నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 17:28వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "మనమాయన యందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము...'' ప్రకారము మనము యేసునందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగియున్నాము. ఈ రోజు మీరు ఆశ్చర్యపడుచున్నారేమో? నేను ఎలాగున బ్రతకగలను? బహుశా! నా జీవితములో ఏదియు నిశ్చయత లేదని మీకు అనిపించవచ్చును. నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియలేదు? అన్నియు కూడా విఫలమవుతున్నాయి. నేను ఒత్తిడికి లోనవుతున్నాను, పూర్తిగా భయముతో నిండిపోయాను, నాకు ఎన్నో అక్కరలు ఉన్నాయి, నాకు ఎంతో బాధ ఉన్నది, నేను ఎలాగున జీవించగలను అని అంటున్నారా? ఒత్తిడి, భయం, నొప్పి లేదా అసంపూర్తిగా ఉన్న అవసరాల భారం కారణంగా మీరు ఈ రోజును ఎలా ఎదుర్కోవాలో మీకు తెలియలేకపోవచ్చును. కానీ, నా స్నేహితులారా, ఈ వచనం మనకు ఈలాగున చెబుతుంది, "యేసు నందు మీరు బ్రతుకుదురు.'' కనుకనే, ధైర్యంగా ఉండండి.

నా ప్రియులారా, నేడు మీరు మీ జీవితమును యేసు చేతులకు సమర్పించుకొన్నప్పుడు, యేసునందు జీవించుచుండగా, ఆయన యందు ఉన్న జీవము మిమ్మును బ్రతుకునట్లు చేస్తుంది. తద్వారా, మీరు చలించెదరు, ఉనికిని కలిగి ఉందురు. అంతమాత్రమే కాదు, దేవుడు మిమ్మును ముందు కొనసాగునట్లుగా ఆయన మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు మరియు దేవుడు మిమ్మును ఔన్నత్యమునకు వెళ్లునట్లుగా చేస్తాడు. మీ పరిస్థితులను అధిగమించడంలో మీకు సహాయం చేస్తాడు మరియు మిమ్మల్ని విశాలమైన ప్రదేశానికి తీసుకువస్తాడు. కనుకనే, భయపడకండి.

నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీరు కట్టబడి, బంధింపబడి ఉండవచ్చును. ముందుకు సాగి వెళ్లలేనట్లుగా మీకు అనిపించవచ్చును. యేసుక్రీస్తు సిలువలో బంధింపబడ్డాడు. ప్రతి ఒక్కరు ఆయనను చూచి, నిందారోపణ చేయుచు, ఎగతాళి చేశారు. మీ ఆవేదనను అర్థము చేసుకొనుటకు ఆయన అట్టి ఆవేదన గుండా వెళ్లియున్నాడు. బహుశా, ' నేను తాళము వేయబడినట్టుగా ముందుకు వెళ్లలేక బంధింపబడియున్నాను' అని అంటున్నారేమో? కానీ, ఈ వచనము చెబుతుందిలా, 'యేసులో మీరు కదలలేక పడియున్నట్టుగా కాకుండా, ముందుకు కొనసాగి వెళ్లెదరు. మీరు యేసులో జీవించెదరు, మీరు చలించెదరు. మీరు ఆయనలో మీ ఉనికిని కలిగి ఉండెదరు.' మీ ఉనికిలో యేసు ఉంటాడు. మీ యొక్క ఆత్మలో, మనస్సులో, దేహములో సమస్తమును జీవమును కలిగి బ్రతుకుతారు. 'యేసు యొక్క జీవము.' కనుకనే, నేడు మీ హృదయమును కలవరపడనీయ్యకండి.

అదేవిధంగా యేసు ఔరంగబాద్‌లో ఉన్న సోనమ్ అను అమ్మాయికి సహాయము చేశాడు. తన బాల్యము నుండి ఎల్లప్పుడు గొడవపడుతూ, పోట్లాడేవారు. తద్వారా, కుటుంబములో శాంతి సమాధానములేదు. దురాత్మలు కుటుంబములోనికి వచ్చాయి. అవును, భర్త భార్య పోట్లాడుకుంటే, దురాత్మలు కుటుంబములోనికి వస్తాయి. అవును, ఆలాగుననే, దురాత్మ శక్తులు సోనమ్ ఇంటిలోనికి ప్రవేశించాయి. అందుచేత తల్లి ఆత్మహత్య చేసుకొనెను. ఆలాగుననే, తండ్రి కూడా ఆత్మహత్య చేసుకొనెను. అన్ని వైపుల ద్వారములు మూయబడినట్లుగా, ఈ యౌవనస్థురాలి యొక్క బ్రతుకు ఎంతో కష్టంగా భారభరితమైపోయినది. కానీ, ఆమె యొక్క అంకుల్‌గారు ఆమెను తీసుకొని వెళ్లాడు. తన గురించి జాగ్రత్త వహించాడు. దురాత్మలు సోనమ్ కూడ వెంటాడుచున్నాయి. అటువంటి సమయములో ఎవరో ఆమెకు ఇలాగున చెప్పారు, "యేసు నిన్ను ప్రేమించుచున్నాడు మరియు ఆయన నీకు సహాయము చేస్తాడు.'' ఈ నిరీక్షణను గట్టిగా పట్టుకొని, 'యేసూ, నీవు నాకు సహాయము చేయుమని' సోనమ్ ప్రార్థించినది.

