నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 15:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో ప్రభువు, ‘‘మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెను’’ అని సెలవిచ్చుచున్నాడు. అవును, దేవుడు తన సంతోషముతో మిమ్మును నింపాలని మీ పట్ల కోరుచున్నాడు. మీ జీవితం ఆనందంతో పొంగిపొర్లాలని, మీరు సమస్తమును సంతోషంతో అనుభవించి ఆనందించాలని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు. దీనిని సాధ్యపరచడానికి, ఆయన తన ఆనందాన్ని మీ హృదయంలోనికి కుమ్మరిస్తాడు మరియు ప్రభువు ఆనందం మీకు పరిపూర్ణ బలము అవుతుంది. కనుకనే, మీరు దేనికిని భయపడకండి మరియు దుఃఖపడకండి.
ఇంకను నా ప్రియులారా, బైబిల్ నుండి 3:17వ వచనములో చూచినట్లయితే, ‘‘ నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషముచేత ఆయన హర్షించును’’ మరియు జెఫన్యా 3:19లో చూచినట్లయితే, ఆయన మంచి పేరును, ఖ్యాతిని మీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చుచున్నాడు. అవును, మీ జీవితంలో దేవుని ఆనందం యొక్క శక్తి అలాంటిది! కాబట్టి రండి, ఆనందించండి, మరియు ‘‘యేసు నా యందు ఆనందించుచున్నాడు! ’’ ప్రకటించండి. నిజానికి, దేవుడు మీకు సమృద్ధియైన ఆశీర్వాదాలతో మీకు సంతోషాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మును బట్టి ఎందుకు సంతోషిస్తున్నాడు? మొదటిదిగా, ‘మీరు సత్యంలో నడుస్తున్నారు’ కాబట్టి. బైబిల్‌లో, 3 యోహాను 4వ వచనములో వ్రాయబడినట్లుగానే, ‘‘ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.’’ నా ప్రియులారా, మీరు దేవుని సత్యము ప్రకారము దేవుని అనుసరిస్తూ, దేవుని యొక్క నీతిలో మీరు నడుచుచున్నారు. కనుకనే, ప్రభువు మిమ్మును బట్టి ఆనందించుచున్నాడు మరియు ఆయన ఆనందం మీలో పొంగిపొర్లుతుంది, ఈ లోకంలో మీరు దెవీకమైన సంతోషాన్ని అనుభవించి, ఆనందించునట్లుగా చేస్తాడు.
రెండవది, ‘మీరు యేసును ఇతరులతో పంచుకుంటారు.’ లూకా 10:21వ వచనములో చూచినట్లయితే, యేసు తన శిష్యులను బట్టి ఆనందించినట్లుగానే, ఆయన మిమ్మును బట్టి ఆనందించుచున్నాడు. ఎందుకు? ఎందుకంటే, శిష్యులు ప్రతి ప్రాంతాలకు మరియు ప్రతి గృహాలకు వెళ్లి, వారు యేసు నామాన్ని ప్రకటించుచూ, ప్రతిచోటకు వెళ్ళారు. తద్వారా, ప్రజలు యేసుక్రీస్తు యొక్క వర్తమానమును స్వీకరించినప్పుడు, సమాధానము వారి గృహాలలోనికి వచ్చినది. వారి హృదయాలలో శాంతి నింపబడినది మరియు వారిని అణచివేస్తున్న దురాత్మలు వారిని విడిచిపెట్టి పారిపోవడం జరిగింది. అదేవిధంగా, మీరు యేసుతో నిలిచి, యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో ఇతరులకు యేసును గురించి సాక్ష్యమిస్తుండగా, ప్రజల జీవితాలలో దురాత్మలు పారిపోతున్నాయి. అందుచేతనే, యేసు మిమ్మును బట్టి ఆనందించుచున్నాడు. తద్వారా, దేవుని యొక్క సంతోషము మిమ్మును నింపుతుంది. దురాత్మలు విడిచిపెట్టి వెళ్లిపోతాయి మరియు మీరు యేసుచేత సంపూర్ణంగా నింపబడి, ఆయన సన్నిధిని ఆనందిస్తారు. అప్పుడు మీ గృహాలలో శాంతి నిత్యము నిలిచి ఉంటుంది.
మూడవదిగా, మీరు దేని కొరకైన యేసు నామములో అడిగినప్పుడు, వెనువెంటనే, ఆయన మీకు దానిని అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్‌లో యోహాను 16:24 ఇలా సెలవిచ్చుచున్నది, ‘‘ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును’’ అని చెప్పబడినట్లుగానే, మీరు యేసు నామములో అడిగినప్పుడు, ‘ ఆయన మీ ప్రార్థనలకు జవాబిస్తాడు.’ అవును! మీ సంతోషము పరిపూర్ణం కావడానికి మీరు కోరుకున్నవన్నియు మీరు పొంది ఉండాలని దేవుడు మీ పట్ల కోరుకుంటున్నాడు. కనుకనే, మీరు యేసు నామంలో ఆయనను అడుగుతారా? ఆలాగున అడిగినప్పుడు, మీ సంతోషము పరిపూర్ణమవుతుంది.
