నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 10:6వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో, ‘‘నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును’’ అని వ్రాయబడియున్నది. ఇక్కడ నీతిమంతుని తలమీద కిరీటము అనగా, ఘనత, హుందాతనము, దైవీకమైన దేవుని అనుగ్రహముగా ఉన్నది. ఇశ్రాయేలీయుల దేశములో ఒక వ్యక్తిని ఘనపరచాలని వారుగాని భావించినట్లయితే, వారి యొక్క తలమీద అభిషేక తైలము కుమ్మరించు పద్ధతిని ఆచరించేవారు. దాని యొక్క భావము ప్రజలకు మర్యాదను చూపించుట మాత్రమే కాకుండా, వారికి హుందాతనమును కలుపుతుంది. అదేరీతిగానే, ప్రభువు మిమ్మును కూడా ఘనపరచవలెనని మీ పట్ల కోరుచున్నాడు. బైబిల్‌లో, కీర్తనలు 5:12వ వచనములో ఈ రీతిగా తెలియజేయుచున్నది, ‘‘యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున, నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు’’ ప్రకారం దేవుని ఆశీర్వాదము, దేవుని దయ లేక దేవుని అనుగ్రహమై యున్నది. కాబట్టి, మీరు చింతించకండి.
నా ప్రియులారా, ఆయన తన చేతులను మన తలల మీద ఉంచి, ఆశీర్వాదించడము మాత్రమే కాకుండా, తన యొక్క దయ లేక కేడెముతో మన చుట్టు ఆవరించుటకు శక్తిగలవాడై యున్నాడు. తద్వారా, ఎటువంటి అపాయము, హాని మన దరిచేరకుండా ఉండునట్లుగా ఆయన కేడెముతో మనలను కప్పుతాడు. మన ప్రక్కన పదివేలమంది కూలిపోయినప్పటికిని, ఏదియు కూడా మనకు ఎంత మాత్రము హాని కలిగించదు మరియు కీడు చేయనేరదు. ఇంకను మనకు విరోధముగా రూపింపబడియున్న ఏ ఆయుధము కూడా వర్థిల్లదు. ప్రభువు యోబును ఆశీర్వదించి ఉన్నప్పుడు, అతని చుట్టూరు సంరక్షణ కల్పించే ప్రాకారము వంటి కంచెను ఏర్పాటు చేశాడు. అటువంటి దయను మరియు అనుగ్రహమును దేవుడు అతనికి చూపించియున్నాడు. ఎందుకనగా, యోబు నీతిమంతుడైన వ్యక్తి. అతడు దేవుని యెదుట నిందారహితుడై యథార్థవంతుడుగా ఉండెను. గనుకనే, ప్రభువు అతనిని మాత్రమే కాకుండా, ప్రభువు అతనికి కలిగియున్న స్వాస్థ్య సంపదను అంతటిని కూడా భద్రపరచాడు. అందుచేతనే, దేవుని సన్నిధిని ప్రవేశించిన అపవాది, దేవునితో, ‘‘యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటి వారికిని మరియు అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా?’’ అని చెప్పుట మనము బైబిల్‌లో చూడగలుగుచున్నాము.
ఎౌఛీ*ట ఛజ్ఛూటటజీ జీట ఏజీట జ్చఠిౌఠట. ఏ్ఛ ౌ్ట ౌజూడ ఞజ్చూఛ్ఛిట ఏజీట జ్చిఛీ ఠఞౌ ౌఠట జ్ఛ్చిఛీ ౌ్ట అవును, నా ప్రియులారా, దేవుడు మనలను ఆశీర్వదించియున్నప్పుడు ఎటువంటి కీడు మన దరిచేరదు. ఆలాగుననే, దేవుని యొక్క ఆశీర్వాదము తరము వెంబడి తరములు వెంబడించును. అందుచేతనే, యెషయా 44:3వ వచనములో చూచినట్లయితే, ‘‘నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేనాశీర్వదించెదను’’ అని తెలియజేయుచున్నది. కాబట్టి, లేఖనములో చూచినట్లయితే, ‘‘నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును’’ అని చెబుతుంది. ఒక నీతిమంతుడైన వ్యక్తికి ఇటువంటి సమృద్ధికరమైన ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు. అయితే, ఎందుకు విరుద్ధంగాను మరియు వ్యత్యాసమైన రీతిలో, సాతమెలు 10:6వ వచనములో చూచినట్లయితే, ‘‘బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును’’ అని వ్రాయబడియున్నది. దుష్టులైన వారు అనగా, వీరు దేవుని గురించి ఏ మాత్రము కూడా ఎరుగని వారుగా ఉన్నారు. అతని యొక్క స్వంత భాషయే అతనికి గాయమును కలిగిస్తుంది. అవును, మీ స్వంత నోటి మాటలే, కార్యములు ఏలాగున జరగవలసియున్నదో