నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానము మన ఆత్మలో మనలను కంపింపజేయుటకు మరియు ఆయన ఆశీర్వాదములను మన మీద కుమ్మరించుటకు సిద్ధముగా ఉన్నది. ఈరోజున నా ప్రియ సహోదరి షారోన్ ఏంజెల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. దయచేసి, ఆమెను కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొని, ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 125:1వ వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వచనము, "యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.'' అవును, మనము ఆయన యందు నమ్మిక ఉంచాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు.

నా ప్రియులారా, మన జీవితములోనికి ఊహించని రీతిగా సమస్యలు కెరాటలు వలె వచ్చినప్పుడు, మనము నలుమూలల కంపించి పోతాము. మొదటిగా మనము కోల్పోయేది విశ్వాసము మాత్రమే మరియు రెండవదిగా దేవుని మీద నమ్మకమును కోల్పోతాము. ఇంకను దేవుని యందు నమ్మిక ఉంచడం మరచిపోతాము. అంతమాత్రమే కాదు, దేవుని యందు నిరీక్షణ కూడా మరచిపోతాము. నాకు ఏమి జరుగబోతుందో అని ఆలోచిస్తాము. నేను స్వయంగా దీనిని అధికమించగలనా? నా మార్గములన్నియు అంధకారమయమై పోయాయి అని తలంచుకుంటాము. అది మన విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. అయితే, ఈ వచనము, "యెహోవా యందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు అని తెలియజేయుచున్నది. '' సీయోను కొండ ఎన్నటికిని కదిలించబడదు.

నా ప్రియ స్నేహితులారా, ఈ లోకములో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ఒత్తిడికి లోనైన ప్రజలను మనము చూచినప్పుడు, వారి హృదయములో ఉన్న భయాన్ని బట్టి, ఒత్తిడిని బట్టి మరియు విచారమును బట్టి, భయానికి లోనవుతారు. ఎందుకనగా, ఎవరి మీద ఆధారపడుటకు ఎవ్వరు వారికి ఉండి ఉండకపోవచ్చును. గనుకనే, వారి భవిష్యత్తు కొరకు ఏ మార్గము లేదు. అందుకనే, గొప్ప ఒత్తిడి వారిని అధిగమిస్తుంది. కానీ, మనకు కాదు స్నేహితులారా, విశ్వాసము వస్తుంది. మనలను కదిలించబడని వారినిగా అది మనలను చేయుచున్నది. విశ్వాసము ఎలాగున వస్తుంది? రోమీయులకు 10:17 వచనములో చూచినట్లయితే, "వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది.'' అవును, మీరు దేవుని వాక్యమును ఈ విధంగా ప్రతి దినము ఆలకించుచున్నప్పుడు, మీరు నిరంతారయముగా మరియు వ్యక్తిగతంగా అంగీకరించినప్పుడు, సమస్యలు వచ్చిన, ఆ వాక్యమును మీరు జ్ఞాపకము పెట్టుకుంటారు. అది మీతో మాట్లాడుతుంది. మీరు ఆలకించిన రీతిగా మీరు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, మీరు నిత్యము కదిలించబడరు అని చెబుతుంది. ఈ రోజు దేవుడు ఈ వాగ్దానమును మనకు ఇచ్చియున్నాడు గనుకనే, మీరు నిరంతరము నిలిచియుండెదరు. మీకు తెలుసు ప్రకృతికి అతీతంగా ఆ పరిస్థితులలో దేవుడు ఆ కార్యమును జరిగించగలడు. అప్పుడు దేవుని యందు మీ హృదయము నిరీక్షణకలిగియుంటూ, బహుగా బలపరచబడుతుంది. మానవుడు ఏమి ఇవ్వలేడో, ఈలోకము దేనిని ఇవ్వలేదో, మీ హృదయము దేవుడు ఇవ్వగలడని తెలుసుకుంటుంది. కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కనుకనే, హృదయము కదిలింపబడకుండా ఉంటుంది.

కనుకనే నా ప్రియులారా, నేటి నుండి మనము దేవుని వాక్యము వలన మన యొక్క నిరీక్షణ విశ్వాసములోను స్థిరపరచబడెదము. ఈ రోజు నుండి, దేవుని వాక్యం నుండి మీరు బలాన్ని పొంది, ఆయనపై మన అచంచలమైన నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని ఉంచుదాం. మనం ఈ బహుమతిని అంగీకరించి ఆయన వాగ్దానాన్ని ధైర్యంగా అమలు చేద్దాం? ఆయన వాగ్దానములో ధైర్యంగా నడుచుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యము ద్వారా మా విశ్వాసము బలపరచుము. దేవా, నీ వాక్యము పట్ల మేము దాహము కలిగి ఉండునట్లుగా చేయుము. పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యము ద్వారా ప్రతి దినము మాతో మాట్లాడుము. ప్రభువా, దేవుడు ఈ రోజు మా పట్ల వాగ్దానము చేశాడు గనుకనే, మేము ఎన్నటికిని కదిలించబడను అని నమ్మునట్లుగా మాకు అటువంటి హృదయమును దయచేయుము. ప్రభువా, నీ బలం మరియు నడిపింపు కొరకు మా పూర్ణహృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, నిన్ను నమ్మేవారు సీయోను పర్వతంలా కదలని వారని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మా శోధనల మధ్య, మేము పరిపూర్ణమైన నమ్మకాన్ని నీపై ఉంచడం మాకు నేర్పించుము. దేవా, నీ వాక్యం మా హృదయంలో పాతుకుపోయి, ప్రతిరోజు మమ్మును నూతనపరుచునట్లు చేయుము. దేవా, మాలో ఉన్న ప్రతి భయాన్ని మరియు సందేహాన్ని అధిగమించడానికి మరియు నీ అద్భుత శక్తిలో స్థిరంగా నిలబడటానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా జీవితానికి నీలో సమృద్ధిగా ఉన్న ఏర్పాట్లలో మమ్మును నమ్మకంతో నింపుము. దేవా, నీవు మాత్రమే మమ్మును నిత్యము నిలబెట్టగలవని తెలుసుకుని, మా హృదయం స్థిరంగా నీలో నిలిచి ఉండునట్లు చేయుము. ప్రభువా, మా చింతలన్నింటిని నీకు అప్పగించి, నీ పరిపూర్ణ శాంతి మరియు ఆనందాన్ని పొందడానికి మా హృదయాన్ని తెరువుము. ప్రభువా, నీ కదల్చబడని స్థిరమైన వాగ్దానం యొక్క హామీలో ముందుకు ధైర్యంగా నడవడానికి మమ్మును నీవు నడిపించుమని యేసు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.