నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు బైబిల్ నుండి యెషయా 60:19వ వచనమును అత్యంత అద్భుతమైన వాగ్దానముగా ప్రభువు మనకు అనుగ్రహించుచున్నాడు. ఆ వచనములో, "...యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును'' ప్రకారం నాకు తెలుసును, మీ జీవితములో వెలుగు సూర్యుని ప్రకాశము వలె ప్రకాశవంతముగా ఉండవలెనని మీరు కోరుకుంటుండవచ్చును. దేవుడు కూడా మిమ్మును తన వెలుగుతో సూర్య ప్రకాశము వలె ఉంచాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. ఒక ఫర్యాయము మా చిన్న కుమార్తె స్టెల్లా రమోలా కొరకు నేను ఒక టీ-షర్టును కొనుగోలు చేసిన సమయాన్ని నాకు గుర్తుకు వచ్చినది. ఆ యొక్క టీ-షర్టు మీద, 'నీవే నా సూర్య ప్రకాశము వంటి దానవు ' అని వ్రాసి యున్నది. నేను ఆ పదమును చూచిన ప్రతి ఫర్యాయము కూడా, " నా యొక్క కుమార్తె ప్రకాశించు నక్షత్రము వలె ఉండాలని'' నేను నా కుమార్తె కొరకు దేవుని యొద్ద ప్రార్థిస్తూ ఉంటాను. అవును, మన దేవుని యొక్క హృదయము కూడా ఈ రీతిగానే ఉంచబడుతుంది. అందుచేత, ఆయన మనలను చూచి, "నేను మీకు నిత్యమైన వెలుగుగా ఉండెదను మరియు నీకు భూషణముగాను, లేక మహిమగా ఉండెదనని'' సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు భయపడకండి.

నా ప్రియులారా, ఎంతో విచారకరమేమనగా, ఈ లోకములో అనేకమంది ప్రజలుగా ఉన్నవారు, దేవునిని ఏ మాత్రము లెక్కచేయక లేక విస్మరిస్తూ, వెలుగు కొరకై సరికాని స్థలములోనికి అనగా, తప్పుడు మార్గములో వెళ్లి వెలుగును వెదకుచున్నారు. అయినప్పటికిని, బైబిల్‌లో కీర్తనలు 89:15వ వచనమును చూచినట్లయితే," శృంగ ధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు '' అని దేవుని వాక్యము మనకు తెలియజేయుచున్నది. దేవుని యొక్క ముఖకాంతిని చూచి నడుచుకొను వారందరు ధన్యులుగా ఉంటారు. అవును, మనము దేవుని యొక్క సన్నిధి వెలుగులో నడుచుచున్న వారిగా ఉండి ఉన్నప్పుడు మనము దేవుని యొక్క ధన్యవంతమైన ప్రజలముగా ఉన్నాము. ఇంకను మనము దేవునిలో నడచువారమగునట్లుగా ఉండి ఉన్నప్పుడు, మనము ఆయన వైపునకు చూచినప్పుడెల్లను కూడా దేవుని యొక్క సంతోషకరమైన శృంగ ధ్వనిని మనము వినగలుగుచుంటాము. కనుకనే, మీరు ప్రభువునందు ఆనందించండి.

నా ప్రియులారా, మనము క్రీస్తులో నడిచి ఉన్నప్పుడు, దేవుని యొక్క చెవికి వినబడగలిగిన శృంగ ధ్వనులను ఆలకించగలుగుతాము. అవును, పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము ఈలాగున తెలియజేయుచున్నది, ' ఆయన వాక్యము మన పాదములకు దీపమై యున్నది. ఆలాగుననే, మన త్రోవలకు వెలుగై యున్నది' అని చెప్పబడియున్నది. అందుచేతనే, బైబిల్‌లో ఎఫెసీయులకు 5:11వ వచనమును మనము చూచినట్లయితే, " గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి'' అని అపొస్తలుడైన పౌలు మనకు తెలియజేయుచున్నాడు. అందువలననే, అంధకారమైన ఈ లోకములో మీరు వెలుగు సంబంధులైన బిడ్డల వలె జీవించండి. ఇంకను దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడు సంసిద్ధముగా మనకు అందుబాటులో ఉన్నది. కనుకనే, ఆయన వాక్యము మన జీవితమునకు వెలుగును అనుగ్రహించుచున్నది. ఆలాగుననే, మన ప్రభువైన యేసు ఈ లోకమునకు వెలుగై యున్నాడు. జీవధాతయైన ఆయన వెలుగును స్వీకరించియున్న వారెవరు కూడా ఇంక మరల వారి జీవితములో ఎప్పటికిని, అంధకారములో నడవరు. యేసు వెలుగు చేత సంపూర్ణముగా నింపబడినవాడై ఉన్నందున ఆయనలో ఏమాత్రము కూడా అంధకారమే ఉండదు. కనుకనే, మనము యేసు వైపునకు చూచినప్పుడు, మన ముఖములు ఎంతగానో ప్రకాశించుచుండును. ఆయన మనలను తన యొక్క పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. అందుకే 2 కొరింథీయులకు 3:18వ వచనములో ఈలాగు తెలియజేయుచున్నది, "మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము '' అని వ్రాయబడియున్నది. అవును, పరిశుద్ధాత్ముడు లేకుండా మనము ఈ లోకములో జీవింపజాలము. ఇంకను పరిశుద్ధాత్మ లేకుండా ఇట్టి అంధకారమయమైన లోకములో ఏ మాత్రము కూడా జీవించలేము. కాబట్టి, ధైర్యము తెచ్చుకొనండి.

