నా ప్రియ స్నేహితులారా, నేడు మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. కనుకనే, మనము చింతించవలసిన అవసరము లేదు. ఇది సరైన స్థలం, మరియు మనం కీర్తనలు 112:2 వ వచనము ద్వారా నేడు మనము దేవుని స్వరాన్ని వినబోవుచున్నాము. ఈ వచనం ద్వారా మనలను ఆశీర్వదించడానికి ఆయన ఇక్కడ ఉన్నాడని మనకు తెలియజేయబడుచున్నది. ఆ వచనం, "వాని సంతతివారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు.'' అవును, ఇది నిజము. దేవుని యెదుట నీతిమంతులుగా మరియు యథార్థవంతులుగా ఉండేందుకు మనం కృషి చేయుచున్నప్పుడు, మన సంతానం మీద ఒక బలమైన ఆశీర్వాదం దిగి వస్తుంది, అది వారిని ఈ భూమి మీద బలవంతులనుగా చేయుచున్నది. అది మీ ఆధ్యాత్మిక పిల్లలు, మీరు బోధించే వారు మరియు మీ క్రింద పనిచేయుచున్న వారితో సహా మీ పిల్లలందరికి దేవుడు దీనిని నెరవేర్చాలని నేను ప్రార్థించుచున్నాను. తద్వారా వారందరు ఈ భూమి మీద పరాక్రమవంతులు కాగలరు. ఆమేన్

బైబిల్‌లో కీర్తనలు 127:3వ వచనము ఈలాగున సెలవిచ్చుచున్నది, ఆ వచనము, "కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.'' అవును, మీరు నీతి కొరకు ప్రయాసపడుచున్నప్పుడు, విశ్వాసం మరియు ఓర్పుతో బాధలను సహించుచూ, యేసును విడిచిపెట్టడం లేదని నేను అర్థం చేసుకున్నాను. మీరు నీతిని అనుసరించడంలో స్థిరంగా ఉండవచ్చును. నా స్నేహితులారా, ఇదంతా ఎంతో విలువైనది. ఎందుకంటే, "కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు'' అని చెప్పబడినట్లుగానే, మీ కన్నీళ్లు మీ పిల్లల జీవితాలలో ఆనందాన్ని మరియు ఆశీర్వాదాలను తీసుకొని వస్తాయి. వారు బలవంతులు గా మారినప్పుడు మీరు వారి జీవితాలలో అన్ని దీవెనలను పొందుకుంటారు. యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో ఇప్పటికిని పేద స్త్రీలు కూడా వచ్చి యేసుకు కానుకలు సమర్పించుచున్నారని నాకు తెలుసు. వారి కొరతల మధ్య, దేవుడు తమ కుటుంబాన్ని ఆశీర్వదించగలడని మరియు వారి పిల్లలు ఉన్నత స్థానమునకు ఎదగాలని వారు విశ్వసించుచున్నారు. అద్భుతం ఏమనగా, వారి పిల్లలు బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీలను అభ్యసిస్తున్నా రు. అంతమాత్రమే కాదు, అధిక జీతంతో కూడిన ఉద్యోగాలను పొందుకుం టున్నారు మరియు ఉన్నత స్థానములకు ఎదుగుచున్నారు. యేసు కొరకు మీరు అనుభవించుచున్న అన్ని బాధలు మరియు త్యాగాల నిమిత్తము దేవుడు మీ పిల్లలను జ్ఞాపకము చేసుకొనుట ద్వారా దానికి తగిన ప్రతిఫలమిస్తాడు.

కేటీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే, నన్ను నేను తగ్గించుకోవాలని మరియు మరింత పవిత్రంగా జీవించాలని మరియు యేసు కొరకు సరైనది చేయాలని దేవుడు నాకు నేర్పించాడు. నేను దీనిని ఎంత ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తానో, నా కుమార్తె జీవితంలో దేవుని దయ అంత ఎక్కువగా పెరుగుచున్నట్లుగా నేను చూస్తున్నాను. కాబట్టి, నా ప్రియులారా, నేడు మీ పిల్లలు దారి తొలగిపోయినప్పటికిని, ఇంకా ఆలస్యం చేయకండి, మన పిల్లలు ఆశీర్వాదాలు పొందాలంటే, మనలను మనం తగ్గించుకుందాం, పరిశుద్ధంగా జీవించుటకు కృషి చేద్దాం మరియు యేసుకు మనలను మనం అప్పగించుకుందాం. మనం ఆయన కొరకు ఎంత ఎక్కువ కార్యాలు జరిగిస్తామో, దేవుడు మన పిల్లలు ఉన్నత శిఖరములకు ఎదగడానికి, వికసించడానికి మరియు రూపాంతరం చెందడానికి అంతగా సహాయం చేస్తాడు. ఈ ఆశీర్వాదాన్ని మీరు అంగీకరిస్తారా? ఆలాగుననే, నేడు మిమ్మును మీరు దేవుని చేతులకు సమర్పించుకుని, ఆయన మార్గములో నడుచుటకు ప్రయత్నించండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును మరియు మీ సంతతిని కూడ ఆశీర్వదిస్తాడు. నేడు దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
బలవంతుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా సంతానం మీద నీ గొప్ప కృప కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీ బలమైన అభిషేకం వారి మీదికి దిగివచ్చునట్లు మరియు వారి జీవితాలలోనికి విడుదల వచ్చునట్లు చేయుము. దేవా, వారిని అడ్డుకునే ప్రతి పాపము విడిచిపెట్టి, ప్రతి అపవాది శోధనలను మరియు పరధ్యానం కూడా విడిచిపెట్టునట్లు చేయుము. ప్రభువా, నీ యొక్క అద్భుతమైన జ్ఞానం, అభిషేకం, శక్తి మరియు ప్రతిభతో ఈ లోకములో ప్రకాశించునట్లుగాను మరియు ఉన్నత స్థానములకు ఎదుగునట్లుగా వారికి నీ కృపను అనుగ్రహించుము. దేవా, వారిని ' ఈ భూమి మీద బలవంతులుగా' ఎదుగునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి వారి సవాళ్లన్నింటి నుండి బయటపడుటకును మరియు విజయం వెంబడి వారికి విజయాన్ని అనుగ్రహించుటలో వారికి సహాయపడుము. ప్రభువా, మేము మరియు మా సంతతివారు నీ ప్రేమను గట్టిగా పట్టుకుని, మా కుటుంబాన్ని నీ మార్గం వైపు నడిపించడానికి నీవు మాకు సహనమును అనుగ్రహించుము. దేవా, నీ పట్ల మా ప్రేమ ఎల్లప్పుడు కొనసాగాలనియు, తద్వారా మేము మరియు మా సంతానము నీ యొక్క పరిశుద్ధతను కలిగి ఉండుటకును మరియు మా పిల్లలకు మరియు మా చుట్టూ ఉన్నవారికి ప్రకాశించే వెలుగుగా మేము జీవించునట్లుగా మా జీవితాలను రూపాంతరపరచుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.