నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేడు దేవుని వాక్యము నుండి ఒక అద్భుతమైన వాగ్దానమును మనము ధ్యానించబోవవుచున్నాము. బైబిల్ నుండి నేటి వాగ్దానముగా ఎఫెసీయులకు 2:19,20వ వచనములను చదువుకుందాము. ఆ వచనము, "కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు'' ప్రకారం నా ప్రియులారా, మీరికమీదట పరజనులును పరదేశులు కానేరరు. కనుకనే, నేటి నుండి మీరు దేవుని యింటికి చెందినవారై యున్నారు. కనుకనే, దిగులుపడకండి.

నా ప్రియస్నేహితులారా, నేడు మీ జీవితములో అనవసరమైన విషయాలకు మీరు బానిసలైపోయారా? అయితే, ఈ లోకాశలు, శరీరాశలు మీ జీవితాలను నశింపజేస్తాయి. అంతమాత్రమే కాదు, నేత్రాశ, శరీరాశ, లోకాశలతో అనవసరమైన వాటితో మీరు బంధింపబడియున్నారేమో? మిమ్మును మీరు ఒక్కసారి పరీక్షించుకోవాలి. అయితే, ఈ రోజు వాగ్దానము ప్రకారం ప్రభువు మిమ్మును నూతనమైన వారినిగా చేయబోవుచున్నాడు. కనుకనే, మీరిక మీదట పరజనులును పరదేశులు కానేకారు కానీ, మీరు దేవుని యింటివారై మరియు ఆయన కుటుంబమునకు చెందినవారై యున్నారు. హల్లెలూయా!

బైబిల్ నుండి దేవుని వాక్యములో చూచినట్లయితే, సౌలు అను వ్యక్తి ఉండెను. అతడు యేసుక్రీస్తునకు వ్యతిరేకముగా అన్నిటిని జరిగించుచున్న ఒక వ్యక్తి. అయితే, ఒక దినమున యేసయ్య తన ప్రేమనంతటితో అతనిని ఎదుర్కొన్నాడు. అందువలన, అతడు దేవుని ప్రేమను అర్థము చేసుకున్నాడు. తన జీవితమును సంపూర్ణముగా ప్రభువునకు సమర్పించుకున్నాడు. యేసుక్రీస్తు తన జీవితములో ప్రవేశించి, అతనిని నూతన వ్యక్తిగా మార్చాడు. ఇంకను అతనిలో ఉన్న పాతవన్నియు గతించిపోయాయి. అతడు దేవుని బిడ్డగాను మరియు ఇంకను ఒక గొప్ప దైవజనునిగా మార్చబడ్డాడు. ఇది ఎంత గొప్ప ఆనందము కదా!

నా ప్రియులారా, నేడు ప్రభువు మీ జీవితాన్ని కూడా మార్చబోవుచున్నాడు. మీరు అనేక లోక విషయాలకు బానిసలైపోయారా? స్నేహితులారా, అటువంటి కార్యాల నుండి బయటకు రండి, అవి మిమ్మును నరకానికి తీసుకొని వెళ్లతాయి. ఈ రోజు ప్రభువు మీ జీవితాలను మార్చివేయాలని మీ పట్ల కోరుచున్నాడు. సౌలు జీవితాన్ని పౌలుగా మార్చిన దేవుడు మీ జీవితాలను కూడా మార్చి, దేవుని బిడ్డగా మిమ్మును చేయబోవుచున్నాడు. ఇంకను మిమ్మును దేవుని పట్టణస్థులుగాను మరియు ఆయన యింటివారినిగాను మారుస్తాడు. కాబట్టి, నేడు మీరు యేసు నొద్దకు తిరిగి రండి, తన ప్రేమంతటితో ఆయన మీ కొరకు వేచియున్నాడు. ఎందుకంటే, ఆయన మీకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడే యేసయ్యను, మీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, మీరు దేవుని యింటివారుగా, ఆయన సొంత ప్రజలనుగా మార్చబడతారు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థనా:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము ఇకమీదట పరజనులును పరదేశులు కాకుండా, మేము నీ యింటికి చెందినవారమై ఉండుటకు నీవు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రభువా, మేము నీ వైపునకు చూచుచున్నాము. దేవా, మేము అనవసరమైన ఈకాశల నుండి బయట పడడానికి మేము చేయగలిగినందంతటిని మేము ప్రయత్నించాము కానీ, ప్రభువా, నీవు మాకు సహాయము చేసి, మమ్మును బయటకు తీసుకొని రమ్మని వేడుకొనుచున్నాము. దేవా, సౌలును, పాలుగా మార్చి, ఒక గొప్ప దైవజనునిగా చేసినట్లుగానే, నేడు మమ్మును కూడా నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము, నీ చేతి మమ్మును పట్టుకొని, నీ పరిశుద్ధాత్మతో నింపుము మరియు మేము నీ సత్యంలోను మరియు నీతిలోను నడవడానికి మమ్మును నడిపించుము. ప్రభువైన యేసు, మేము నిన్ను మా జీవితానికి ప్రభువుగాను మరియు స్వంత రక్షకునిగా అంగీకరించుచున్నాము. దేవా, మేము లోకాశల నుండి విడిపించబడుటకు మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, నేత్రాశ, శరీరాశ, లోకాశలతో అనవసరమైన కార్యములతో బంధింపబడియున్న మమ్మును నీ రక్తము ద్వారా కడిగి, విడిపించుము. ప్రభువా, ఇప్పుడే నీవైపు చూస్తున్న మా కుటుంబాలను తాకుము. దేవా, నిన్ను మా స్వంత రక్షకునిగా అంగీకరించుటకు మాకు నీ కృపను చూపుము. యేసయ్యా, మా జీవితములో ఉన్న పాతవన్నియు గతించిపోవునట్లుగాను, మా జీవితాలను నూతనంగా మారుస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా పోరాటాలను, మా శోధనలను మరియు మమ్మును నీ నుండి దూరం చేసే ప్రతి భారాన్ని మేము విడిచిపెట్టునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా పాపపు గతాన్ని కడిగివేసి, మా హృదయాన్ని పునరుద్ధరించి, మమ్మును నీలో ఒక నూతన సృష్టిగా చేయుమని నీకే సమస్త మహిమను చెల్లించుచు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.