అట్టివాటిని నిర్వచిస్తుంటాయి. ఇంకను కీర్తనలు 64:8వ వచనములో బైబిలేమంటుందంటే, ‘‘వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరు తల ఊచుదురు’’ అని వ్రాయబడియున్నది. అందుచేతనే, దైవజనులు లేక దైవజనురాలుగా ఉన్నటువంటివారు రెండు నాలుకల దోరణి కలిగియుండకూడదు, బహు జాగ్రత్తగా ఎంతో భయము కలిగియుండాలని వాక్యము చెబుతుంది. అందుకే బైబిల్‌లో 1 తిమోతి 3:8,9వ వచనములలో చూచినట్లయితే, ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభము నపేక్షించువారునైయుండక, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను’’ అని వ్రాయబడియున్నట్లుగానే, కొన్ని పర్యాయములు మనము మాన్యులై ఉండి, నాలుకను అరికట్టుకోవడమే సరియైన కార్యమై ఉంటుంది. మనము ఆగ్రహము నొందియున్నప్పుడు మన నోటిని మూతవేసుకొని ఉండడమే శ్రేష్టమైన కార్యము. అప్పుడు మనము మన గుణ లక్షణము ద్వారా ఆ రీతిగా గుర్తింపును పొందెదము. దేవుని యెదుట మనలను మనము తగ్గించుకొన్నప్పుడు గనత మన తలల మీదికి కిరీటముగా వస్తుంది.
కనుకనే, నా ప్రియులారా, నేడు మనము ఆయన సన్నిధికి వచ్చి, ‘ప్రభువా, నా నోటి నీ స్వాధీనములోనికి తీసుకొనుము’ అని చెబుతాము. అప్పుడు మత్తయి 5:5వ వచనములో ప్రభువైన యేసు సెలవిచ్చినట్లుగానే, ‘‘సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు’’ అన్న వచనం ప్రకారం మనము సాత్వికముగా ఉండినప్పుడు, ప్రభువు మనలను ఆశీర్వదిస్తాడు. అందుకే నేటి వాగ్దానములో చెప్పబడినట్లుగానే, ‘‘నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును’’ ప్రకారం దేవుడు మన తల మీద ఆశీర్వాదముల కిరీటమును ధరింపజేయడం ఎంత ఆశీర్వాదకరము కదా! అదియుగాక, మీరు రాజులకు రాజైన ఆయనకు కుమార్తెగా మరియు కుమారుడుగా ఉండియున్నారని ఎల్లప్పుడు ఎల్లప్పుడు మీరు గుర్తుంచుకోండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ వాగ్దానము ప్రకారము, మా తలలమీద నీ యొక్క ఆశీర్వాదముల కిరీటమును ఉంచుము. దేవా, నీ బిడ్డలైన మేము మా నోటి భాషలను గురించి మనస్కరించి ఉండునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, మా నోటి నుండి వచ్చు ప్రతి మాట కూడా మాకు ఆశీర్వాదముగా ఉండునట్లుగా చేయుము. దేవా, మాకు ఎన్నటికిని ఏ కీడు రాకుండా మరియు మమ్మును తాకుండా చేయుము. ప్రభు వా, నీ ఆశీర్వాదముల చేత మా తలలను అభిషేకించుము. యేసయ్యా, మా జీవితంలో ఘనత, హుందాతనము మరియు దేవుని దయను కోరుకుంటూ మేము నీ సన్నిధికి తగ్గింపుతో వస్తున్నాము. దేవా, మా దరికి మరియు మా యింటి దరికిని, ఇంకను మా ప్రియులైన వారి దరికిని ఎటువంటి హాని రాకుండా కాపాడుము. దేవా, నీవు యోబు చుట్టు కంచె వేసి కాపాడినట్లుగానే, నీ కృప అనే కేడెముతో మమ్మును కప్పుము. ప్రభువా, మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్థిల్లకుండా చేయుము. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదాలు మా ద్వారా ప్రవహించి, మా భవిష్యత్ తరాలకు విస్తరించునట్లుగా చేయుము, తద్వారా మేము నీ మంచితనంలో సమృద్ధిగా జీవించునట్లుగా చేయుము. దేవా, నీవు మా కొరకు సిద్ధపరచిన, ఆశీర్వాదాల ను మేము స్వాస్థ్యముగా పొందగలిగేలా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా మాటలు కీడును కాదు, జీవమును తీసుకొని వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ ఆశీర్వాదాలన్నింటిని మాకు కిరీటంగా ఇచ్చి, మరియు నీ దైవీకమైన కాపుదలతో మమ్మును ఆవరించుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.