నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 58:9 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును...'' ప్రకారం మీరు ఒత్తిడి అనే కాడిని, మిమ్మును ఎత్తి చూపు వ్రేలును మరియు హానికరమైన మాటలను తొలగించుటకు మన సహాయం కొరకు మనము ఆయనను పిలిచినప్పుడు, ఆయన మనలో ఉండి, 'ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను' అని అంటున్నాడు. దేవుడు మనకు జవాబివ్వడం ఎంత ఆనందంగా ఉంటుందో కదా! నా ప్రియులారా, మనము ప్రభువును కనుగొనడం గొప్ప కార్యమై యున్నది కదా? అయితే, ఈ వచనము ఈలాగున చెబుతుంది, "నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నీకు జవాబిచ్చును'' అని తెలియజేయుచున్నది. కాబట్టి, మీరు ఆయనకు మొఱ్ఱపెట్టండి, ఆయన తప్పకుండా మీకు జవాబిస్తాడు.

ఈ అధ్యాయమంతయు మీరు చదివినట్లయితే, ఇది దేవుని యొక్క ప్రజలను గురించి మాట్లాడుచున్నది మరియు వారి పట్ల ప్రభువు ఎలా విసుగు చెందాడో మనకు తెలియజేయుచున్నది. ప్రభువు వారితో ఎంతగానో విసికియున్నాడు. వారి పాపాలను ప్రకటించమని మరియు వారి చర్యల కొరకు వారిని ఎదుర్కోవాలని ఆయన తన ప్రజల నాయకులకు ఆజ్ఞాపించాడు. ఆయన తన ప్రజల నాయకులతో చెబుతున్నాడు, 'వారు నా యెదుట ఏవిధంగా ఉన్నారో అందునుబట్టి, నీవు వారిని గద్దించు, వారు చేసిన పాపములన్నియు కూడ వారికి తెలియజేయుమని' సెలవిచ్చియున్నాడు. ప్రభువు వారు చేసిన దానిని వారికి వివరంగా తెలియజేయుచున్నాడు. వారు ఉపవాసం ఉండి ఆయన యెదుట నమస్కరించినప్పటికిని, వారి ప్రార్థనలకు జవాబు లేదని ప్రజలు ఫిర్యాదు చేయుచున్నారు. వారికి ఏమి కావాలో ఒక్క ఫర్యాయము ఆయనను అడుగుచున్నారు, దానికంటే ముందుగా వారు ఎన్నో అతిక్రమములు చేసియున్నారు, వారు ఉపవాసము ఉండి కూడ ప్రార్థన చేయుటలేదు. వారు కేవలము సాంప్రదాయమునే పాటించుచున్నారు. ఎందుకంటే వారు న్యాయాన్ని, నీతిని విస్మరిస్తూ కపటంగా ఆయనను సమీపించుచున్నారు. ఉపవాసంలో కూడా, వారు తమ పనివారితో గొడవలు పడుతున్నారు మరియు వారి యొక్క పనిలో అన్యాయము చేయుచూ, వారు ఆయన యొద్దకు వచ్చుచున్నారు. తప్పుగా వారిని భావించుచున్నారు, ఇవన్నియు చేయుచు, వారి ప్రార్థనలు ఎందుకు వినలేదని ప్రశ్నించుచున్నారు అని దేవుని ప్రజలకు నాయకునికి ఆజ్ఞాపించాడు.

