నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 పేతురు 5:10వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియ గు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును’’ ప్రకారం నా ప్రియులారా, నేడు మీ జీవితమును కూడా ప్రభువు ఆ విధంగా కట్టబోవుచున్నాడు. నా జీవితములో అంతా కదిలిపోతుంది అని ఈ రోజు మీరు అంటున్నారేమో, నాకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు, అనేక సంవత్సరాలుగా నేను దాచిపెట్టుకున్న డబ్బును పోగొట్టుకున్నాను, ఎంతో అప్పులలో ఉన్నాను, నా కుటుంబము చుట్టు అవమానము మాత్రమే మిగిలి ఉన్నది, నేను ఈ సమాజములో ఎలా ఉండబోవుచున్నానో నాకు తెలియలేదు అని అంటున్నారా? కానీ, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు స్వయంగా మిమ్మును పునరుద్ధరిస్తాడు! ప్రభువే మిమ్మును మరల నిర్మించి, బలపరుస్తాడు.
అదేవిధముగా, ఈ ప్రియ సహోదరి జీవితములో అదే జరిగినది. చెన్నైలో నుండి సత్యశీల అనే ఒక సహోదరి తన సాక్ష్యమును ఈలాగున పంచుకొనెను. వారు లీజుకు ఇంటిని తీసుకొని కుటుంబముగా ఆ యింటిలో నివసించుచు వచ్చారు. కానీ, వారు మరొక పెద్ద యింటికి వెళ్లాలనుకున్నారు. వారు నివాసముంటున్న ఆ యింటి యజమాని ఆ సహోదరి యొద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. అంటే, లక్షన్నర రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. కానీ, అతడు ఆమెకు ఆ డబ్బును తిరిగి ఇవ్వలేకపోయాడు. ఆమె అతనిని ఆడిగినప్పుడు, నేను ఆ డబ్బును తిరిగి ఇవ్వలేను అని అతడు చెప్పాడు. తద్వారా, ఆమె ఎంతగానో చలించిపోయినది. అయితే, ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నది. కానీ, ఈ సహోదరి, ఏ విధంగానైన ఆ డబ్బును అతని యొద్ద నుండి తిరిగి పొందుకోవాలనుకున్నది. అయితే, ఆమె చెన్నై పట్టణములో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు తరచుగా వెళ్లేది. తన ప్రార్థనా విన్నపములకు దేవుడు జవాబు ఇవ్వాలని ఎంతగానో ప్రార్థించేది. అటువంటి పరిస్థితులలో కూడా ప్రార్థనా గోపురమునకు ఆమె వెళ్లినది. దేవుని యెదుట మొఱ్ఱపెట్టినది. కానీ, చెన్నై పట్టణములో జరుగబోవుచున్నట్టి అద్భుత ఉపవాస ప్రార్థనను గురించి తన సహోదరి ద్వారా తెలుసుకున్నది. డాక్టర్. పాల్ దినకరన్‌గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆ కూటమునకు పాల్గొనే ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థిస్తారు అని విన్నారు. తద్వారా, ఆమె ఆ నెల ఉపవాస ప్రార్థనకు పాల్గొనెను. ఆ కూటములో డాక్టర్. పాల్ దినకరన్‌గారితో కలిసి ఆమె కూడా ఎంతో భారముగా ప్రార్థించెను. తాను అప్పు ఇచ్చిన ఆ వ్యక్తి తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఎంతగానో భారముతో ప్రార్థించెను.