మహా అద్భుతకరంగా, ఆమెకు తలుపులు తెరువబడుటకు ప్రారంభించబడ్డాయి. మొదటిగా, నర్సింగ్ కళాశాలలో ఆమెకు ప్రవేశము దొరికింది. కాలేజిలో ఆమెను చేర్పించారు. అక్కడ ఆమె యొక్క సహవిద్యార్థి (క్లాస్ మేట్) అయిన దీపాలి ఆమెకు యేసు పిలుచుచున్నాడు పరిచర్యను గురించి పరిచయం చేసింది. దీపాలి యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో Äౌవన భాగస్థురాలుగా ఉండెను. దీపాలి, సోనమ్‌ను ఔరంగాబాద్‌లో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు తీసుకొని వచ్చెను. ప్రార్థనా యోధులు ఆమె కొరకు ఎంతో భారముతో ప్రార్థించారు. దురాత్మలు ఆమె విడిచిపెట్టి వెళ్లిపోయినవి. దేవుని శాంతిని సోనమ్ హృదయాన్ని నింపుటకు ప్రారంభించినది. ఇంకను సోనమ్ సంతోషముతో నింపబడినది. ఆమె దుఃఖమంతయు ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోవుటకు ఆరంభించినది. ప్రార్థనా గోపురమునకు వచ్చి, నిరాంతరాయంగా ప్రార్థించుచుండగా, ప్రభువు ఆమెను పరిశుద్ధాత్మతో నింపాడు.

తద్వారా, సోనమ్ జీవితము పూర్తిగా మార్చబడినది. అటువంటి సమయములోనే, విద్య కోసం ఆమె నాకు ఒక ఈమెయిల్ పంపించినది. నేను ఆమె కొరకు ఎంతో భారముతో ప్రార్థించి, ఆమెకు జవాబును పంపించాను. ప్రార్థనకు జవాబుగా, ఆమె పరీక్షలలో ఉత్తీర్ణురాలైనది. సోనమ్‌కు హాస్పిటల్‌లో ఉద్యోగము లభించినది. ఇప్పుడు స్టాఫ్ నర్స్‌గా ఉద్యోగము చేయుచున్నది. అవును, తన జీవితములో ముందుకు సాగివెళ్లడానికి కృపను ఆమె కలిగియుండెను. మరియు జీవించడానికి, పరిశుద్ధాత్మ ద్వారా యేసులో తన యొక్క ఉనికిని కలిగియుండడానికి కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వదించి మార్చగలిగినట్లయితే, ఆయన మీ కొరకు కూడా ఆలాగుననే చేయగలడు.

ఆలాగుననే, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు కూడా ఇదే రీతిగా ఆశీర్వదింపబడతారు. ఈ రోజు దేవుడు మిమ్మును ఆశీర్వదించును. మీరు ఆయనయందు బ్రతుకుతారు, మీరు ముందుకు సాగి వెళ్లడానికి చలిస్తారు, మీరు ఆయన యొక్క ఉనికిని యేసులో కలిగి ఉంటారు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రియమైన మా పరలోకమందున్న తండ్రీ, ప్రియ ప్రభువా, యేసును మాకు రక్షకునిగా ఈ లోకమునకు పంపించినందుకు మరియు ఆయనలో మేము జీవించునట్లుగాను, ఎదుగుదల మరియు నిజమైన ఉద్దేశ్యాన్ని కనుగొంటామని వాగ్దానం చేసినందుకు వందనాలు. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, అసంపూర్ణమైనది మరియు పరిపూర్ణము కానిది మాలో నుండి పారిపోవునట్లు చేయుము. దేవా, నీవు పరిపూర్ణుడు గనుకనే, నీవు మాలో జీవించినప్పుడు, నీ యొక్క పరిపూర్ణత ద్వారా స్తబ్దత, నిరాశ, ఎండిన లేదా ఒత్తిడిలన్నియు ప్రతిదీ పారిపోవునట్లు చేయుము. ప్రభువా, ఈరోజు, నీవు మమ్మును నీ సన్నిధితో నింపి సంపూర్ణులనుగా చేయుమని వేడుకొనుచున్నాము. దేవా, నీకు మమ్మును మేము సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాము, మేము నీలో జీవించునట్లుగాను, నీ వెలుగులో సంపూర్ణంగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రభువా, బలహీనమైన మా జీవితాలలో నీ యొక్క బలముతో ముందుకు సాగడానికి, నీ సన్నిధిని సంపూర్ణంగా అనుభవించడానికి మరియు యేసులోని నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఉనికిని కలిగి ఉండటానికి దయచేసి మాకు నీకృపను అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.