నా ప్రియ స్నేహితులారా, నేడు బైబిల్ నుండి లూకా 11:9వ వచనము ద్వారా అమర్త్యమైన యేసు యొక్క వాగ్దానమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. ఆలాగుననే, ఆ వచనము ఈలాగున చెబుతుంది, ‘‘అటువలె మీరును అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును’’ ప్రకారం యేసు అను నామమున మనము ఏది అడిగినను, ఆయన మనకు తప్పకుండా దానిని జరిగిస్తాడు. ఒక కుటుంబము ఇట్టి ఆశీర్వాదాన్ని స్వీకరించినది. ఆమె పేరు ఉమారాణి మరియు ఆమె యొక్క భర్త పేరు సంతోష్, 2017వ సంవత్సరములో వారికి వివాహము జరిగినది. వివాహమైన తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడము జరిగినది. తద్వారా, వారి సమస్యలు ఇంకను పెరిగిపోయాయి, చివరికి వారిద్దరు కూడ విడిపోయారు. ఆవిధంగా, అతను త్రాగుబోతుగా మారిపోయాడు. తద్వారా ఆమెకు గుండె బ్రద్ధలు చేయబడినది. ఈలాగున రెండు సంవత్సరములు గడిచిపోయాయి. ఆ తర్వాత ఆమె భర్త యొద్దకు తాను తిరిగి వచ్చినది. వారిద్దరు కలిసి జీవించడం ప్రారంభించారు. కానీ, రెండు సంవత్సరముల ఎడబాటు చేత ఆ యొక్క భర్తకు తన భార్య మీద ఎన్నో అనుమానాలు కలిగి ఉండేవాడు. ఆలాగుననే, అతని యొక్క మద్యపానము అలవాటు ఇంకను పెరుగుతూ ఉండినది. తద్వారా, ఆ కుటుంబములో శాంతి సమాధానము లేదు.     


ఇటువంటి సమయములోనే, ఉమారాణి యొక్క ఆంటీ ఆమెను యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు తీసుకొని వెళ్లెను. ప్రార్థనా గోపురములో తన యొక్క ప్రార్థనా విన్నపమును వ్రాసి ఆమె ప్రార్థనా యోధులకు ఇచ్చారు. ప్రార్థనా యోధులు ఎంతో మిక్కుటమైన తీవ్రంగా ప్రార్థన చేశారు. ఆలాగుననే, ప్రతిరోజు ఈ యొక్క ప్రార్థనా విన్నపములు నా యొద్దకు పంపబడతాయి. నేను కూడ ఎక్కడ ఉన్నప్పటికిని ఆ ప్రార్థనా విన్నపముల నిమిత్తము ప్రార్థిస్తాను. ఆ తర్వాత ఆమె భర్త నెమ్మదిగా మద్యపానమును మానివేశాడు. తన భార్యను గురించిన అనుమానములన్నియు తనలో నుండి తొలగిపోవడం జరిగింది. మహాద్భుతముగా తన భర్త ఆమెతో సమాధానముగా మాట్లాడుటకు ప్రారంభించాడు. ఇవి మాత్రమే కాకుండా, తన విద్యార్హతలకు తగినట్లుగా ఆమెకు ఒక హాస్పిటల్‌లో ఉద్యోగము లభించినది. ఈ రోజు కూడ యేసును బట్టి, వారి విచారములన్నియు కొట్టివేయబడి, ఆనందముగా మార్చబడ్డాయి. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. 