నా ప్రియ స్నేహితులారా, అలాంటి పరిస్థితుల్లో అనేకసార్లు మనము ఆయన యొద్దకు వస్తుంటాము. కానీ ప్రభువు మనకు జవాబు ఇవ్వాలని మన ఎదురు చూస్తున్నాడు,"నేను ఇక్కడ మీ కోసం ఉన్నాను అని మనలను చూచి చెబుతున్నాడు, మన మన కోరికల కంటే ముందుగా మనము ఆయన నీతిని వెదకాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, ఆయనను మనము పిలిచినప్పుడు, ఆయన " ఇదిగో నేను ఉన్నాను' అని తెలియజేయుచున్నాడు. తద్వారా, ఆయన నీతిని వెదకుట అనునది అది మనలను నింపుతుంది. మన పట్ల అది నెరవేరుతుంది. ప్రజలకు మేలు చేయడం, దేవుని యందు భయభక్తులు కలిగియుంటూ, ఆయన యెదుట మనము సరైన కార్యములు చేయు చున్నప్పడు, సరిగ్గా ప్రవర్తించడం అది ఆయనను సంతోషపరుస్తుంది. కనుకనే, నేడు ప్రభువు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఎంతగానో ఆనందించుచున్నాడు. తద్వారా, మన ప్రార్థనలకు జవాబివ్వబడుతుందని నిర్ధారిస్తుంది. నేడు, ఆయన మనలోని ఈ నీతిని కోరుకుంటున్నాడు మరియు దానిని ఇతరులకు ప్రకాశింపజేస్తాడు. దేవుడు మన ప్రార్థనలకు ఎందుకు జవాబు ఇవ్వడము లేదు అను మీ ప్రశ్నకు ఇది జవాబుగా ఉంటుంది. ఆయన మీకు జవాబు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు, మనము ఆయనకు మొఱ్ఱపెడదాము, మనము దేవుని జవాబు కొరకు ఎదురు చూద్దాం. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రార్థనలను ఆలకించు మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, ఈరోజు మేము నీ యొద్దకు వస్తున్నప్పుడు, మేము పిలిచినప్పుడు, నీవు మాకు జవాబు ఇస్తావనియు మరియు మేము నీకు మొఱ్ఱపెట్టినప్పుడు, ఇదిగో నేను ఉన్నాను అని నీవు ఇచ్చిన వాగ్దానం మాకు గుర్తు చేసినందుకై నీకు వందనాలు. ప్రభువా, కొన్నిసార్లు మేము మా స్వంత వైఫల్యాలు మరియు లోపాలతో భారమైన హృదయంతో నీ యొద్దకు వచ్చుచున్నాము, దేవా, భారముతో ఉన్న మా హృదయాన్ని నీవు అంగీకరించి, మేము వేల్లు చూపిన, దుర్మార్గంగా మాట్లాడిన మరియు న్యాయాన్ని నిర్లక్ష్యం చేసిన సమయాలన్నిటిని జ్ఞాపకము చేసుకొని ఇప్పుడు మేము నీ యెదుట పశ్చాత్తాపపడుచున్నాము. ప్రభువా, తద్వారా, మా హృదయం నీకు దూరంగా ఉండగా, శూన్యమైన ఆచారాలు మరియు సంప్రదాయాలతో నిన్ను సమీపించినందుకు మమ్మును క్షమించుము. దేవా, నీ నీతిని న్యాయమును, యథార్థతను శ్రద్ధగా వెదకడానికి, ఇతరులకు మేలు చేయడానికి మరియు భక్తితో నీకు భయపడడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నేడు మా చర్యలు నీ ప్రేమ మరియు న్యాయాన్ని ప్రతిబింబించునట్లుగాను మరియు అవి నీ దృష్టిలో సంతోషకరంగా ఉండునట్లుగా చేయుము. తండ్రీ, 'నేను ఇక్కడ ఉన్నాను ' అని నీ స్వరం వినాలని మేము కోరుకుంటున్నాము. దేవా, మా కోరికలను నీ చిత్తానికి అనుగుణంగా మార్చడానికి మాకు నేర్పించుము. తద్వారా మా ప్రార్థనలు నీ పరిపూర్ణ ప్రణాళిక ప్రకారం జవాబు పొందుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, ఈ రోజు మరియు నిరంతరము నీ నీతి మాలో ప్రకాశించుచునట్లు చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.