నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 118:6వ వచనమును తీసుకొనబడియున్నది. ఆ వచనము, "యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు?'' అన్న వచనము ప్రకారము నేడు ఇది దేవుడు మీకిచ్చుచున్న ఆదరణకరమైన వాగ్దాన వచనమై యున్నది.
నా ప్రియులారా, కీర్తనాకారుడైన దావీదు, "ప్రభువే నా పక్షమున లేకున్నట్లయితే, మనుష్యులు నన్ను సజీవముగా మ్రింగివేసియుండేవారు'' అని చెపియున్నాడు. అవును, 'దేవుడు మనుష్యులను నా తల మీదుగా నడిచివెళ్లునట్లుగా అనుమతించియున్నాడు. కనుకనే, నేను అగ్నిలో నుండియు, నీళ్లలో నుండియు వెళ్లియున్నాను అని అతడు తెలియజేశాడు. ' అవును, నా స్నేహితులారా, అనేకసార్లు మనుష్యులు మన మీద నుండి నడిచి వెళ్లడానికి వారిని అనుమతినిస్తాడు. ప్రత్యేకముగా వారు మనకు విరోధంగా తప్పుడు సాక్ష్యములు మరియు నిందారోపణలు, ఇంకను దోషారోపణలను తీసుకొని వస్తారు. అది అన్యాయమైనది. అప్పుడు మనము, " ప్రభువా, నీవు ఎక్కడ ఉన్నావు? నీ న్యాయము ఎక్కడ ఉన్నది, అని రోధిస్తుంటాము.'' కొంతమంది సంతానము లేనివారు ఈ రీతిగా మొఱ్ఱపెడుతూ ఉంటారు, "ప్రభువా, మేము అవమానము గుండా వెళ్లడానికి ఎందుకు అనుమతిస్తున్నావు? ఆలాగుననే, ఉద్యోగాలను కోల్పోయిన వారు కూడా, 'ప్రభువా, మేము అవమానము గుండా వెళ్లడానికి ఎందుకు అనుమతిస్తున్నావు?' అని అంటుంటారు. ఈ లోకము బహు చెడ్డది. అనేక ఫర్యాయములు ఎంతోమంది దుష్ట ప్రజలు మన తల మీదగా నడిచి వెళ్లునట్లుగా దేవుడు వారికి అనుమతిస్తాడు. అప్పుడే దేవుడు వారికి తన శక్తిని కనుపరుస్తాడు. ఆయన, 'దుష్టులారా, ఎంత సమయమైన నా బిడ్డల తల మీద నడిచి వెళ్లిపోండి, తప్పుడు కేసులు వారి మీద మోపండి, వారిని గురించి తప్పు విషయాలు మాట్లాడండి. మీ దుష్ట శక్తి చేత వారిని భయపెట్టండి. తప్పుగా వారి మీద దోషారోపణ చేయండి. అయినప్పటికిని, నేను నా బిడ్డలకు న్యాయము జరిగించుట ద్వారా మీ అందరికంటె వారిని హెచ్చుగా లేవనెత్తుదును. సరియైన సమయములో నేను వచ్చి వారిని లేవనెత్తెదను' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు భయపడకండి.
అవును, నా ప్రియులారా, ఇంకను యోవేలు 2:25,26వ వచనములలో ప్రభువు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, " మీరు కడుపార తిని తృప్తిపొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిత్తును. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు'' అని దేవుడు మీ పట్ల వాగ్దానము చేసినట్లుగానే, చీడ పురుగులు మరియు కీటకాలు వచ్చి, మీ ఆశీర్వాదాలను తినివేసి ఉండవచ్చును. కానీ, ఆయన మిమ్మును చూచి, ' నేడు అవి తినివేసిన వాటన్నిటికిని మీకు న్యాయయము జరిగింతును. నేను మీ సంవత్సరములను మరల మీకు అనుగ్రహించెదను, నేను మీ చేతి పనిని ఆశీర్వదించెదను. నేను మీ బిడ్డలను ఆశీర్వదించెదను. మీరు గృహ నిర్మాణము చేసి అందులో నివసించెదరు' అని వాగ్దానము చేయుచున్నాడు. అవును ఇది మీ కొరకైన దేవుని వాగ్దానము.
కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు భయపడకండి. నరులు మీకేమి చేయగలరు? యేసు సిలువలో అటువంటి అవేదన గుండా వెళ్లియున్నాడు. వారు ఆయన మీద తప్పుగా దోషారోపణ చేశారు. వారు ఆయనను కొట్టి యున్నారు. ఆయన ముఖము మీద ఉమ్మివేసారు. ఆయనలో ఏ పాపము లేకపోయినప్పటికిని, ఆయనను సిలువలో వ్రేలాడదీయ్యడానికి ప్రభుత్వము తప్పుగా తీర్పు ఇచ్చియున్నది. అందరు అసూయ చెందారు. ప్రత్యేకంగా అధికారములో ఉన్నవారు కూడా ఆయన మీద అసూయ చెందారు. ఎందుకనగా, ఆయన ప్రాణమును త్యాగము చేసినందున లోకములో ఉన్నవారందరు కూడా ఆయనను వెంబడిస్తున్నారు. ఎందుకంటే, ఈ లోకములోనికి ఆయన జీవమును తీసుకొనివచ్చాడు. కానీ, యేసు సిలువను అధిగమించి, జయించాడు. కేవలం మీకు సహాయము చేయడాని కొరకు, ఆయన మరణించి మూడవ రోజున లేచియున్నాడు. ఆయన మీకు న్యాయమును చేస్తాడు. కాబట్టి, మీరు మీ హృదయములో గాయము నొందియున్నారా? మీ యొక్క జీవితములోను, ప్రభువు మీ పక్షమున ఉన్నాడు. భయపడకండి, మీ శత్రువుల యెదుట ఆయన మీ బల్లను సంసిద్ధము చేయువాడై యున్నాడు. ఆయన మీ తలను నూనెతో అంటియున్నాడు. ఆయన మీకు ఔన్నత్యమును అనుగ్రహించువాడు ఆయనే. ఇంకను మీ బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములు మీ వెంట వచ్చునట్లుగా చేస్తాడు. శత్రువుల యొక్క దాడులు ఇక కొంతకాలము మాత్రమే. కనుకనే, ధైర్యముగా ఉండండి. ప్రభువునందు ఆనందించండి.