చెన్నై నుండి సహోదరి జయలత యొక్క శక్తివంతమైన సాక్ష్యమును నేను మీతో పంచుకోవాలని కోరుచున్నాను. 9 సంతవ్సరములుగా ఆమె సంతానము లేకుండా, గొడ్రాలుగా ఉండెను. ఆమెను అందరు కూడా కించపరుచుచుండెను. భర్తగారి కుటుంబము అయితే, తన భర్తను వేరొక పెళ్లి చేసుకో, ఆమెను విడిచిపెట్టమని చెప్పారు. తద్వారా, ఆమె హృదయము బ్రద్ధలైపోయినది. తరచుగా, భార్యభర్తలిద్దరు పోట్లాడుకునేవారు. కానీ, ఆమె ఇంకను గర్భము దాల్చలేకపోవుచుండెను. అటువంటి సమయములో ఆమె యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు రావడం ప్రారంభించెను.
అయితే, ఆమె ఒక శుక్రవారము రోజున ఆమె కుటుంబ ఆశీర్వాద కూటములో పాలుపొందెను. ప్రార్థన యోధులు ఆమె కొరకు కనికరముతో నింపబడి ఎంతో భారముతో ప్రార్థించారు. ఇంకను ఆమెకు పుట్టబోవు బిడ్డను యౌవన భాగస్థుల పధకములో భాగస్థునిగా చేర్చారు. అవును, 24 గంటలు యౌవన భాగస్థుల కొరకు ప్రార్థనా గోపురములో ప్రతిరోజు మేము ప్రార్థనలు చేస్తుంటాము. యౌవన భాగస్థుల పధకములో చేర్పించబడిన వారి పేరు, వారి ఫోటో ప్రార్థనా గోపురములో ఉంటాయి. కనుకనే, వారి కొరకు నిత్యము ప్రార్థనలు చేయడము జరుగుతుంది. కానీ, ఈ సహోదరికి ఇంకా బిడ్డలు కలుగలేదు. అయినప్పటికిని దేవుడు తనకు బిడ్డను ఇస్తాడు అన్న విశ్వాసముతోనే, తన బిడ్డను ముందుగానే, యౌవన భాగస్థుల పధకములో భాగస్థునిగా చేర్పించెను. దేవుడు ఆమె విశ్వాసమును ఘనపరచియున్నాడు. కనుకనే, అటుతర్వాత, 15 రోజులలోనే ఆమె గర్భమును ధరించెను. 9 సంవత్సరములుగా ఆమెకు బిడ్డలు లేరు. 9 సంతవ్సరముల తర్వాత దేవుని ఆనందము ఆమె మీదికి దిగి వచ్చినది. యౌవన భాగస్థుల పధకము ద్వారా ఆమె పరిచర్య కొరకు, ఆమె సహకరించుటకు ముందుకు వచ్చినందున దేవుడు ఆమెకు సమూయేలును ఇవ్వడము ద్వారా ఆమె సంతోషమును ఆయన పరిపూర్ణము చేశాడు. అంతటితో ఆగిపోలేదు, ఆమె మరల గర్భము దాల్చారు. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు షారోను అని పేరు పెట్టెను. మా యొక్క పిల్లల పేర్లవలెనే, వారికి పేర్లు పెట్టెను. ఆ తర్వాత, ఆమె ఒక నిబంధన చేసుకున్నారు, సీషా ద్వారా మేము సేవలు అందించుచున్న విధానములో పేద పిల్లలకు క్రొత్త వస్త్రమును ఇవ్వడానికి ఆమె ఎంపిక చేసుకున్నారు. ఈ రోజు ఆమె ఎంతగానో ఆశీర్వదింపబడియున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియులారా, దేవుడు ఆలాగుననే, మీకును జరిగిస్తాడు. అప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగుతుంది. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా హృదయాన్ని నీ దైవీకమైన ఆనందంతో నింపినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా జీవితంలోని ప్రతి సమయములోను నీ ఆనందం మాకు బలముగా మారునట్లుగా చేయుము. యేసయ్యా, నీవు మా యందు ఆనందించునట్లుగాను మరియు ప్రతి అవమానాన్ని ఘనతగా మరియు ఖ్యాతిగా మార్చుము. దేవా, మా జీవితం నీకు ఆనందాన్ని కలిగించునట్లుగా నీ సత్యంలో నడవడానికి మాకు సహాయం చేయుము. యేసును ఇతరులతో పంచుకోవడానికి మమ్మును ధైర్యంగా నింపుము. ప్రభువా, మేము నీ నామాన్ని ప్రకటించుచు, నీ కొరకు సాక్ష్యమిచ్చునప్పుడు, మా జీవితాలలోను మరియు మా కుటుంబములో ఉన్న ప్రతి దురాత్మ పారిపోవునట్లుగా చేయుము. దేవా, మేము యేసు నామంలో అడుగుచున్నాము, మా హృదయ కోరికలను మాకు తీర్చి, మా ఆనందాన్ని పరిపూర్ణము చేయుము. దేవా, మా గృహము నీ సన్నిధి, ప్రేమ మరియు శాంతితో నింపబడునట్లు చేయుము. ప్రభువా, నీ ఆనందం మమ్మును ఎన్నటికిని, ఓటమి కలిగించదని గుర్తెరిగి నీ పరిపూర్ణ చిత్తానికి మేము లోబడుచున్నాము. ప్రభువా, మా ప్రాణాత్మలను మరియు దేహములను శుద్ధీకరించుము, సత్యములో నడిచే దేవుని పిల్లలనుగా ఇప్పుడు మా జీవితములను నీకు సమర్పించుకొనుచున్నాము. తద్వారా నీ యొక్క సంతోషము మా జీవితములో పరిపూర్ణమగునట్లుగా చేయుము. యేసయ్య, నీ నామమున మేము ఏది అడిగినను దానిని నీవు మాకు అనుగ్రహించుము. దేవా, సంతానము లేని మాకు సంతానము దయచేసి, మా దుఃఖమును సంతోషముగా మార్చుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.