నా ప్రియమైన స్నేహితులారా, ఈ నెల యొక్క చివరికి మనము వచ్చాము. అయితే, దేవుని యొక్క మంచితనము నిత్యము కొనసాగుతూనే ఉన్నది. ప్రతి నెల, ప్రతి దినము ఆయన యొక్క మంచితనము మనకు చాలినంతగా ఉంటున్నది కదా! నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 13:21వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.'' ప్రకారం నీతిమంతులకు దేవుడు మేలును ప్రతిఫలముగా ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. నేను చిన్నవయస్సులో ఉన్నప్పుడు, నేను ఒక కార్టూన్ కథను చూస్తుండుటను నాకు జ్ఞాపకము వచ్చినది. నేను మరియు మా సహోదరి టామ్ అండ్ జెర్రీ కథను చూడడానికి చాలా ఇష్టపడేవారము. టామ్ ఏమో ఒక పిల్లి, జెర్రీ ఏమో ఒక ఎలుక. అయితే, ఇవి ఒక స్థలములో ఉంటాయి. ఎలుక చిన్నది, జెర్రీ మాత్రము ఆ యింటి గోడపై నివాసము చేస్తుండేది. అయితే, ఈ ఒక్క పిల్లి, ఈ ఎలుకను బయటకు రప్పించుట కొరకు కన్నము వెలుపల కొంత చీజ్‌ను ఉంచి ఆకర్షించే ప్రయత్నము చేసేది. ఆ యొక్క చీజ్ ఎలుకను పెట్టే యంత్రము మీద అమర్చేవారు. చీజ్ యొక్క వాసన కన్నములోనికి వెళ్లి, జెర్రీ యొక్క వాసనను ఆఘ్రాణించే విధంగా అది పెట్టబడి ఉంటుంది. చిన్న ఎలుక బయటకు వచ్చి, అక్కడ ఉన్న ఈ చీజ్‌ను కొనుగొనేది.
కానీ, అది చాలా తెలివిగా ఈ యొక్క చిట్టెలుక ఆ చీజ్‌ను ముట్టుకొనకుండా ఉండేది. ఎందుకంటే, ఆ చీజ్‌ను ముట్టుకొన్నట్లయితే, అది చెరపట్టబడుతుంది గనుక. కనుకనే, వేరొక బరువు తీసుకొని వచ్చి, ఆ ఎలుకను పెట్టే దాని మీద పెట్టి, ఈ సీజ్‌ను తీసుకొని వెళ్లేది. ఇక ఆ ఎలుకను తరమడం కొరకు టామ్ చాలా కోపంతో ఉండేది. దానిని ఇల్లంతయు కూడా తరుముచుండేది. ఎలుక పిల్లి మీదికి పళ్లెము విసిరేది, పిల్లి పట్టుకోబోయే సమయమునకెల్లా, వెంటనే, ఇనుప పెట్టెను, ఐరన్ బాక్స్‌ను దాని మీదికి నెట్టివేస్తుండేది. ఇక డైనింగ్ టేబుల్ మీద అవి పరుగులు పెడుతూ ఉండేవి. ఎలుక, కేకును జెల్లిని, ఆ విధంగా పిల్లి మీద విసురుతూ ఉండేది. జెర్రీ విసిరి వేసినవన్నియు కూడా టామ్‌కు తగులుతూ, దెబ్బలు తింటూ ఉండేది. చివరిగా ఇల్లంతయు కూడా చెల్లాచెదరైపోయేది. అన్నియు కూడా పగిలిపోయి చెదరిపోయేవి. ఆ గృహ యజమాని తాను యింటిలోపలికి రాగానే, తన పెంపుడు పిల్లి చేసిన ఆ పనులన్నియు కూడా చూచినప్పుడు టామ్‌కి ఇక బోలెడన్ని దెబ్బలు పడేవి. ఈ యొక్క టామ్ మీద దెబ్బలు పడుతుంటే, ఈ యొక్క జెర్రీ ఏమో, కేకులు, చీజ్‌ను మరియు అక్కడ ఉన్న వంటక పదార్థాలన్నియు సంతోషంగా ఆరగిస్తూ, ఆనందిస్తూ ఉండేది. తానే ఆ యొక్క బహుమానములన్నిటిని ఆనందించేది.
