నాకు అమూల్యమైన స్నేహితులారా, ఈ రోజు మనము యేసు యొద్ద నుండి ఉత్సాహభరితమైన దానిని స్వీకరిద్దాము. దేవుడు మీకిచ్చు మంచి విషయాన్ని చేపట్టుకొనండి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 5:7లో ఏమి చెబుతుందో చూడండి, " వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము'' అన్న వచనం ప్రకారము మనము దేవుని యందు విశ్వాసము కలిగి జీవించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు చింతించకండి.

నా ప్రియులారా, దేవుడు ఈ రోజు నుండి మనము విశ్వాసముచేతనే నడుచునట్లు చేస్తాడు. ఆవిధంగానే, మా నానమ్మ శ్రీమతి. స్టెల్లా దినకరన్‌గారు, తన జీవితాంతము దేవుని యందు విశ్వాసముచేత నడుచుకొనియున్నారు. ఈ రోజున వారు రక్షణ పొందిన దినము. నేడు ఎంతమందికి ఆమె జీవితము దీవెనకరముగా ఉన్నదో? అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఆమె విశ్వాసము ద్వారా నేడు అనేకమందికి పునరుత్థానము కలిగించారు. కనుకనే దేవుడు మనకు అటువంటి గొప్ప విశ్వాసమును నేడు మీకు అనుగ్రహించుచున్నాడు. వెలిచూపుతో నడవడానికి మనము ఇక్కడ లేము.

ఒక చిత్రములోని పోరాట యోధుడు (ఫైటర్) ఉండేవాడు. అతడు తన కళ్లను ఒక గుడ్డతో కప్పివేసుకొని, ఇతర ఇంద్రియ సహాయముతోనే పోరాడాలని అనుకున్నాడు. అతడు చూచి స్పందించుట కంటే, తన చుట్టు ఉన్న వాతావరణము, అడుగుల చప్పుడు వినడం ద్వారా చూడకుండా వేగముగా స్పందించాలని అనుకున్నాడు. ఆలాగున ఇతర ఇంద్రియాలతో అతను శిక్షణ పొందియున్నాడు. మనము కూడ మన కళ్లు మూసుకొని ఆలాగుననే చేయనై యున్నాము. ఎందుకంటే, మన కళ్లు ఏమి చూస్తాయంటే, మనము కూడ మన కళ్లను మూసుకొనబోవుచున్నాము. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, 1 యోహాను 2:16 వ వచనము ఏమి చెబుతుందంటే, ఇది లోక శరీరేచ్ఛలను చూపిస్తుంది. అవును, "లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే'' అన్న వచనం ప్రకారం మనము ఆవిధంగా లీనమై యేసునకు దూరముగా తప్పిపోతాము. రెండవదిగా మనముందు ఉన్న మార్గములో గల భయాన్ని చూస్తుంది. ప్రజలు పడిపోయినదానిని చూచినప్పుడు మనము కూడ పడిపోతామని భయపడతాము. ప్రజలు అసాధారణమైన కార్యాలను సాధించడానిని మనం గమనిస్తాము మరియు మనం కూడా అదే చేయగలమా? అని చింతిస్తాము మరియు భయపడతాము. ఆలాగుననే, మన మార్గమును బట్టి మనము భయపడుతుంటాము. కానీ, స్నేహితులారా, మనము విశ్వాసములో జీవించనై యున్నాము. కనుకనే, మనము దేవునికిని భయపడనవసరము లేదు.

నా ప్రియులారా, విశ్వాసం మనలను ఈ లోకపు ఎటువంటి నేత్రాశల మీద దృష్టిని పెట్టకుండా, ప్రభువు యొక్క సౌందర్యాన్ని చూచునట్లుగా చేస్తుంది. ఇక మనము ఆయన యొక్క సౌందర్యములో లీనమై ఆనందిస్తాము. యేసుతో కూడ మన జీవితాన్ని ఆనందిస్తాము. విశ్వాసము మనకు ముందుగా ఉండే ఆశీర్వాదమును చూచునట్లుగా చేస్తుంది. అప్పుడు మనము పడిపోతామని చింతించము. విశ్వాసము ఎల్లప్పుడు ప్రభువు మీతో కూడ ఉన్నాడని మిమ్మును బలపరుస్తుంది. విశ్వాసము దేవుడు మన కొరకు నిర్దేశించిన మార్గము వైపు నడిపిస్తుంది. దేవుడు మన కొరకై కలిగియున్న వాగ్దానమును చూపిస్తుంది. అందుచేత రానై యున్న సంగతులు ఎరుగకపోయినప్పటికిని, ఓడ నిర్మాణము చేయుటకు నోవహు ఏ మాత్రము కూడ భయపడలేదు. రాబోవు వాటిని చూచునట్లుగా విశ్వాసము అతనిని ఓడ నిర్మించునట్లుగా చేసి యున్నది. ఎంతో బలిష్ఠులుగా ఉన్న కనానీయులతో పోరాడుటకు కాలేబు భయపడలేదు. ఎందుకనగా, వారికి వాగ్దాన భూభాగమును ఇస్తానని వాగ్దానము చేశాడు. విశ్వాసము మిమ్మును బలంగా అంటిపెట్టుకునేలా చేస్తుంది. ఇట్టి విశ్వాస హృదయాన్ని మరియు నడతను మనము దేవుని యొద్ద నుండి పొందుకొనుటకు కోరుకుందామా? ఆయనతో కూడ మీరు నడిచే గొప్ప నడతను మీకు దయచేయును. విశ్వాసం మిమ్మల్ని బలపరుస్తుంది, దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొన్నప్పుడు ప్రభువు మీకు విశ్వాసముతో గొప్ప నడకను అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు నేడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
విశ్వాసమునకు కర్తవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఇప్పుడే నీతో నడిచే నడతను అనుగ్రహించు ము. దేవా, నిన్ను చూస్తూ, నీ వెనుక విశ్వాసముతో నడతను కలిగియుండడానికి సహాయము చేయుము. ప్రభువా, ఈ లోకమును ధైర్యముగా మేము చూచుటకు మాకు నీ కృపను దయచేయుము. దేవా, మేము నీ యందు విశ్వాసముంచుటకును మరియు నీలో మేము బలపడుటకును నీ దైవీకమైన శక్తిని మరియు పరిశుద్ధాత్మను మాకు దయచేయుము. ప్రభువా, కార్యములు కూలి పోతున్నప్పటికిని, మా విశ్వాసము ఎప్పటికిని విచ్ఛిన్నము చెందకూడదు మరియు ఎన్నడును కదల్చబడకూడదు. ప్రభువా, మేము ఎల్లప్పుడు నీవు మాకిచ్చిన వాగ్దానముల మీదను మరియు నీ యందు విశ్వాసము మరియు నమ్మికను కలిగి ఉండుటకు మాకు సహాయము చేయుము. అంతమాత్రమే కాదు, నీవు నిర్దేశించిన మార్గము మీద మేము నమ్మకము కలిగి జీవించునట్లు చేయుము. ప్రభువా, మేము నీ మార్గములో నడుస్తున్నప్పుడు, ఆ మార్గమును నీవు మాకు ఆశీర్వాదకరముగా మార్చుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.