నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 5:14వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " మీరు లోకమునకు వెలుగై యున్నారు; కొండ మీద నుండు పట్టణము మరుగైయుండనేరదు'' ప్రకారం మీరు లోకమునకు వెలుగై ఉండాలని మన ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిల్‌లో, యోహాను 1:4వ వచనమును చూచినట్లయితే, "ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను'' అని వాక్యము సెలవిచ్చుచున్నది. అవును, మనంతట మనం స్వయంగా ప్రకాశించలేము; మనము వెలిగింపబడవలెననగా, ఆ వెలుగు దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది. అందుకే ఆ తరువాత వచనమైన యోహాను 1:5లో చూచినట్లయితే, " ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను'' అని తెలియజేయుచున్నది. ఈ లోకమంతయు భయంకరమైన అంధకారముతో నింపబడియున్నది. కానీ, మనం దేవుని యొక్క జీవంతో నింపబడి ఉన్నప్పుడు, మనలో ఉన్న ఆయన జీవము, మన చుట్టూ ఉన్న చీకటిని తొలగించబడి, దేవుని వెలుగు ద్వారా మనము ఆయన మహిమ కొరకు ప్రకాశించుటకు ప్రారంభిస్తాము. బైబిల్‌లో పౌలు చూచినట్లయితే, పౌలు, సౌలుగా ఉన్నప్పుడు, సౌలు చీకటిలో నడుస్తున్నప్పుడు ్రకైస్తవులను హింసించాడు. కానీ, యేసు అతనికి ప్రత్యక్షమైనప్పుడు, సూర్యుని కంటే ప్రకాశవంతమైన వెలుగు ఆకాశం నుండి తన చుట్టూ ప్రకాశిస్తూ ఉండటం అతడు చూశాడు. దేవుడు అతనిని తాకాడు మరియు ఆ క్షణం నుండి అతడు ప్రజలకు సేవ చేయుటకు ప్రారంభించాడు. అతడు ఎంత ఎక్కువగా ప్రజలకు పరిచర్య చేశాడో, అంత ఎక్కువగా దేవుని వెలుగు అతని మీద ప్రకాశించినది. అవును, దేవుడు మన కొరకు కూడా అలాగుననే ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి, చింతించకండి.

తమిళంలో ఒక సామెత కలదు, 'బావి నుండి ఎంత ఎక్కువగా నీరు తోడుకుంటే, అంత ఎక్కువగా దాని నుండి మనం బయటపడతాము ' అని చెప్పబడియున్నది. ఆ బావి ఎప్పటికిని ఎండిపోదు కానీ, అందుకు బదులుగా ఎల్లప్పుడును నీవు ఉబుకుచూ ఉంటుంది. అదేవిధంగా, మనం దేవుని సువార్తను ఎంత ఎక్కువగా ఇతరులతో పంచుకుంటామో, అంత ఎక్కువగా ప్రభువు కొరకు మనము లేచి ప్రకాశించగలము. మనం సువార్తను ప్రకటించడానికి మాత్రమే కాకుండా, సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా మనము ప్రభువు కొరకు ఏదైతే చేయగలమో, దానిని చేయాలి. అంతమాత్రమే కాదు, మనము ఆయనకు సేవ చేయుట కొరకు పిలువబడియున్నాము. మనం ఇతరుల పట్ల దయకలిగి ఉండవలెను, ఇంకను మన సాక్ష్యాన్ని పంచుకోవచ్చును మరియు స్వల్పమైన విధానములోనైనను సరే, మనము ఇతరులకు దేవుని వెలుగును ప్రతిబింబింపజేయవచ్చును. బైబిల్‌లో బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఈ విధంగా తెలియజేయుచున్నది, యోహాను 5:35వ వచనములో చూచినట్లయితే, యేసును గురించి స్వయంగా ఈలాగున చెబుతున్నాడు, "అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి.'' అవును, అతడు దేవుని వెలుగుచేత మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉండెను. అవును, ప్రకాశించే వెలుగు మన నుండి రాదు, కానీ అది దేవుని మహిమ యొక్క ప్రతిబింబమై యున్నది.

నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు ఒంటరివారు కారు, మీలో ఉన్న క్రీస్తు మహిమకు నిరీక్షణయై ఉన్నాడు. ఆయన తన వెలుగును ప్రతిబింబించునట్లుగా ఉండునట్లు మీకు సామర్థ్యమును అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్‌లో యెషయా 60:1-3 వ వచనములలో చూచినట్లయితే, " నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు'' ప్రకారం ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడుచుండగా, దేవుని యొక్క వెలుగు మీ మీదికి వచ్చుచున్నది. అంధకారముగా ఉన్న మీ జీవితాలలో దేవుని వెలుగును ప్రకాశింపజేయుచున్నాడు. ఆయన వెలుగు ద్వారా రాజులు మీ యొద్దకు వచ్చెదరు. ఇప్పుడు కూడా దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశించుచున్నది. భారతదేశంలో, దాదాపుగా వందకు మించి పైగా ప్రార్థన గోపురములను కలిగియున్నాము. మేము మా యొక్క ప్రార్థనా గోపురములను ప్రజల కొరకైన, 'లైట్‌హౌస్‌లు' దీపస్తంభనివాసములుగా పిలువబడుచున్నాము. ప్రజలు ప్రార్థనా గోపురముల వైపు ఆకర్షించబడుచున్నారు. అట్టి ప్రార్థనా గోపురములను బట్టి, అనేకమైన దీపములు వెలిగించబడియున్నవి. ఈ వెలిగించు ప్రార్థన గోపురముల ద్వారా ప్రజల జీవితాలు దేవుని వైపు ఆకర్షించబడి, వెలిగించబడుచున్నాయి. ప్రజలు ప్రార్థనలు కోరుతూ ప్రార్థనా గోపురములకు వచ్చి, దేవుని నుండి అద్భుతాలను పొందుకున్నప్పుడు, వారు ఇతరుల కొరకు ప్రార్థించుటకు ప్రారంభిస్తారు. ఎందుకంటే, యేసు జీవం వారిలో ప్రవేశించియున్నది కనుకనే, వారు దేవుని యొద్ద నుండి వెలుగును పొందుకొనెదరు. యేసు యొక్క జీవము వారిలోనికి వస్తుంది. తద్వారా, వారు ధైర్యంగా యేసు కొరకు బయలు వెడలి వెళ్లెదరు. క్రీస్తు యొక్క వెలుగు, క్రీస్తు యొక్క జీవము వారిలోనికి ప్రవేశించును. అందుచేతనే, ప్రభువు కొరకు సంపూర్ణమైన బలముతో ప్రకాశించునట్లుగా వారు బయలు వెడలి వెళ్లెదరు. ప్రభువు కొరకు పరిపూర్ణమైన శక్తితో ప్రకాశిస్తారు. మీరు అట్టి వారిలో ఒకరుగా ఉందురు గాక.

నా ప్రియులారా, ఈరోజు కూడా, దేవుని వెలుగును పొంకదుకొనడానికి మీ హృదయాలను సంసిద్ధం చేసుకున్నప్పుడు, దేవుని వెలుగుతో మీరు ప్రకాశింపబడుదురు. బైబిల్‌లో ఇలాగున చెప్పబడియున్నది, "శృంగ ధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు కొనుచున్నారు'' (కీర్తనలు 89:15) అన్న వచనము ప్రకారము మీరు దేవుని ముఖకాంతిని చూచెదరు మరియు మీరు నిజంగా ఈ లోకానికి వెలుగుగా మార్చబడుదురు గాక! కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీలో ఉన్న వెలుగును తొలగించి, మిమ్మును వెలుగులోనికి నడిపించి దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీవు వెలుగుగా ఉండి, మమ్మును ఈ లోకానికి వెలుగుగా పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీ మహిమ కొరకు మేము ప్రకాశించునట్లుగా మమ్మును నీ జీవముతో నింపుము. యేసయ్యా, నీ వెలుగు ద్వారా మా చుట్టూ ఉన్న ప్రతి చీకటిని తొలగించి, మమ్మును నీ ప్రేమకు పాత్రలనుగా మార్చుము. ప్రభువా, సౌలు వలె, మేము నీ నామాన్ని ధైర్యంగా ప్రకటించగలుగునట్లుగా మాకు ధైర్యమును కలిగించి, మా జీవితాన్ని మార్చుము. యేసయ్యా, నీ సువార్తను పంచుకోవడానికి మరియు ఆనందకరమైన హృదయంతో నీకు సేవ చేయుటకు మాకు అటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహించుము. బాప్తిస్మమిచ్చు యోహాను మీ కొరకు మండునట్లుగా, మా జీవితం నీ దైవీకమైన వెలుగు యొక్క ప్రతిబింబంగా ఉండునట్లుగా మార్చుము. దేవా, మేము అనుదినము నీ సన్నిధి వెలుగులో నడుస్తూ ఇతరులను నీ వైపునకు ఆకర్షించునట్లుగా చేయుము. ప్రభువా, నీలో మహిమకు నిరీక్షణగా ఉండునట్లుగా చేసి, అనేకులను నీ మందలోనికి నడిపించే కృపను మాకు దయచేయుము. ప్రభువా, మేము ఈ లోకములో వెలిగించబడుటకు మమ్మును నీ దివ్య హస్తాలకు సమర్పించుకొనుచున్నాము, మా ద్వారా అనేకమంది జీవితాలను వెలిగించుటకు నీ వెలుగుతో మమ్మును నింపుమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.