అయితే, ఆ కూటము జరుగుచున్న సమయములో డాక్టర్. పాల్ దినకరన్‌గారు ప్రవచనాత్మకంగా అనేకమంది పేర్లు పిలిచి, వారి గురించి చెప్పారు. ఆ మాటలను తాను వినిన వెంటనే, ‘ప్రభువా, నా పేరు కూడా పిలిచి, నా సమస్య నుండి నన్ను విడిపించు’ అని తను ప్రార్థించెను. తాను ప్రార్థించిన వెంటనే, డాక్టర్. పాల్ దినకరన్‌గారు, ‘అప్పు ఇచ్చి, తాను తిరిగి డబ్బును పొందుకోవాల్సిన ఒక సహోదరి ఈ కూటములో ఉన్నారు మరియు ప్రభువు తనకు తిరిగి ఆ డబ్బును ఇవ్వాలని కోరుకుంటున్నాడు’ అని తెలియజేశారు. ఆలాగుననే కొన్ని రోజులలోనే, ఆ డబ్బును అప్పు తీసుకున్న ఆ వ్యక్తి తనకు కాల్ చేసి, ఆమెకు ఇవ్వవలసిన ఆ డబ్బు అంతయు తిరిగి ఇచ్చాడు. ఆమె, ‘తన జీవితమంతయు బ్రద్ధలై పోయినది’ అని అనుకున్నది. కానీ, ప్రభువు తన జీవితమును మరల కట్టాడు, దృఢపరచాడు, బలపరచాడు, స్థిరపరచాడు. దేవునికే మహిమ కలుగును గాక.
అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అవమానమును ఎదుర్కొంటున్నారేమో? అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురగుచున్నవని చింతించుచున్నారేమో? జీవితము ఎలా ముగియబోతుందో తెలియలేదు అని అనుకుంటున్నారా? తదుపరి అడుగు ఎలా మరియు ఎక్కడ వేయాలి అని తెలియలేదు అని అంటున్నారేమో? నా జీవితము ఇక పడిపోయినది అని అనుకుంటున్నారేమో? ప్రభువు మిమ్మును మరల కడతాడు. ప్రభువే ఆ కార్యమును మీ పట్ల జరిగిస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మిమ్మును బలపరచి, స్థిరపరుస్తాడు. ఆయన మీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. ప్రియులారా, ఈ వాగ్దానమును ఈ రోజు మనము అంగీకరిద్దామా? ఆలాగున చేసి, దేవుని దీవెనలను పొందుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేడు మాకిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానమునకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు మేము అవమానములను, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము, ఆస్తి లేకుండా, ఇల్లు లేక కష్టమైన పరిస్థితులు ఉన్న మా జీవితాలను మరల కట్టుము. దేవా, మా జీవితాలను మరియు కుటుంబాలను దృఢపరచి, బలపరచి, స్థిరపరచుము. యేసయ్యా, మేము నీకు మహిమార్థమైన సాక్షులుగా జీవించునట్లు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితములో ఇటువంటి గొప్ప కార్యములను త్వరగా చేసి, బలపరచి, మమ్మును దీవించుము. ప్రేమగల ప్రభువా, విశ్వాసం మరియు విధేయతతో నిండిన హృదయంతో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, మా చుట్టూ ఉన్న సమస్తమును కదిలిపోవుచున్నట్లుగా అనిపించినప్పుడు, నీవే మా దృఢమైన పునాది. ప్రభువా, పడిపోయిన మమ్మును నీవు మరల పునరుద్ధరించుము మరియు నీ పరిపూర్ణ చిత్తం ప్రకారం మా జీవితాన్ని నిర్మించుము. దేవా, మా బలహీనత సమయాలలో మమ్మును బలపరచుము మరియు మా విశ్వాసంలో మమ్మును స్థిరపరచుము. ప్రభువా, మమ్మును భారంగా ఉంచే అవమానం, అప్పు మరియు సంశయత యొక్క ప్రతి భారాన్ని మా నుండి ఇప్పుడే తొలగించుము. దేవా, నీ దైవీకమైన ఏర్పాటుపై నమ్మకం ఉంచడం ద్వారా కలుగుచున్న సమాధానముతో మమ్మును నేడు నింపుము. యేసయ్యా, నీవు నేడు మాకిచ్చిన నీ యొక్క వాగ్దానం ఈరోజు మా జీవితంలో నెరవేర్చుము. దేవా, మా ప్రతి శోధనల మధ్యలో మమ్మును బలంగాను మరియు దృఢంగాను, స్థిరంగాను మరల పునరుద్ధరించుము. ప్రభువా, మేము అనుభవించిన కొంచెము కాలము శ్రమల నుండి మమ్మును విడిపించి, నీవు మా జీవితాన్ని స్థిరపరుస్తావనియు మరియు మమ్మును సమృద్ధిగా ఆశీర్వదిస్తావని మేము నమ్ముచు యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.