నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 30:19 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "... నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును'' ప్రకారం, దేవుడు మీ కన్నీటి మొఱ్ఱను విని, దేవుడు మీ పట్ల జవాబు ఇవ్వాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీరు భయపడకండి.

నా ప్రియులారా, నేడు మీరు, ' నేను అనుభవించుచున్న బాధను ఎవరికైన తెలుసా? లేక ఎవరైనా చూస్తున్నారా? అని అనుకుంటున్నారేమో? నా హృదయములో ఎంతో వేదన మరియు బాధ ఉన్నది. ప్రతిరోజు నిద్రపోకుండా నేను కన్నీటితో విలపిస్తున్నాను. నేను ఏ విధంగా ముందుకు సాగాలి? నా జీవితములో నేను ఎదుర్కొంటున్న అడ్డంకులను ఎలా అధిగమిస్తాను? అని అనుకుంటున్నారేమో? ప్రియ స్నేహితులారా, నేడు మీ హృదయమును కలవరపడనీయకండి. యేసులో నేడు మీకు ఒక నిరీక్షణ ఉన్నది. కనుకనే, మీరు ఇక కన్నీళ్లు విడువకండి. ధైర్యముగా ఉండండి.

చైనాలో ఉన్న గ్లాడీస్ ఏల్‌వార్ట్ అను ఒక మిషనరీ జీవితములో అదే జరిగినది. ఆమె ఒకసారి కష్టసమయము గుండా వెళ్లెను. అదేమనగా, అక్కడ ఉన్న స్థానిక అధికారులు తన అనాథాశ్రమాన్ని వారికి అప్పగించి, చైనాను విడిచిపెట్టి, వెళ్లిపోవాలని చెప్పారు. తద్వారా, ఆమె ఎంతగానో కృంగిపోయి విలపించుచుండెను. ఇంకను నిరీక్షణ మరియు నమ్మకము, ఎవరి సహాయము లేకుండా హృదయము బ్రద్ధలు చేయబడినస్థితిలో ఉంటూ, ప్రభువునకు మొఱ్ఱపెడుతూ, 'ప్రభువా, నాకు ఏమి చేయాలో తెలియలేదు, దయచేసి, నీవే నాకు సహాయము చేయుము' అని ప్రార్ధించినది. ఒక చిన్న ప్రార్థన చేసి, విలపించి, విలపించి, ఆలసిపోయి, నిద్రలోనికి జారుకున్నది.

మరుసటి రోజు ఉదయమునే, ఒక ఉన్నతమైన అధికారి గ్లాడీస్‌ని అనుకోకుండా కలుసుకోవడము జరిగినది. అధికారులు వారి యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనా ధాశ్రమము ఉండవచ్చును. గ్లాడీస్ పనిని కొనసాగించవచ్చును అని చెప్పాడు. అది విన్న ఆమె ఎంతగానో సంతోషించినది. ఆమె ఎంతగానో సంతోషించెను. మరియు దేవుడు తన కన్నీటితో నిండిన ప్రార్థనలకు, దేవుడు వాగ్దానం చేసినట్లుగానే జవాబిచ్చాడని ఆమె గ్రహించి, దేవుని స్తుతించెను.

అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ యెడల కృపను కలిగియున్నాడు, మీ మొఱ్ఱలను ఆలకించుచున్నాడు. మీ కన్నీటిని చూస్తున్నాడు. మీకు జవాబును ఇవ్వాడానికి మీ పట్ల వేచియున్నాడు. అవును నా ప్రియ స్నేహితులారా, మీ విన్నపాలన్నిటికిని జవాబునిస్తాడు. మీరు మొఱపెట్టడాన్ని మరియు మీ హృదయము భారముతో నిండియుండడాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన త్వరగా మీకు జవాబిస్తాడు. 'నేను విలపిస్తున్నప్పుడు ఎవ్వరు చూడలేదని' ఇక మీరు బాధపడవద్దు. మీ ప్రార్థనలకు దేవుడు ఆలకించి జవాబునిస్తాడని తెలుసుకొనండి. ఇప్పుడే ప్రభువు యొద్ద నుండి ఒక అద్భుతాన్ని విశ్వసిద్దాం మరియు దానిని పొందుకుందాం. నేటి వాగ్దానము ద్వారా దేవుడు దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన పరలోకపు తండ్రీ, ఈరోజు నీ ప్రేమపూర్వకమైన వాగ్దానానికై మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీవు మా ప్రతి కన్నీటిని చూస్తున్నావనియు మరియు మా కన్నీటి మొఱ్ఱను వింటావని మాకు నమ్మకాన్ని కలిగించినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా కన్నీటి ప్రార్థనకు నీవు నిశ్చయముగా జవాబును దయచేస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, ఎల్లప్పుడూ మా పక్షాన నిలబడి, మా ప్రార్థనలను ఆలకించి, మాకు జవాబును దయచేయుము. దేవా, నీవు మమ్మును ఎన్నటికి విడనాడకుండా, గట్టిగా మా చేతులను పట్టుకొని, మమ్మును నడిపించుము. ప్రభువా, మా కష్టాలలో మమ్మును ఓదార్చి, మా కన్నీటిని నీ బుడ్డిలో ఉంచి, మరియు మా ప్రతి కన్నీటి బొట్టుకు జవాబును తీసుకురావడానికి నీవు మా పట్ల వేచి ఉన్నావని మాకు తెలుసు. కనుకనే, కన్నీళ్లతో విత్తేవాళ్లు ఆనందంతో పంట కోస్తారని నీ వాక్యం చెప్పినట్లుగానే, మేము విత్తిన ప్రతి కన్నీటికి బదులుగా మాకు జవాబును దయచేయుము. దేవా, మా విన్నపములకు జవాబును దయచేసి, నేడు మా ప్రియులను మరియు మమ్ములను స్వస్థపరచి బాగుచేయుము. దేవా, నీవు మా కన్నీటి అంగలార్పును నాట్యముగా మార్చుము. ప్రభువా, మమ్మును మరియు మా ప్రియులను నీ ప్రేమగల చేతులకు అప్పగించి, నీ యొద్ద నుండి ఒక అద్భుతాన్ని పొందుకొనునట్లుగా మేము ఎదురు చూస్తున్న మా ఎదురు చూపులకు జవాబును దయచేసి, మా దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.