అందుకే యేసు ప్రభువు ఈలాగున అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడగండి, ప్రభువు తన నామమున ఆయనను అడగమని సెలవిచ్చుచున్నాడు మరియు మన బాధలు ఆనందంగా మారునట్లుగా ఆయన వాటన్నింటిని తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు ఆలాగుననే మీకును జరిగిస్తాడు. ఎందుకంటే, యేసు మిమ్మును ప్రేమించుచున్నాడు, ఇప్పుడే మీ నిమిత్తము ప్రార్థన చేద్దాము. కనుకనే, నేడు మీ హృదయమును యేసు చెంత కుమ్మరించండి. మీరు ఇప్పుడు అనుభూతి చెందుచున్న ప్రతివిధమైన బాధ మరియు విచారము, శ్రమల ద్వారా యేసు ప్రయాణించి యున్నాడు. ఇంకను, మీ బాధను, శ్రమలను సిలువలో తాను పొందిన శ్రమ ద్వారా యేసు భరించియున్నాడు. ఆయన వాటిని అధికమించి యున్నాడు. మరణము నుండి ఆయన తిరిగి లేచియున్నాడు. ఈ రోజు మీకు విడుదల అనుగ్రహించి, మీ గృహమును నిర్మాణము చేయగల శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. భర్తగా మరియు భార్యగా మిమ్మును ఐక్యపరచి, ఆయనలో ఉన్న ప్రతివిధమైన ఆశీర్వాదాన్ని మీరు అనుభూతి చెంది, ఆనందించులాగున ఆయన ప్రేమను శక్తిని కలిగి యున్నాడు. కాబట్టి, నా ప్రియులారా, నేడు మీ సమస్యలేవైనను సరే, మీరు యేసు నామమున అడగండి, మీరు వాటన్నిటి నుండి విడుదల పొందుకుంటారు. మీ కుటుంబ మరియు వ్యక్తిగత జీవితము ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. 

 ప్రార్థన:

ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువైన యేసయ్యా, మా మధ్యలో ఉన్న అపార్థములను తొలగించి,ఈ రోజునే నీవు మాలోనికి ప్రవేశించి, అద్భుతంగా మమ్మును ఐక్యపరచుము. దేవా, మాలో అనుమానమును తీసుకొని వచ్చుచున్న దురాత్మను మా నుండి దూరపరచుము. భర్త మరియు భార్య మధ్యన ఐక్యత నమ్మకత్వమును కలుగజేయుము. ప్రభువా, విడిపోయిన మా కుటుంబాలను నేడు నీ యొక్క ఉన్నతమైన ప్రేమ ద్వారా ఐక్యపరచుము. ప్రభువా, నీవిచ్చు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని మేము ఆనందించునట్లుగా చేయుము. దేవా, నీ ప్రేమతో మమ్మును మరియు మా హృదయాలను నింపుము మరియు మా ప్రియులైనవారిని  గురించి మేము ఎప్పుడు కూడా అనుమానించకుండా చేయుము. ప్రభువా, ఎల్లప్పుడు నీ యొక్క ఐక్యత మరియు ప్రేమ మాలో నిలిచి ఉండునట్లుగా చేయుము. దేవా, మేము నేటి నుండి ఒక సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించగలుగునట్లుగా మమ్మును ఆశీర్వదించుము. యేసయ్యా, మేము మా కుటుంబంతో కలిసి పని చేయగలుగునట్లుగాను మరియు సంతోషకరమైన కుటుంబ జీవింతముగా ఉండునట్లుగా చేయుము. దేవా, నేడు మా మరియు మా ప్రియులగు వారి కుటుంబాన్ని ఆశీర్వదించుము. తండ్రీ, మాకు సరైన ఉద్యోగం ఇవ్వండి మరియు మేము కూడ నీ ప్రేమలో స్థిరపడి, మా కుటుంబంలో ఆర్థిక ఆశీర్వాదాలు పొందుకొనునట్లుగాను మరియు మా మరియు మా ప్రియులగువారి దుర్‌వ్యసనపు అలవాట్ల నుండి మమ్మును మరియు ప్రియులైన వారిని విడిపించుము. యేసయ్యా, నీ నామమున ఏది అడిగినా దానిని పొందుకొని అనుభవించి, ఆనందించునట్లు చేయుమని యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.