నా ప్రియమైన స్నేహితులారా, నేడు సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ రోజు క్రీస్తు యొక్క ఆనందమును మన హృదయాలలో స్వీకరించే సమయము. ఈ క్రిస్మస్ సంతోషాన్ని మన హృదయాలలో మనము సంపూర్ణంగా ఆనందించుదాము. కనుకనే, నేటి దినమున దేవుని యందలి ఆనందముతో, లూకా 2:11వ వచనములోని చక్కటి సందేశాన్ని మనం నేడు ఆలకించుదామా? "దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.'' అవును, రక్షకుడు నేడు మన కొరకు పుట్టియున్నాడు. కనుకనే, నేడు మనమందరము క్రిస్మస్‌ను జరుపుకొనుచున్నాము. మనము ఈ క్రిస్మస్ ఆనందమును ఇతరులతో పంచుకోవాలని మీ పట్ల కోరుచున్నాను.

నా ప్రియులారా, ఈ రోజు క్రీస్తు మన నిమిత్తమై జన్మించిన రోజు. ఈ రోజు మనము దానిని వేడుక జరుపుకుంటున్నాము. నేడు ఆయన నిజముగా మన హృదయాలలో కూడా జన్మించాలని దేవుడు మన పట్ల కోరుచున్నాడు. ఈ క్రిస్మస్ దినమున ఈలాగున జరిగియున్నదనగా, అది క్రీస్తు పుట్టుక మాత్రమే. దేవుడు ఈ లోకములోనికి మానవ రూపములో ఎందుకు రావాలి? మరియు అందుకు అవసరమేమిటి? అని మనము అనుకోవచ్చును? ఎందుకనగా, తన ప్రజలను ఎవరు రక్షిస్తారు? ఈ లోకములో పాపము,శాపము మరియు అపరాధముల నుండి ఎవరు విడిపిస్తారు? ఈ లోకములో జీవించే మనకు తాను రక్షకునిగా ఉండు నిమిత్తము ఆయన ఈ లోకమునకు మానవ రూపమును ధరించి వచ్చాడు.

అందుకే యేసుక్రీస్తు మానవాళి బాధలను చూచాడు, మనము అంధకారములో బాధపడుట ఆయన చూచియున్నాడు. కనుకనే, ఆయన, " నేను రక్షకునిగా ఉండాలి అని అనుకున్నాడు, నేను మీ అంధకారములో నుండి బయటకు వచ్చునట్లు చేయనివ్వండి '' అని చెప్పి ఆయన మానవునిగా ఈ లోకములో జన్మించాడు. మానవునిగా ఆయన తన ప్రాణమును సమర్పించి, సిలువలో మన నిమిత్తము మరణించాడు. ఇంకను ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తమును చిందించాడు. మనలను రక్షించుట కొరకే ఆయన దేహములో నుండి రక్తము స్రవించెను. ఈ రక్తము ద్వారా మనము రక్షించబడియున్నాము. ఆయన రక్తము ద్వారా మన పాపములు క్షమించబడివున్నాయి. ఎందుకనగా, పాతనిబంధన కాలములో వారి యొక్క పాపముల నిమిత్తము జంతువుల యొక్క రక్తమును చిందించే అలవాటు వారికి ఉండేది. ఆ జంతువుల యొక్క రక్తము ద్వారా మనము రక్షింపబడగలము అని వారికి ఒక నమ్మకము. వారు జంతువులను బలి అర్పించు ప్రతి సందర్భములో కూడ వారికి రక్షణ కలుగుచుండేది. ఆ జంతువుల రక్తము ద్వారా దేవుడు వారిని క్షమించేవాడు. కానీ, దేవుడే మానవునిగా చేసిన అత్యున్నతమైన ఈ త్యాగము ద్వారా మనము పాపపు బానిసత్వము నుండి నేడు విడుదల మనము పొందుకొని యున్నాము. ఇక ఏ మాత్రము ఏ జంతువుల రక్తము చిందించబడవలసిన అవసరము లేదు. కనుకనే, ఆయన త్యాగము పరిపూర్ణమైనది మరియు ఆ రక్తము మనకు నిత్యజీవమును అనుగ్రహించుచున్నది. కనుకనే, ఈ క్రిస్మస్ దినమున మనందరి పాపముల నిమిత్తము మనకు విడుదల కలదు. అంతమాత్రమే కాదు, నిత్యము ఆయనతో జీవించే నిత్య జీవము కలిగియున్నాము.

