నా ప్రియమైన స్నేహితులారా, ఈ డిసెంబర్ మాసములో దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడని నాకు తెలుసును. ఇది క్రిస్మస్ కాలం. దేవుడు ఈ మాసములో ప్రతి దినము మీకు ఒక నూతనమైన బహుమానమునిస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 30:5 వ వచనమును మనము చూద్దాము. ఆ వచనములో, "...సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును'' ప్రకారము అత్యంతమైన మహా సంతోషము మీ జీవితములో రావడం కొరకు వేచి ఉన్నది.

నా ప్రియులారా అయితే, ఏడ్పు వచ్చు వేళ అనునది చాలా కష్టతరమైనది. ఆ సమయము మన చుట్టు కూడా రాత్రి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మన చుట్టు గాఢాంధకారము ఆలుముకొని ఉంటుంది. దీనిని దాటి మనము మన భవిష్యత్తును చూడలేకపోతాము. కేవలము మరణాన్ని మరియు శ్రమలను మాత్రమే మనము చూస్తూ ఉంటాము. ఇది సులభతరమైనది కాదు. కానీ, నా ప్రియ స్నేహితులారా, దాని ద్వారా కూడా దేవుడు మేలుకరమైన ఉద్దేశములను ప్రణాళిక చేసియున్నాడు. సంతోషకరమైన సమయం తప్పకుండా వస్తుందని పై వచనము ద్వారా మనము ఈ సంగతిని గుర్తించగలుగుచున్నాము. సంతోషకరమైన సమయము రానై యున్నది. కాబట్టి, ఆ వాగ్దానాన్ని పట్టుకోండి మరియు మీరు దుఃఖంలో మునిగిపోకుండా రాబోయే ఆనందం కొరకు ఎదురుచూడండి. కనుకనే, మీరు ఎల్లవేళల అటువంటి సంతోషము వైపు చూడండి. తద్వారా మీరు దుఃఖములో మునిగిపోకుండా ఉంటారు.

ఇంకను బైబిల్‌లోరోమీయులకు 8:18వ వచనము మనకు ఏమి గుర్తు చేయుచున్నదో చూడండి, "మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను '' అని చెప్పబడినట్లుగానే, ప్రస్తుత కాలపు శ్రమలతో పోల్చుకున్నట్లయితే, రాబోవుచున్న మహిమ ఎంతో ఎన్నతగినదిగా ఉంటుంది. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, ప్రభువు తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును. నిజానికి, 2022వ సంవత్సరములో యేసు పిలుచుచున్నాడు వాగ్దానపు పాటగా "సరిచేయును'' అను పాటను మేము పాడియున్నాము.

నేను అమెరికా దేశములో ఉన్న కొన్ని చెట్లను చూచినప్పుడు, శీతకాలములో ఆ చెట్లు మరి మరి ఎక్కువగా ఎండిపోయి ఉండుట మనము చూడగలము. ఆ చెట్లు తమ అందాన్ని కోల్పోయి చాలా నిరాకారముగా మరియు నిర్మానుష్యంగా కనిపిస్తాయి. ఒక సమయము వచ్చినప్పుడు, ఆ ఆకులలో బలము లేకుండా, చెట్టు నుండి ఆకులన్నియు కూడా రాలిపోతాయి. కానీ మరుసటి సంవత్సరం వచ్చినప్పుడు మరియు వేసవి కాలము రావడం అనేది ఆరంభించగానే, ఆకస్మాత్తుగా, వర్ణవంతమైన ఆకులు చిగురిస్తాయి. ఆ చెట్టు చూడడానికి మహిమవంతముగా ఉంటుంది. ఇంకను ఎంతో సౌందర్యవంతముగా ఉంటుంది. అందరు కూడా చెట్టు నీడ క్రిందకు వచ్చి, ఫోటోలు తీసుకోవాలని అనుకుంటారు.

అవును నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా, అట్టి మహిమ మీ జీవితములో రావడానికి ఒక కాలం వస్తుంది. కనుకనే, ఎండిపోయిన ఏడ్పు వచ్చే సమయములలో ఇట్టి వేళలను గురించి మీరు విచారించకండి. మీ ఎండిన జీవితము మరియు ఏడుపు కాలం శాశ్వతంగా ఉండదు. మీ హృదయాన్ని కలవరపడనీయ్యకండి. దానికి బదులుగా, మనం దేవుని వైపుకు తిరుగుదాము మరియు మనము దేవుని వైపు చూస్తూ, రాబోవుచున్న ఆనందం కొరకు మనము ఆయనను అడుగుదాము. నిశ్చయంగా దాని మార్గంలో ఉన్న ఆనందం పొందుకుందాం. ఉత్తమమైనది ఇంకా రావలసి ఉన్నది! కనుకనే, దిగులుపడకండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, రాత్రి ఎంత చీకటిగా అనిపించినా ఉదయాన్నే ఆనందం వస్తుందన్న నీ వాగ్దానానికి కృతజ్ఞతలు. దేవా, నూతనకరమైన ఆత్మ కొరకు ప్రభువా మమ్మును మేము నీ యందు బలపరచుకొనునట్లుగా చేయుము. నేటి దినములో మేము ఎదుర్కొంటున్న అంధకారమును బట్టి మేము ఓడిపోము. ప్రభువా, నీ బిడ్డలైన మమ్మును నీ మహిమ కొరకు సంసద్ధిము చేయుము. దేవా, ఈ సౌందర్యవంతమైన విధానము కొరకు మమ్మును సంసిద్ధము చేయుము. దేవా, నీ బలమైన సన్నిధి కొరకు నీకు వందనములు. ప్రభువా, మాలో నూతనమైన బలము ఉదయించునట్లు చేయుము. దేవా, మమ్మును బలపరచి, రాబోవు కాలములో మమ్మును ఆశీర్వదించి, ఆనందపరచి, మేము ఎల్లప్పుడు నీలో గానము చేయునట్లుగా నీ కృపను దయచేయుము. ప్రభువా, మా ఏడుపు మరియు బాధల మధ్య, నీ వాక్యాన్ని పట్టుకుని, నీ మంచితనాన్ని విశ్వసించడానికి మాకు నీ కృపనిమ్ము. దేవా, మా యెడల ప్రత్యక్షము కాబోవు నీ మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని మేము యెంచుకొనునట్లుగాను మరియు ఈ పోరాట ఋతువుకాలము తర్వాత నీవు మమ్మును స్థిరపరుస్తావు అని తెలుసుకొని దానిని సహించుటకు దయచేసి మమ్మును బలపరచుము. ప్రభువా, మా జీవితానికి పునరుద్ధరణను తీసుకురావాలని మేము నిన్ను కోరుచున్నాము మరియు నమ్ముచున్నాము. దేవా, ఇంకా రాబోయే ఆనందం మరియు ఆశీర్వాదాల కొరకు మా హృదయాన్ని కోరికలతోను మరియు నిరీక్షణతోను నింపుము. ప్రభువా, మా కష్ట కాలములో కూడా నీవు మా నిమిత్తము కలిగియున్న మంచి ఉద్దేశము కొరకును మరియు రాబోయే సమృద్ధి ఆనందము కొరకు మేము నీ వైపు చూచుచున్నాము, మా ఏడ్పును మరియు చీకటిని తొలగించి, మాకు సంతోషాన్ని దయచేయుమని యేసుక్రీస్తు కృపగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.