నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయుటలో నేను ఎంతగానో ఆనందించుచున్నాము. నేడు మనము దేవుని స్వరమును విననై యున్నాము. అందుకే నేటి వాగ్దానముగా, కీర్తనలు 91:11వ వచములో కనుగొనెదము. ఈ వాగ్దాన వచనము, "నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును'' అన్న వచనము ప్రకారం అవును, మీ మార్గములన్నిటిలో ఆయన మిమ్మును కాపాడతాడు. ఆయన మిమ్మును భద్రపరచును. ఆయన మన గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. కాబట్టి, మీరు భయపడకండి.

మా తాత్యగారు తన మనమ సంతానాన్ని కాపాడు నిమిత్తమై దేవుడు కాపాడే తన దూతను ఏర్పరచి యున్నాడని ఆయన ఒక దర్శనమును చూచియున్నాడు. ప్రతి ఒక్కరిని కాపాడే దూత ఉన్నదని లేఖనము నిజమని ఆయన ఎరిగియున్నాడు. ఆయన మనలను భద్రపరచవలెననే శ్రద్ధను కలిగియున్నాడు. కనుకనే, భయపడకండి. దేవునికి ప్రియుడైన దానియేలు విషయములో కూడ అతడు కొంతమంది చెడు ప్రజల ద్వారా సింహాల గుహలోనికి త్రోసివేయబడ్డాడు. సింహాల గుహలో ఉండి దేవుని హత్తుకొని ఉంటూ, దేవుడు ఇంకను తనను భద్రపరుస్తాడని దేవుని మాట కొరకు ఎదురు చూచుచుండెను. ఆకలితో ఉన్న సింహాలు తన ప్రక్కనే వేచియున్నాయి. కానీ, పరిశుద్ధ గ్రంథము చెబుతుంది, 'దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించినందున దానియేలును అవి తాకలేదు.' అవి అతని దగ్గరకు కూడా రాలేదు. మనము ఎంత బలమైన దేవునిని కలిగియున్నాము కదా!

నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీకు విరోధముగా సింహాల వలె గర్జించుచూ కూడా ఉండవచ్చును. పరిస్థితులు మిమ్మును మ్రింగివేస్తాయి అన్నట్లుగా, గర్జన చేయుచుండవచ్చును. ఆ గర్జనలను చూచి మీరు భయపడుతూ కూడా ఉండవచ్చును. దేవుడు తన దూతలకు ఆజాపించియున్నాడు. అవి ఏ మాత్రము కూడా మిమ్మును తాకజాలవు. ఇట్టి భయకంపితమైన కార్యాలన్నిటి నోటిని దూతలు ఈ విధంగా కట్టి వేస్తాయి. మీరు ఎంతో సురక్షితంగా ఉంటారు. దేవుడు ఇటువంటి ప్రయోజనాన్ని ఎవరికి అనుగ్రహిస్తాడు? బైబిల్‌నందు కీర్తనలు 91లో ఈలాగున చెబుతుంది, " మహోన్నతు ని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు'' అని వ్రాయబడినట్లుగానే, దానియేలు కూడ ఎల్లప్పుడు దేవుని నామమును హత్తుకొని జీవిస్తూ, ఆయన నామమందు నిలిచియున్నవాడు గనుకనే, 'దుష్టప్రజలు నాకు విరోధముగా వచ్చినప్పటికిని నేను ఏ మాత్రము ఆయన నామమును విడిచిపెట్టను నేను ఆయన నామము కొరకు నిలబడతాను అని అనుకున్నాడు.' నేడు మీరు కూడ ఆలాగున చేస్తున్నారేమో నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని నామము కొరకు నిలబడినప్పుడు, దేవుడు మీ కోసము నిలబడతాడు. గర్జించు సింహాల నోళ్లను కట్టివేస్తాడు. తన దూతలతో మిమ్మును భద్రపరుస్తాడు. ఇందును బట్టి దేవునికి వందనాలు చెబుతామా? అంతమాత్రమే కాదు, ఆయన మీ మార్గములన్నిటిలో ఆయన మిమ్మును భద్రపరచును. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రేమగల ప్రభువా, నీ దృష్టి ఎల్లప్పుడు మా మీదఉన్నాయని మాకు నమ్మకాన్ని కలిగించినందుకై నీకు వందనాలు. దేవా, మేము నిన్ను మాత్రమే ఆశ్రయించుచున్నాము. ఇంకను మేము ఒక్క అంగుళం కూడా కదలకుండా నీ నామము కొరకు స్థిరంగా నిలబడునట్లుగాను మరియు మమ్మును బెదిరించి మ్రింగివేస్తున్న పరిస్థితులు మాకు ఎదురైనప్పటికిని, మా పట్ల నీకున్న ఎనలేని ప్రేమను మేము ఇప్పటికి నమ్మునట్లు చేయుము. దేవా, నీవు పరలోకము నుండి మా మొరలను విని, మమ్మును రక్షించడానికి లేచినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మమ్మును రక్షించడానికి మరియు ఈ బెదిరింపుల నుండి మమ్మును విడిపించడానికి నీవు నీ దేవదూతలను మా కొరకు ఉంచావనియు మాకు వాగ్దానం చేసినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, కీడు మరియు హాని ఏదియు మాకు కలిగించకుండా మమ్మును నీ దూతలకు ఆజ్ఞాపించుము. ఎందుకంటే, నీవు మాకు సంపూర్ణంగా విజయాన్ని అనుగ్రహిస్తావనియు మరియు దుష్టప్రజలు యెదుట మమ్మును ఘనపరుస్తావనియు మేము నమ్ముచున్నాము. ప్రభువా, అన్ని నామములకంటే శక్తివంతమైన నీ నామానికి వందనాలు చెల్లించుచు యేసుక్రీస్తు అతి ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.