నా ప్రియులారా, ఇప్పుడు మన పాపములను బట్టి శిక్షావిధి మన మీదికి వచ్చిన ప్రతి పర్యాయము యేసు రక్తము, 'ఈ బిడ్డలు నాకు చెందినవారు, నా బిడ్డలు విడుదల పొందుకోవాలి. ఎందుకనగా, నేను ఇదివరకే వారి అపరాధములను మరియు వారి పాపములను నా మీద వేసుకున్నాను' అని చెప్పి, ఆయన చేసిన త్యాగము ద్వారా మన నిమిత్తము తండ్రి యొద్ద విజ్ఞాపనము చేయుచున్నది. ఈ దేవుని యొక్క రక్తము, 'ఈ బిడ్డ నాకు చెందినది, నా బిడ్డ పాపము నుండి విడుదల పొందాలి. ఎందుకంటే, నేను ఆ శిక్షావిధిని స్వీకరించాను. నా బిడ్డ శిక్షకు గురికాకూడదు' అని చెబుతుంది. మరొక ప్రక్క ఆ రక్తము మన పాపముల నుండి మనలను పరిశుద్ధులనుగా కడిగివేయుచున్నది. ఈ రక్తము మాత్రమే మన పాపముల నుండి మనలను కడిగి వేయ శక్తి కలిగినది. అంతమాత్రమే కాదు, ఈ రక్తము ద్వారా మనలను నూతన వ్యక్తులనుగా చేయుచున్నది. కనుకనే, ఇటువంటి అద్భుతమైన రక్షకుని రక్తమును అంగీకరించుటకు మనము ఇక్కడ చేరి యున్నాము.ఈ క్రిస్మస్ దినమున మీరు నూతనమైనవారుగా కావడానికి, ఇప్పుడే మీరు నాతో కలిసి దేవుని సన్నిధిలో అడుగుతారా? ఎందుకనగా, క్రీస్తు మనలో జన్మించియున్నాడు. కాబట్టి, ఈ రోజు మనం ఈ అద్భుతమైన రక్షకుని పుట్టిన దినమును జరుపుకుంటున్నప్పుడు, మన హృదయాలను తెరిచి, మనలను నూతనమైనవారినిగా మార్చమని ఆయనను కోరుకుందాం. స్నేహితులారా, నేడు ఆయన మీలో పుట్టమని ఆయనను మీ జీవితాలలోనికి ఆహ్వానిస్తారా? ఆయనే మీ రక్షకునిగా ఉండనిస్తారా? ఆలాగైతే, యేసు ప్రభువు రక్తము ద్వారా ఆయన మిమ్మును కడిగి నేడు మీ జీవితాలలో మరియు మీ కుటుంబాలలోను, గృహములలోను మీకు ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువైన యేసయ్యా, నీవు ఈ క్రిస్మస్ దినమున మమ్మును క్షమించుము. యేసయ్యా, మేము అంధకారములో జీవించకుండా, మమ్మును నీ రక్తము ద్వారా కడిగి, మా అంధకారము నుండి మమ్మును విడిపించి, నూతనమైన వారినిగా మమ్మును మార్చుము. యేసయ్యా, నీవు మా కొరకు సిలువలో చిందించిన రక్తము ద్వారా మమ్మును కడగండి. నేడే నీవు మాలో జన్మించుము. యేసయ్య, నీవు మాలో జన్మించిన ఆనందమును నిత్యము నీలో మేము ఆనందించునట్లుగా చేయుము. యేసు ప్రభువా, నీ రక్తము మా చుట్టు మరియు మా యింటిని కప్పునట్లు చేయుము. ప్రియ ప్రభువైన యేసూ, మా రక్షకునిగా ఉండటానికి ఈ లోకములోనికి వచ్చినందుకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. యేసయ్యా, సిలువపై నీ ప్రాణాన్ని ఇచ్చినందుకు మరియు మా కొరకు నీ విలువైన రక్తాన్ని చిందించినందుకు వందనాలు. దేవా, ఈ రోజు, మా హృదయంలో పుట్టి మమ్మును నూతన సృష్టిగా మార్చమని మేము నిన్ను ఆహ్వానించుచున్నాము. యేసయ్యా, నీ రక్తంతో మా పాపాలన్నిటి నుండి మమ్మును శుభ్రపరచు, ప్రభువా, మా అపరాధం మరియు చీకటి నుండి మమ్మును విడిపించుము. దేవా, నీ వెలుగును మా ప్రకాశింపజే సి మరియు నీ మార్గములో మమ్మును నడిపించి, మా జీవితాన్ని నీ సమాధానము మరియు ఆనందంతో నింపుము. ప్రభువా, నీ ప్రేమను ప్రతిబింబించే మరియు నీ నామానికి మహిమ కలిగించే జీవితాన్ని గడపడానికి మాకు సహాయము చేయుము. యేసయ్యా, మా కొరకు తండ్రి యొద్దక విజ్ఞాపనము చేయుచున్నందుకై మరియు మమ్మును నీ బిడ్డగా పిలిచినందుకై నీకు వందనాలు. దేవా, ఈ క్రిస్మస్ దినమున మా జీవితంలో నీ సన్నిధిని నిజమైన వేడుకగా ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా హృదయాన్ని సంపూర్ణముగా నీకు అప్పగించుకొనుచున్నాము, నీ కృప చేత మమ్మును ఆవరించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.