నా ప్రియులారా, కీడు పాపులను తరుమును. పాపులకు విశ్రాంతి ఉండదు. సమస్యలు ఎప్పుడు కూడా వారిని వెంటాడుతుంటాయి. కానీ, నీతిమంతులకు అయితే, ప్రభువు వారికి మేలును ప్రతిఫలముగా ఇచ్చును. మీరు దేవుని యొద్ద నుండి వచ్చు ప్రతిఫలము కొరకు సహనముతో ఎదురు చూస్తుండవచ్చును. కానీ, నా ప్రియులారా, చిట్టెలుక వలె మీకు కూడా శ్రేష్టమైన మేలు అనుగ్రహించబడుతుంది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు తరుమబడుతూ, తరుమబడుతూ ఉండి ఉన్నారేమో? కానీ, దేవుడైతే, వీటన్నిటి మధ్యలో మీ యొక్క నీతిని నిలిపి, మిమ్మును ఆ రీతిగా మీ మీద దృష్టిని ఉంచి, చూసున్నాడు. ఆయన మీకు మంచి యీవులతో బహుమానము ఇస్తాడు. మనము ఇప్పుడే, వాటిని స్వీకరించుదామా? నేడే, ఆయన యొద్ద మేలులను పొందుకొనుటకు మిమ్మును సహనముతో దేవునికి సమర్పించి, ఎదురు చూస్తున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మేలును మీకు ప్రతిఫలముగా ఇచ్చి, నేటి వాగ్దానము ద్వారా ఆయన మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు నీ యొక్క వాగ్దానము ద్వారా నీవు మమ్మును కనికరించుము. ప్రభువా, మేము దుష్టత్వము చేత, కీడు చేత తరుమబడియున్నాము, మేము ఎంతగానో తరుమబడియున్నవారముగా ఉంటున్నాము, దుష్టులైన మనుష్యులు మమ్మును వెంటాడుచున్నారు. కానీ, ప్రభువా, మా విశ్వాసము మేము నీ యందు ఉంచియున్నాము మరియు నీ యొక్క ఉపదేశములను, మేలులను నీ యందు నిలుపుకొని మేము సమస్తమును నీ యొద్ద నుండి పొందుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. కానీ ప్రభువా, మేము నీ మీద మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, నీ బోధనలు మరియు విలువలను అనుసరించడానికి మరియు నీవు మాకు బోధించిన దాని నుండి ఎప్పుడూ వైదొలగకుండా ఉండటానికి దయతో మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ వాక్యం చెప్పినట్లుగా, దయచేసి మా కొరకు నీవు సిద్ధపరచిన ప్రతిఫలంతో ఇప్పుడే వచ్చి మాకు ప్రతిఫలము అనుగ్రహించుము. దేవా, మా జీవితం పట్ల నీవు కలిగియున్న ఉద్దేశములన్నిటిని నీవు మేలులతో నింపుము. దేవా, మా కొరకు నీవు దాచి ఉంచిన ప్రతిదానిని, మా జీవితములో జతపరచి, మమ్మును సమస్త మేలులతో నింపుము. ప్రభువా. మాకు కొరతగా ఉన్న ప్రతి ప్రాంతంలో, నీ యొక్క సమృద్ధి ప్రవహించునట్లుగాను మరియు మా ప్రార్థనలన్నింటికి జవాబును దయచేయుము. ప్రభువా, మేము ఎదుర్కొనుచున్న కష్టాలన్నిటిని నీవు మమ్మును ఘనపరచి, మాకు తగిన ప్రతిఫలమును దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.