అవును, నా ప్రియులారా, మన ప్రభువైన యేసు మనకు మహిమగాయై యున్నాడు. ఆయనే మనకు ఘనతను అనుగ్రహించువాడై యున్నాడు. ఆయన మన యొక్క జీవితములను వెలిగించువాడై యున్నాడు. బైబిల్‌లో యెషయా 60:1 వ వచనమును చూచినట్లయితే, "నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను'' అని వాక్యము సెలవిచుచ్చుచున్నది. ఆలాగుననే, "యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును?'' అని ఎల్లప్పుడు చెబుతూ ఉండండి. అవును, నా ప్రియమైన స్నేహితులారా, అట్టి రీతిగా మీరు ఉండాలి లేక జీవించాలి. ప్రభువు మీకు నిత్యమైన వెలుగుగా, భూషణముగా ఉండును గాక. ఈ లోకంలో మీరు దేవుని వెలుగుచేత సూర్యునిలా ప్రకాశిస్తారు! నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువైన యేసు, నీవు ఈ లోకానికి వెలుగువు మరియు నీవు ఇప్పుడే మా మీద నీ వెలుగును ప్రకాశింపజేయాలని మేము కోరుచున్నాము. దేవా, నీ మహిమాన్వితమైన వెలుగును చూడటానికి మా కళ్ళు తెరవజేయుము మరియు నీ సన్నిధితో మా హృదయాన్ని నింపుము. ప్రభువా, మమ్మును ప్రకాశింపజేయుము, మరియు మా జీవితంలోని ప్రతి ప్రాంతంలో మమ్మును ప్రకాశవంతంగా ప్రకాశింపజేయుము. దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తితో, మా జీవితంలోని ప్రతి చీకటిని తొలగించి, నీ మహిమతో మమ్మును నింపుము. ప్రభువా, ఈ రోజు నుండి, నీ నిత్యమైన వెలుగు మా మీద నిలిచి, మాకు నిరీక్షణ మరియు ఆనందాన్ని తీసుకొని వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును నీ మహిమతో నింపుము, మరియు మా జీవితం గడిచే ప్రతి రోజు ప్రకాశవంతంగా మార్చుము. యేసయ్యా, మమ్మును నీ స్వరూపంలోనికి మార్చుము, మరియు నీ ప్రేమ మరియు కృపను ప్రతిబింబించనివ్వుము. నిరాశ లేదా భయం యొక్క నీడ మాలో ఉండనివ్వకుండా చేయుము. ఎందుకనగా, నీవే, మా రక్షణ మాకు వెలుగుగా ఉన్నావు. కనుకనే దేవా, నీ వెలుగును మేము చూచునట్లుగా మా కన్నులను తెరవజేయుము. దేవా, మమ్మును అన్నిటి యందు ప్రకాశింపజేయుము. ప్రభువా, నీ బిడ్డలైన మమ్మును నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మహిమ నొందునట్లు చేయుము. దేవా, నీ మహిమవంతమైన వెలుగు మా మీద ఉండునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క నిత్యమైన వెలుగుచేత మమ్మును నింపుము, ఇంక మీదట మా జీవితములో ఎటువంటి అంధకారము ఉండకుండ చేయుము. యేసయ్యా, రాబోవు దినములలో మా జీవితము అత్యధికమైన వెలుగమయముగా ఉండునట్లుగా చేయుము. దేవా, నీ మహిమలోనికి మరియు నీ స్వరూపములోనికి మమ్మును రూపాంతరపరచుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.