కలకత్తా నుండి అష్టమి బావురి అను ఒక సహోదరి తన సాక్ష్యమును ఈలాగున పంచుకున్నారు. ఆమె 19 సంవత్సరములుగా ఒక యింట పనిచేయుచుండెను. ఆమెకు చదువు లేదు. ఆమె తల్లి విధవరాలు. యేసు అంటే వారికి ఏమియు కూడా తెలియదు. కుటుంబములో ఉన్నవారు వారికి ఎంతో శ్రమను కలిగించారు. ఇంకను వారిని వేదిస్తున్నారనే కారణముతో ఒక సహోదరుని భార్య, వారికి విరోధముగా తప్పుడు కేసును బనాయించారు. అది నిజము కాదు, అది అబద్ధము. ఆమెకు చదువు లేదు కనుకనే, ఆమెకు ఏ విధంగా పోరాడాలో తెలియలేదు. ఎవరో ఒకరు ఆమెను కలకత్తాలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు తీసుకొని వెళ్లారు. ప్రార్థనా యోధులు ఆమెతో కలిసి ఎంతో భారముతో యేసుప్రభువునకు మొఱ్ఱపెట్టారు. ఆమె ప్రార్థనా గోపురము నుండి బయటకు అడుగు పెట్టగానే, లాయరు ఆమెను పిలిచి, ఆమెకు అభినందనను తెలియజేశాడు. మీకు విరోధముగా తప్పుడు కేసును బనాయించిన వారి కేసును జడ్జిగారు ఆ యొక్క కేసును కొట్టివేశారు. మీరు మీ కోర్టు కేసు నుండి ఇప్పుడు విడుదల పొందియున్నారు అని చెప్పాడు. అవును నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ కొరకు న్యాయము జరిగిస్తాడు. ఆయన మీ ఉద్యోగములో మీకు ఔనత్యమును అనుగ్రహిస్తాడు. మీ కుటుంబమును భద్రపరచి, మిమ్మును వర్థిల్లింపజేస్తాడు. ఇంకను మీ కోర్టు కేసులలో కూడా మీ పక్షమున న్యాయముతో ఆయన మంచి ఆజ్ఞలను మీకు దయచేస్తాడు. మీకు సంతానము కలిగించి, మీ అవమానమును కొట్టివేస్తాడు. మరియు మీరు పొందుకున్న బాధ మరియు నష్టమునకు బదులుగా, రెండింతలుగా ఆయన మీకు మేలులను అనుగ్రహించి, నేటి వాగ్దానము మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీవు ఎల్లప్పుడూ మా పక్షమున ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మేము దేనికిని భయపడము, ఎందుకంటే నీవు మా రక్షకుడు మరియు మా కేడెము. ప్రభువా, మా దుష్టులు మాకు వ్యతిరేకంగా లేచి, మాకు కీడు మరియు హాని కలిగించాలని కోరినప్పుడు, నీవు మా ప్రతి కష్టాల కంటే మమ్మును పైకి లేపుతావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీవు తగిన సమయంలో నీ శక్తిని మరియు నీతిన్యాయాన్ని మా పట్ల వెల్లడిపరచుము. దేవా, శత్రువులచేత దొంగిలించబడిన సంవత్సరాలను మరల మాకు పునరుద్ధరించు, ప్రభువా, మా చేతుల పనిని దీవించుము. తండ్రీ, నీవు యేసును సమాధి నుండి లేపినట్లుగానే, మా శ్రమల నుండి మమ్మును పైకి లేవనెత్తి, మమ్మును సమృద్ధిగా ఆశీర్వదించుము. దేవా, మా శత్రువుల కన్నుల యెదుట నీవు మమ్మును లేవనెత్తుము. దేవా, నీవు మా పక్షమున మాతో నిలబడుము మరియు మా కొరకు మా శత్రువుల యెదుట మాకు భోజనపు బల్లను సిద్ధపరచుము, ఇంకను మా తలను నూనెతో అభిషేకించుము, నీ దయ మరియు కృపాక్షేమములు మా బ్రతుకు దినములన్నియు మమ్మును వెంబడించునట్లు చేయుము. దేవా, నీతో జరిగే ప్రతి దాడి తాత్కాలికమేనని, నీ న్యాయం గెలుస్తుందని మాకు తెలుసు. కనుకనే, నేడు మా కోర్టు కేసు నుండి మాకు విడుదలను దయచేసి, మా పట్ల న్యాయము జరిగించుము మరియు మా మీద ఉన్న అవమానమును తొలగించి, మాకు రెండంతలుగా ఆనందమును దయచేయుమని యేసుక్రీస్తు నీతిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.