నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 7:38వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని యేసు బిగ్గరగా చెప్పెను.'' అవును, నేడు మీరు ఆయన యందు విశ్వాసముంచినప్పుడు, మీలో నుండి జీవజలములు పారును.
బైబిల్‌లో దేవుని యొక్క వనరుల ఆశీర్వాదాన్ని యూదులు 'కోతకాలపు పండుగా' ఆ విధంగా వారు ఏడు రోజులు పండుగా జరుపుకుంటారు. 7 రోజుల పాటు దేవాలయము నుండి యాజకుడు ఒక బంగారు పాత్రను తీసుకొని, సిలోయము అను కోనేటికి వచ్చి, దానిని నీటితో నింపుకుంటాడు. అతడు ఆ నీటిని దేవాలయమునకు తీసుకొని వెళ్లి, అక్కడ బలిపీఠము మీద దానిని కుమ్మరిస్తాడు. ప్రజలు కూడా అతని వెంబడి ఆలాగున అనుసరిస్తారు. అందరి దృష్టియు కూడా ఆ నీటిని కుమ్మరించబడుచున్న సమయములలో చివరి పండుగ మహా దినమున యేసు నిలిచి, "నేను జీవజలపు ఊటను'' అని సెలవిచ్చియున్నాడు. అవును, యేసు జీవజలముల ఊటయై ఉన్నాడు. ఇశ్రాయేలీయులు యేసును విడిచి, తమ్ముతాము తృప్తిపొందించుకోవడం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసియున్నారు. ఇక్కడ యేసు, "మీకును మరియు నాకును నా యొద్దకు రండి '' అని ఆహ్వానము తెలియజేయుచున్నాడు. ఇంకను, " నా యందు నమ్మిక యుంచండి. జీవజలపు నదులు మీ హృదయములో నుంచి పొంగిపొర్లి ప్రవహిస్తాయి అని సెలవిచ్చుచున్నాడు. '' నా ప్రియులారా, జీవజలములు మీ హృదయములో నుండి ఒక ప్రవహము వలె రానివ్వండి. ఆలాగుననే, మీరు 'జలముల చెంతకు రండి. '
నా ప్రియులారా, ఇక్కడ యేసు ప్రవక్తయైన యెషయా యొక్క మాటలను అక్షరాల ప్రతిధ్వనింపజేయుచున్నాడు. యెషయా 55:1లో చూచినట్లయితే, "దప్పిగొనినవారలారా, నీళ్ల యొద్దకు రండి'' అని అందరికి ఆహ్వానమిచ్చుచున్నాడు. ఇక్కడ యేసు వాస్తవానికి జీవజలములను బహుమానముగా మనకు అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, వాడబారిన మీ జీవితములో నేడు దేవుడు జీవజలపు నదులను ప్రవహింపజేస్తాడు.
జీవజలము అనగా ఏమిటి? ఇది పరిశుద్ధాత్మయే. మనము యేసు చెంతకు వచ్చియున్నప్పుడు కొలతలేకుండా ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించును. మనము యేసు చెంతకు వచ్చినప్పుడు, ఆయన పరిమితులు మరియు ఆవధులు లేకుండా ఆత్మను అనుగ్రహించును. ఆ ఆత్మను మనము పొందుకోవాలనగా, మనము దేవుని కొరకు దప్పిగొనియుండాలి. అప్పుడు మాత్రమే ఆయన తన జలములతో మనలను నింపుతాడు. అవును, అనేక రకములైన జలములు ఉన్నాయి: 'రక్షణ జలము' ఇంకను అనేకము ఇలాగుననే ఉంటాయి. మత్తయి సువార్త 5:6లో చూచినట్లయితే, " నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు '' అని లేఖనములో వ్రాయబడియున్నది. ప్రభువు మీ యొక్క హృదయమును తన జీవజలములచేత నింపుతాడు. నా ప్రియులారా, ప్రభువు మనలను నింపడము మాత్రమే కాదు, ఆయన తన ఆత్మను మన మీద కొలతలేకుండా కుమ్మరించువాడై యున్నాడు. అందుకే అపొస్తలుల కార్యములు 2:17వ వచనములో ఇదియే మనము చూడగలుగుచున్నాము, "అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను'' అని చెప్పబడిన ప్రకారం ప్రభువు మనకు అనుగ్రహించు జలము నిలిచిపోవునవి కాదు, అవి నదివలె ఎల్లప్పుడు ప్రవహించునటువంటి జలములై ఉన్నవి. ఈ జలములు ఇతరులను ఆశీర్వదించును. కనుకనే, నేడు దీవెనకరమైన నదులతో మిమ్మును దీవించవలెనని దేవుని హృదయమై యున్నది. అవి నదుల వంటి జీవజలములు. కనుకనే, నేడు అటువంటి జీవజలములను పొందుకొనుటకు మీ హృదయములను దేవునికి సమర్పించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ జీవితములో జీవజలనదులను పారజేసి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.
ప్రార్థన:
జీవజలములనిచ్చు మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియ ప్రభువా, నేడు జీవజలపు నదులు మాలో నుండి ప్రవహించునట్లు చేయుము. దేవా, ఈ జీవజలపునదులు మా జీవితములోను మరియు మా హృదయములో నుండి ప్రవాహము వలె ప్రవహించునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క జీవజలములతో మమ్మును నింపి, మా పాత్రలు పొంగిపొర్లునట్లు చేయుము. ప్రభువా, మేము ఆత్మ దాహముతో ఉన్నప్పుడు మా మీద నీ యొక్క జీవజలము ఊటయైన నీ ఆత్మను ప్రవాహము వలె కుమ్మరించుము. దేవా, నీ జీవజలంతో నింపబడాలని కోరుకునే మా ఆత్మలో లోతైన దాహంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. యేసు, నీ యొద్దకు వచ్చి నీ ఆత్మను కొలతలేకుండా అంగీకరించమని మమ్మును ఆహ్వానించినందుకై నీకు వందనాలు. దేవా, నీ పరిశుద్ధాత్మ మా హృదయానికి శాంతిని, బలాన్ని, ఆనందాన్ని తీసుకొనివచ్చునట్లుగాను జీవనదుల వలె మాలో నుండి ప్రవహించునట్లు చేయుము. ప్రభువా, నీ నీతి కొరకు ఆకలి మరియు దాహంతో మమ్మును నింపుము. యేసయ్యా, నీవు మా మీద నీ ఆత్మను కుమ్మరించినప్పుడు, మా చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదించడానికి అది మా నుండి పొంగిపొర్లునట్లు చేయుము. దేవా, ఎన్నటికిని ఎండిపోని నదివలె ప్రవహించే నీ ప్రేమ మరియు మంచితనాన్ని మా జీవితం ప్రతిబింబించునట్లు చేయుము. ప్రభువా, నీ జీవజలము యొక్క అమూల్యమైన బహుమతికి వందనాలు చెల్లించుచు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.