నా ప్రియమైన స్నేహితులారా, ఇది ఒక నూతనమైన దినము. దేవుడు ఈ రోజు మనకు ఒక నూతన నిరీక్షణను దయచేయుచున్నాడు. ఆయన నిరీక్షణ ద్వారా మనము జీవించెదము. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 46:4వ వచనము తీసుకొనబడి యున్నది. ఆ వచనము, "ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, తల వెండ్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే'' అని చెప్పబడియున్నది. ప్రభువు మనలను మోస్తాడని ఎంత చక్కగా సెలవిచ్చియున్నాడు కదా! "వృద్ధాప్యము వరకు నేనే మిమ్మును మోయువాడను'' అని చెబుతున్నాడు. అవును, మనలను కాపాడి సంరక్షించుటకు, మోయుటకును ఎంత భద్రతగల హస్తాలను మనము కలిగియున్నాము కదా.

అయితే, నా ప్రియులారా, నేడు మీరు ఈలాగున అనుకొనవచ్చును, సోదరుడా, పరిస్థితులు చూచినట్లయితే, ఆలాగున లేవు, క్యాన్సర్ ఆఖరి దశలో ఉన్నాను, మూత్రపిండాలు పనిచేయుటలో నేను ఆఖరి దశలో ఉన్నాను. నేను ఆఖరి క్షణాలకు వచ్చాను, ఋణస్థుల దయ మీద బ్రతుకు చున్నట్లుగా ఉన్నాను. నా జీవితము నాశనమైపోతుందేమో అని నేను అనుకుంటున్నాను! దేవుడు నన్ను ఏలాగున మోస్తాడు? నా ప్రియ స్నేహితులారా, మా తాతయ్యగారు బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, మనలో అవయవాలు పనిచేయనప్పుడు, ఆఖరి దశలో ఉన్నప్పుడు, డాక్టర్లు నిరీక్షణ లేదు అని చెప్పినప్పుడు, మా తాతయ్యగారు, మా బామ్మగారిని పిలిచారు. ఆమెతో, 'మన యింటి కార్యములన్నిటిని చక్కపరచుకో, బిడ్డల పట్ల జాగ్రత్త వహించుకో, నేను ఎక్కువ కాలము ఇక నీతో నేను ఉండను. అయితే, దేవుడు మీ పట్ల జాగ్రత్త వహిస్తాడు అని చెప్పారు.' కానీ, మా నాన్నమ్మగారు లేచి ఏమని చెప్పారంటే, "లేదండి, మీరు మరణించరు. ఎందుకంటే, దేవుడు మీ ద్వారా గొప్ప బలమైన కార్యాలను జరిగిస్తానని వాగ్దానము చేశాడు. ఆయన మనలను పడిపోనివ్వడు, మీరు మరణించరు, మీ వృద్ధాప్యము వరకు మిమ్మును మోయువాడను నేనే, అని వాగ్దానము చేసిన దేవుడు నిశ్చయముగా, మిమ్మును మోస్తాడు'' అని చెప్పారు. మరియు నిజానికి, దేవుడు తన వాగ్దానాలను మా తాతగారి పట్ల నెరవేర్చి, ఆయన ప్రాణాన్ని కాపాడాడు మరియు వృద్ధాప్యము వరకు మా తాతగారిని తన సేవలో వాడుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.

అవును, నా స్నేహితులారా, నేడు మిమ్మును మరణమునకు అప్పగించడని, నేను ఎరిగియున్నాను. ఎందుకంటే, 'మీ వృద్ధాప్యము వరకు నేనే మిమ్మును మోయువాడను' అని చెప్పినట్లుగానే, అటువంటి ప్రియమైన తండ్రిని కలిగియున్నాము. ఆయన మీకు ఇప్పుడే పునరుత్థానమును ఇచ్చుచున్నాడు. ఆయన కనికరము మీ మీదికి వచ్చి, ఆయన చేతులతో మిమ్మును ఇప్పుడే పైకి లేవనెత్తాడు. కనుకనే, మీరు దేనికిని భయపడవలసిన అవసరము లేదు.

ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 91:14-16 వ వచనములలో చూచినట్లయితే, "అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను'' అన్న వచనముల ప్రకారము, దేవునిని గుర్తించి, ఆయన నామమును వెదకుచూ, ఆయన నామము కొరకు పరుగెత్తువారిని ప్రభువు దీర్ఘాయువు చేత నింపి, వారిని తృప్తిపరుస్తాడు మరియు ముదిమము వచ్చువరకు వారిని మోస్తాడు. అటువంటి వారిని ఆయన భద్రపరచును. తన చిత్తమును వారి ద్వారా ఆయన నెరవేరుస్తాడు. కనుకనే యేసు హస్తాలలోనికి రండి, నేడు మనము ఆయన యొద్దకు వచ్చి, మిమ్మును మీరు ఆయనకు అప్పగించుకుంటారా? దేవుడు మిమ్మును మోస్తాడు. కనుకనే, మీరు విచారించకండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవిస్తాడు.

ప్రార్థన:
కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మా వృద్ధాప్యం వరకు కూడా మమ్మును మోసుకువెళతాననే నీ వాగ్దానానికి వందనాలు. దేవా, మా జీవితం భారంగా అనిపించినప్పుడు, నీ బలమైన, శ్రద్ధగల బాహువుల గురించి మాకు గుర్తు చేసినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క పునరుత్థానపు శక్తి కొరకై నీకు వందనాలు. ప్రభువా, మా దేహములోనికి నీ శక్తి దిగివచ్చునట్లుగా చేయుము. యేసయ్యా, మా యొక్క మరణకరమైన పరిస్థితిలో నుండి మమ్మును మార్చుము. మేము మరణించకుండా, వృద్ధాప్యము వరకు మమ్మును మోయుమని కోరుచున్నాము. ప్రభువా, మా భయాందోళనలను వదులుకుని, మమ్మును నిలబెట్టడానికి నీ ప్రేమను విశ్వసిస్తూ ఈ రోజు మేము నీ వద్దకు వచ్చుచున్నాము. దేవా, మా హృదయంలోనికి నూతన జీవమును నీ దయతో లోపల నుండి మమ్మును పునరుత్థానం చేయుము. యేసయ్యా, నీవు మమ్మును కాపాడతావనియు తెలిసి, నీ పేరును గుర్తించి, నిన్ను గట్టిగా పట్టుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా దినములను శాంతితోను మరియు నీ దయతోను నింపుము. ప్రభువా, ప్రతి రోజు మాకు అవసరమైన నిరీక్షణ మరియు బలాన్ని ఇస్తూ, జీవితంలోని ప్రతి సమయములోను మమ్మును మోసుకువెళతావని మేము నీ యందు నమ్మిక యుంచుచూ యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.