగా లభించుచున్నది. ఎంత అద్భుతము కదా. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు ప్రభువు కొరకై ప్రతిష్టింపబడిన జనాంగమై యున్నారు. కనుకనే, మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించుచూ, ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల ఆయన మీకు ప్రమాణము చేసియున్నట్లుగానే, ఆయన తనకు ప్రతిష్టిత జనముగా మిమ్మును స్థాపించును. మీ కుటుంబము మరియు మీ వ్యక్తిగత జీవితమును స్థిరపరచును. కాబట్టి, దయచేసి ప్రోత్సహించబడండి! నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ శ్వాశతమైన ప్రేమకు మరియు మమ్మును నీ యొక్క స్వంత జనముగా ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, ఇప్పుడు కూడా, మేము నీతో సన్నిహితంగా నడవాలని మరియు నిన్ను ఎక్కువగా వెదకాలని మా కోరికను తెలియజేయుచున్నాము. ప్రభువా, మా పూర్ణ హృదయముతో మరియు శక్తితో నిన్ను వెదకుటకు మరియు ప్రతిదినము నీతో మాట్లాడుటకు మరియు ప్రవచనాత్మకమైన ఆత్మ కొరకు మేము ఎదురు చూచునట్లుగా మా హృదయములను తెరువుము. దేవా, ప్రార్థన ద్వారా మా జీవితములో పైకి ఎదగడానికి కావలసిన బలమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీకు ప్రతిష్ఠజనముగా ఉండునట్లుగా, ప్రతిరోజు మమ్మును నీకు సమీపముగా చేర్చుకొనుము. దేవా, మేము అనుభవించిన బాధలన్నిటిని మరియు కొరతల కొరకు, నీవు మాకు న్యాయం జరిగిస్తావనియు మరియు నీ యొక్క ఆశీర్వాదాలను మాకు రెట్టింపుగా పునరుద్ధరిస్తావనియు మేము నమ్ముచున్నాము. యేసయ్యా, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో ఎల్లప్పుడూ మమ్మును నీ యొక్క ఉన్నతమైన మార్గములలో నడిపించుము మరియు మా జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి మమ్మును బలపరచుము. దేవా, నీ మహిమను బట్టి మా ఆర్థిక అవసరాలన్నిటిని తీర్చి, మా ఇంటిలో ఆరోగ్యం మరియు స్వస్థత ఉండునట్లుగాను, మమ్మును నీ జనాంగముగాను స్థాపించుము. ప్రభువా, మా జీవితములో గొప్ప అద్భుతాలను జరిగించి, నీ నామమును మహిమపరచునట్లు చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.